సాక్ష్యాల‌తో స‌హా హారిక నిజ స్వ‌రూపం బ‌ట్ట‌బ‌య‌లు

28 Nov, 2020 23:12 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లోనే ఈ వారం అత్య‌ధికంగా 9.5 కోట్ల ఓట్లు వ‌చ్చాయ‌ని నాగ్ స‌గ‌ర్వంగా వెల్ల‌డించారు. అలాగే గుంటూరులో ఓ వ్య‌క్తికి బిగ్‌బాస్ చూపిస్తూ స‌ర్జ‌రీ చేశార‌న్న వార్త‌ను కంటెస్టెంట్ల‌తో పంచుకున్నారు. ఇక ఇంటిస‌భ్యులు హారిక‌ను బెస్ట్ కెప్టెన్‌గా, అరియానాను వ‌ర‌స్ట్ కెప్టెన్‌గా పేర్కొన్న‌ప్ప‌టికీ నాగ్ అందుకు ఏమాత్రం ఒప్పుకోలేదు. అరియానా వ‌ర‌స్ట్ కెప్టెన్ కాద‌ని తేల్చి చెప్ప‌గా హారిక బెస్ట్ కెప్టెన్ కానే కాద‌ని కుంబ బ‌ద్ధ‌లు కొట్టి వీడియోల‌తో స‌హా నిరూపించ‌డం విశేషం. హారిక చేసిన త‌ప్పుల‌న్నింటినీ సాక్ష్యాధారాల‌తో స‌హా ఆమె ముందుంచాడు. మొద‌ట క‌వ‌ర్ చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన హారిక ఒక్కో వీడియోను చూపిస్తూ ఉండేస‌రికి స‌మాధానం దొర‌క్క నీళ్లు న‌మిలింది.

వీడియోల‌తో హారిక గుట్టు ర‌ట్టు
నాగార్జున స్టేజీపైకి వ‌చ్చీరాగానే హారికను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచి పంచాయితీ పెట్టారు. ఈ వారం ఆమె చేసిన త‌ప్పుల చిట్టాను ఒక్కొక్క‌టిగా చెప్తూ ఆమె క‌ళ్ల ముందు క‌మ్ముకున్న మేఘాల‌ను తొల‌గించాడు. మొద‌టి వీడియో క్లిప్పింగ్‌లో అభిజిత్‌ మోనాల్‌ను డేట్‌కు తీసుకెళ్లడ‌మేంట‌ని ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ తెగ‌ ఫ్ర‌స్టేట్ అయ్యాడు. ఓ నిమిషం కూడా ఆలోచించ‌కుండా ఆ టాస్కే చేయ‌న‌ని తేల్చి చెప్పాడు. దీని గురించి నాగ్ స్పందిస్తూ.. ఒక‌ కెప్టెన్‌గా నువ్వు.. అత‌డు ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నా ఆప‌లేదు, అలాగే టాస్క్ ఆడ‌క‌పోయినా ఏమీ చేయ‌లేదు అని విమ‌ర్శించారు. అయితే అభిజిత్ మోనాల్‌ను ఏడిపించ‌లేద‌ని టాస్క్ చేయ‌లేద‌ని హారిక చెప్ప‌గా మ‌రో రెండు వీడియో ప్లే చేశారు. మీ మమ్మీ వ‌స్తే నేను దాక్కుంటా, లేక‌పోతే నేను ఏడిపించాను అని న‌న్ను తిడ‌తారు అని అభిజిత్ మోనాల్‌ను ఏడిపించాన‌ని అత‌డే స్వ‌యంగా ఒప్పుకున్నాడు. ()

అభిజిత్‌కు ఫేవరిటిజ‌మ్ చూపించావు
మ‌రో దాంట్లో.. మీ మ‌మ్మీ చూస్తుంది కానీ నువ్వెందుకు నావైపు చూడట్లేదు అని అభి మోనాల్‌తో మాట్లాడాడు. మోనాల్ చూడ‌ట్లేద‌ని బాధ‌ప‌డ‌తూనే మ‌ళ్లీ ఆమె విష‌యంలోకి లాగొద్ద‌ని అభి బీరాలు ప‌లుకుతాడ‌ని నాగార్జున అన్నారు.‌ కెప్టెన్‌గా నువ్వు అభికి ఫేవ‌రిటిజ‌మ్ చూపించావు అని హారిక‌ను విమ‌ర్శించారు. నువ్వు మోనాల్ వ‌ల్ల కెప్టెన్ అయ్యావు కానీ అభి కోసం ప‌ని చేశావు అని ఒక్క‌మాట‌లో తేల్చి చెప్పారు. అబ్బాయిల‌తో పోరాడి మ‌రీ మోనాల్ నిన్ను కెప్టెన్ చేసింద‌ని గుర్తు చేశాడు. కానీ నామినేష‌న్‌లో నువ్వు మాత్రం సోహైల్ అఖిల్‌తో స్వాప్ కావ‌డానికి రెడీగా ఉన్నా కూడా నిన్ను కెప్టెన్ చేసిన మోనాల్‌ను అభితో స్వాప్ చేశావు అని విమ‌ర్శించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ బిగ్‌ షాక్‌‌.. వరస్ట్‌ పెర్ఫార్మర్‌గా అభిజిత్‌)

నువ్వు బెస్ట్ కెప్టెన్ కాదు..
స‌రైన వ్య‌క్తి(అఖిల్‌)తో స్వాప్ చేయ‌మ‌ని అడిగితే నువ్వు అభితో చేశావు. త‌ర్వాత ఆమె ద‌గ్గ‌ర‌కు వెళ్లి కూడా అదే అన్నావు. అఖిల్‌తో అయితే నేను స్వాప్ చేయ‌లేను అని చెప్పావు. ఈ విష‌యం కాసేపు ప‌క్క‌న పెడితే మోనాల్‌కు సాయం చేశాను కాబ‌ట్టి ఈసారి అవినాష్‌కు స‌పోర్ట్ చేస్తున్నా అని ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ అత‌డే పొందేలా చేశావు. కానీ అస‌లు మోనాల్‌కు ఎక్క‌డ సాయం చేశావు? అని నిల‌దీస్తూ దానికి సంబంధించిన వీడియో చూపించారు. అందులో బ‌జ‌ర్ మోగిన త‌ర్వాత హారిక నిదానంగా బ‌ట్ట‌లు మోసుకుంటూ వ‌చ్చింది. ఆరోజు అవినాషే గెలిచాడు. అలాంట‌ప్పుడు ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ కోసం అత‌డికే ఎందుకు స‌పోర్ట్ చేశావు అని నిల‌దీయ‌డంతో ఆమె స‌మాధానం చెప్ప‌లేక నీళ్లు న‌మిలింది. అభిజిత్ అటు ఆకులు లెక్క‌పెట్ట‌లేదు, మోనాల్‌తో డేట్ చేసే టాస్క్ చేయ‌లేదు. అయినా కెప్టెన్‌గా నువ్వు ఏమీ అన‌లేదు.. అంటే నువ్వు ఫేవ‌రిటిజ‌మ్ చూపించావు. కాబ‌ట్టి నువ్వు బెస్ట్ కెప్టెన్ కాద‌ని నాగ్ తేల్చి చెప్ప‌డంతో ఆమె క‌న్నీళ్లు పెట్టుకుంది. (చ‌ద‌వండి: అవినాష్‌ను కాద‌ని అభికే ఓటేస్తానంటోన్న బుల్లెట్ భాస్క‌ర్‌)

చివ‌రికి త‌న త‌ప్పిదాల‌ను అన్నింటినీ ఒప్పుకుంటూ హారిక త‌న‌ త‌ప్పుల చిట్టాను ఏక‌రువు పెట్టింది.
నామినేష‌న్‌లో మోనాల్‌ను త‌న కోరిక మేర‌కు న‌చ్చిన‌వాళ్ల‌తో స్వాప్ చేయలేదు
ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ వ‌చ్చిన‌ప్పుడు అవినాష్‌కు కాకుండా మిగ‌తావాళ్ల‌కు స‌పోర్ట్ చేయ‌లేదు.
అభిజిత్ టాస్కులు ఆడ‌న‌ప్పుడు కూడా ఏమీ అన‌లేదు.
అభిజిత్‌ ఇంగ్లీష్ మాట్లాడితే ఏమీ అన‌లేదు అంటూ త‌న కెప్టెన్సీలో జ‌రిగిన త‌ప్పుల‌ను అంగీక‌రించింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు