నాగార్జున‌తో బిగ్‌ డీల్ కుదుర్చుకున్న మాస్ట‌ర్‌

17 Oct, 2020 15:38 IST|Sakshi

బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించిన నాగ్‌

త్యాగానికి పూనుకున్న మాస్ట‌ర్‌

గ‌త కొద్దిరోజులుగా బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ వ్యాఖ్యాత మార‌నున్నాడంటూ బోలెడ‌న్ని వార్తలు వినిపించాయి. మొద‌ట అనుష్క‌, త‌ర్వాత ర‌మ్య‌కృష్ణ‌, ఈ మ‌ధ్య రోజా పేర్లు వినిపించాయి. కానీ బిగ్‌బాస్ యాజ‌మాన్యం వీటిని ఖండిస్తూ ఎలాంటి ప్ర‌క‌ట‌నా వెలువ‌డించ‌లేదు. వీకెండ్‌లో నేరుగా నాగార్జునే క‌నిపించ‌డంతో అవ‌న్నీ గాలివార్త‌లేన‌ని తేలిపోయాయి. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం నేడు, రేపు కూడా కూడా నాగార్జునే హోస్ట్‌గా అల‌రించ‌నున్నారు. వీక్ డేస్‌లో ఇంటిస‌భ్యులు చేసిన త‌ప్పొప్పుల‌ను ఎత్తిచూపుతూ వారితోనే స‌వ‌రించ‌నున్నాడు. కాగా ఈ వారం ప్రారంభంలో బిగ్‌బాస్ కంటెస్టెంట్ల‌తో డీల్స్ కుదుర్చుకుని టాస్క్ చేయించిన సంగ‌తి తెలిసిందే. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అర‌గుండుకు మాస్ట‌ర్ ఒప్పుకుంటాడా?)

అందులో ఒక‌టైన‌ అర‌గుండు, అర‌గ‌డ్డం గీసుకోవ‌డానికి మాత్రం ఏ ఒక్క‌రూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. అఖిల్ టీమ్‌లో ఉన్న‌ అమ్మ రాజ‌శేఖ‌ర్‌ చేస్తాన‌ని ముందుకు వ‌చ్చినప్ప‌టికీ ఆఖ‌రు నిమిషంలో త‌న వ‌ల్ల కాద‌ని వెనుక‌డుగు వేశాడు. కానీ నాగ్ మ‌రోసారి ఇదే టాస్కు ఇస్తూ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించారు. అర‌గుండు గీసుకుంటే త‌ర్వాతి వారం నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు ఉంటుంద‌ని వెల్ల‌డించారు. దీంతో మాస్ట‌ర్ డీల్‌కు అంగీక‌రించాడు. అత‌డికి నోయ‌ల్ ద‌గ్గ‌రుండి అర‌గుండు గీసాడు. దీనికి మాస్ట‌ర్ క‌న్నా దివి ఎక్కువ‌గా బాధ‌ప‌డుతోంది. ఏదేమైనా మాస్ట‌ర్ చేసిన త్యాగం వ‌ల్ల‌ వ‌చ్చే వారం నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు పొందిన‌ట్లు క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: వెన్నుపోటు పొడిచిన మాస్ట‌ర్‌పై స్వాతి బిగ్‌బాంబ్‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు