బిగ్‌బాస్‌: ఆ ఇద్ద‌రి ప‌రువు తీసిన నాగ్‌

29 Nov, 2020 18:46 IST|Sakshi

బిగ్‌బాస్ షోలో నిన్న‌టి ఎపిసోడ్ వాడివేడిగా జ‌రిగింది. నాగార్జున పెట్టిన చీవాట్ల‌తో హారిక‌, అభిజిత్ ముఖం మాడిపోయింది. ఎప్పుడూ స‌ర‌దాగా ఉండే హోస్ట్ ఇలా త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ విరుచుకుప‌డుతుండ‌టంతో మిగ‌తా కంటెస్టెంట్లు కూడా బెదిరిపోయారు. అందుకే మీరు చేసిన త‌ప్పులు చెప్పండి అంటే సోహైల్ తను చేసిన త‌ప్పుతో పాటు ఓ అబ‌ద్ధం కూడా చెప్పాన‌ని చెప్పాడు. దె‌య్యం టాస్కులో గ‌దిలోకి వెళ్లిన తాను, అఖిల్ గ‌జ‌గ‌జ వ‌ణికిపోయామ‌ని గుట్టు విప్పాడు. మొత్తానికి ఈ సీజ‌న్‌లో దెయ్యం టాస్కు జ‌నాల‌ను న‌వ్వించ‌డ‌మే కాక కంటెస్టెంట్ల కోప‌తాపాలు కూడా కాసేపు మ‌ర్చిపోయేలా చేసింది. అయితే ఈ టాస్కులో దెయ్యానికే ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తామ‌ని బీరాలు ప‌లికిన అఖిల్‌, సోహైల్‌ హార‌ర్ ఎఫెక్ట్స్‌కు చిన్న‌పిల్ల‌ల్లా భ‌య‌ప‌డి అరిచి ఏడిచిన‌ వీడియోను అంద‌రికీ చూపించి ప‌రువు తీశారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: నాగ్‌పై అభిజిత్ ఫ్యాన్స్‌ ఫైర్)

అలాగే నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో మ‌రోసారి దెయ్యం సెట్టింగు రెడీ చేశారు నాగ్‌. ఈసారి జంట‌లుగా కాకుండా కంటెస్టెంట్ల‌ను ఒక్కొక్క‌రిగా లోనికి పంపించారు. ఈ క్ర‌మంలో కొంద‌రు భ‌య‌ప‌డుతూనే లోనికి అడుగు పెట్ట‌గా మ‌రికొంద‌రు భ‌యాన్ని క‌వ‌ర్ చేసుకునే ప్ర‌య‌త్నంలో విఫ‌ల‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. మొత్తానికి జ‌ల‌జ దెయ్యం ఇంటి స‌భ్యులంద‌రినీ మ‌రోసారి ఆడేసుకుంది. ఇక ప్రోమో చివ‌ర్లో అరియానా, అవినాష్ ఇద్ద‌రే ఎలిమినేష‌న్‌లో మిగిలిన‌ట్లు చూపించారు. అంటే అఖిల్‌, మోనాల్ సేఫ్ అయ్యార‌ని ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎలాగో అవినాష్ ఫ్రీ ఎవిక్ష‌న్ పాస్ ఉప‌యోగించుకుని ఈ వారం ఎలిమినేష‌న్ నుంచి గ‌ట్టెక్కాడని వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ వారం ఎలిమినేష‌న్ లేన‌ట్లే క‌నిపిస్తోంది. (చ‌ద‌వండి: కాళ్లు ప‌ట్టుకుంటే బాగోదు, ప్లీజ్‌..: అవినాష్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు