అవినాష్‌ తండ్రి అవుతాడంటోన్న నాగార్జున‌

6 Dec, 2020 17:49 IST|Sakshi

బిగ్‌బాస్ హౌస్‌లో నామినేష‌న్ అంటే చాలు ఠారెత్తిపోయే కంటెస్టెంటు ఎవ‌రయా అంటే ముందు అవినాష్ పేరే వినిపిస్తుంది. అత‌డు నామినేట్ అయిన‌వారమంతా మ‌రోలా క‌నిపిస్తాడు. తన గురించి ఎవ‌రు ఏం మాట్లాడినా వాట‌న్నింటినీ కాలిక్యులేట్ చేస్తాడు. స‌రాదాగా అన్న మాట‌ల‌ను కూడా ప్రేక్ష‌కులు ఎక్క‌డ నెగెటివ్‌గా తీసుకుంటారో, ఎక్క‌డ చెడ్డ పేరు వ‌చ్చి ఓట్లు త‌క్కువ ప‌డ‌తాయో అని తెగ భ‌య‌ప‌డిపోతుంటాడు. ఆఖ‌రికి అరియానా స‌ర‌దాగా ఆట‌పట్టిస్తూ మాట్లాడినా దాన్ని తేలిక‌గా తీసుకోలేడు. ఈ క్ర‌మంలోనే నిన్న అవినాష్‌కు, అరియానాకు మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగింది. ఆమె ఏం మాట్లాడినా దాన్ని త‌ప్పు అని చెప్తూ, అలా మాట్లాడ‌కూడ‌దు, ఇలా మాట్లాడ‌కూడ‌దు అని చెప్ప‌డాన్ని అరియానా త‌ట్టుకోలేక‌పోయింది. అత‌డిని ఏమీ అన‌లేక త‌న నెత్తి త‌నే బాదుకుంది.

ఓవైపు మ‌న‌సులో ఇంత‌లా భ‌య‌ప‌డుతున్న అవినాష్ ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డంలో మాత్రం ఎప్పుడూ వెన‌క‌డుగు వేయ‌లేదు. అంద‌రి కంటెస్టెంట్ల మీద పాట‌లు పాడుతూ, వాళ్ల‌ను న‌వ్విస్తూ, అరియానాను స‌ర‌దాగా ఏడిపిస్తూ వ‌చ్చాడు. మోనాల్‌తో పులిహోర క‌ల‌ప‌డం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. అయితే ఈ వారం అవినాష్ స్పీడుకు అఖిల్ స‌డ‌న్ బ్రేక్ వేశాడు. అత‌డిని బ్ర‌ద‌ర్ ఆఫ్ మోనాల్‌గా అభివ‌ర్ణించాడు. మోనాల్ కూడా అఖి మాట‌కే జై కొడుతూ అవినాష్‌ను అన్న‌య్య అనేసింది. దీంతో అవినాష్ త‌న ప‌రువు పోయింద‌ని తెగ ఫీల‌య్యాడు. (చ‌ద‌వండి: మోనాల్ గుట్టు ర‌ట్టు చేసిన అభిజిత్‌)

నేడు నాగార్జున.. అవినాష్ మ‌న‌సుకు తాకిన గాయాల‌ను త‌ట్టి లేపారు. అవినాష్‌కు ఎన్నిసార్లు ముద్దు పెట్టావ‌ని మోనాల్‌ను అడిగారు. దీంతో అవినాష్ మ‌ధ్య‌లో క‌ల‌గ‌జేసుకుంటూ 'చాలాసార్లు పెట్టావు, అన్నీ ఆలోచించుకుని రాయ'మ‌ని చెప్ప‌గా అత‌ను జ‌స్ట్‌ బ్ర‌ద‌ర్ సార్ అని సోహైల్ గాలి తీసేశాడు. ‌దీంతో ఫ్ర‌స్టేట్ అయిన అవినాష్ 13 వారాలు గడిచిపోయాయి. అంద‌రూ క‌లిసి ఆమెతో అన్న‌య్య అని పిలిపించారు సార్. చ‌చ్చిపోవాల‌నిపించింది అని నాగ్‌తో త‌న గోడు వెల్ల‌బోసుకున్నాడు. దీంతో నాగ్ ఇది అన్యాయ‌మంటూ స‌పోర్ట్ ఇచ్చిన‌ట్లే ఇచ్చి ఫాద‌ర్ అని పిల‌వాల్సింది అని పంచ్ వేశారు. ఈ దెబ్బ‌తో అవినాష్ ముఖం వాడిపోగా అత‌డి ప‌రిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో ప‌డ్డ‌ట్లైంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఈ సారి కూడా అమ్మాయిల‌కు నో ఛాన్స్)

మరిన్ని వార్తలు