అలా చేస్తే పోలీసులు మోకాళ్లు విర‌గ్గొడ‌తారు

10 Oct, 2020 19:45 IST|Sakshi

'పుచ్చ ప‌గిలిపోద్ది' డైలాగ్‌పై నాగ్ సీరియ‌స్‌

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో నాలుగో వారం ఎలిమినేష‌న్ స‌మ‌యంలో కొంద‌రు చాలా బాధ ప‌డ్డారు. స్వాతి వెళ్లిపోయినందుకు కాదు, మెహ‌బూబ్ ఇంకా హౌస్‌లోనే ఉన్నందుకు! ఆఖ‌రు నిమిషంలో అదృష్టం అత‌ని వైపు ఉండేస‌రికి ఆయ‌న బిగ్‌బాస్ ఇంట్లో ఉంటున్నాడు. కానీ ఈపాటికే ఎలిమినేట్ అవాల్సింది. అయినా త‌న‌కొచ్చిన ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోకుండా ఎప్ప‌టిలాగే అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. బీబీ హోట‌ల్ టాస్క్‌లో రెచ్చిపోయి మ‌రీ ఒక్క మాట తేడా వ‌చ్చినా పుచ్చ ప‌గిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చాడు. దీంతో సోహైల్ సైతం షాక్ తిన్నాడు. ఆ మాట అన‌డం క‌రెక్ట్ కాద‌ని చెప్పాడు. (చ‌ద‌వండి: బిగ్‌ బాస్‌ : ఒక్క మాట తేడా వచ్చినా.. పగిలిపోతుంది)

'రౌడీయిజం ఊర్లో చేస్కో..' అని మెహ‌బూబ్‌పై అవినాష్ ఫైర్ అయిన విష‌యం తెలిసిందే. అయితే పుచ్చ ప‌గిలిపోద్ది అనే డైలాగ్‌ను నాగ్ సైతం ఖండించారు. 'బ‌య‌ట హోట‌ల్‌లో అలా మాట్లాడితే మెడ ప‌ట్టుకుని బ‌య‌ట‌కు గెంటేసి 100కు ఫోన్ చేస్తారు. అప్పుడు పోలీసులు మోకాళ్లు విర‌గ్గొడ‌తారు' అని ఫైర్ అయ్యారు. దీంతో త‌ను చేసింది ఎంత పెద్ద త‌ప్పో బోధ‌ప‌డిన‌ మెహ‌బూబ్ సిగ్గుతో త‌ల దించుకున్నాడు. నేటి ఎపిసోడ్‌లో ఒక్క మెహ‌బూబ్‌కు మాత్ర‌మే కాదు, అబ్బాయిలంద‌రికీ కోటింగ్ ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. అలాగే అర్థం ప‌ర్థం లేని కార‌ణాల‌తో ఒక‌రినొక‌రు నామినేట్ చేసుకున్న లాస్య‌, దివికి కూడా చీవాట్లు పెట్టిన‌ట్లు టాక్‌. (చ‌ద‌వండి: సుజాత‌ది ఫేక్ న‌వ్వు, మోనాల్ ఆడుకుంటోంది)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు