బిగ్‌ బాస్‌ : దివి ‘పప్పు’ రీజన్‌పై నెటిజన్ల ట్రోలింగ్‌

6 Oct, 2020 13:41 IST|Sakshi

బిగ్‌ బాస్‌ షోలో అసలు సిలలైన హాట్‌ వాతావరణం సోమవారం ఎపిసోడ్‌లో నెలకొంది. ఇన్నాళ్లు చిన్న చిన్న గొడవలతో సాగుతూ వస్తున్న బిగ్‌ బాస్‌ షో.. నిన్న మాత్రం రచ్చ రచ్చగా మారింది. నాలుగు వారాలుగా కలిసి మెలిసి ఉన్నామనే విషయాన్ని పక్కనపెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు, దూషణలతో రెచ్చిపోయారు. మామలుగా నామినేషన్‌ ప్రక్రియ మొదలవగానే హౌస్‌లో గొడవలు మొదలవడం పరిపాటి. అయితే ఈ వారం మాత్రం నామినేషన్‌ ప్రక్రియ కాస్త సీరియస్‌గా జరిగిందని చెప్పాలి. నామినేషన్‌ ప్రక్రియలో భాగంగా ఒక్కో ఇంటి సభ్యుడు ఇద్దరిద్దరి చొప్పున నామినేట్ చేసి వారి ముఖంపై స్నో(నురగ)ను పూయాలని.. అలాగే ఎందుకు నామినేట్ చేస్తున్నారో కారణాలు కూడా చెప్పాలని బిగ్‌ బాస్‌ ఆదేశించాడు. అయితే కొంతమంది బలమైన రీజన్‌ చెప్పి నామినేట్‌ చేయగా, మరికొంత మంది సిల్లీ రీజన్‌తో నామినేట్‌ చేసి అభాసుపాలయ్యారు. 
(చదవండి : బిగ్‌బాస్‌ : తెరపైకి ‘ఒరేయ్‌’ ఇష్యూ.. ఏడ్చిన మోనాల్‌)

ముఖ్యంగా దివి లాస్యను నామినేట్‌ చేస్తూ చెప్పిన రీజన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. లాస్య పప్పు చేయడం వల్లే ఇంట్లో అందరికి మోషన్స్‌, వాంతులు అవుతున్నాయని, అందుకే ఆమెను నామినేట్‌ చేస్తున్నాని చెప్పింది. కానీ దివి చెప్పిన కారణాన్ని లాస్య ఒప్పుకోలేదు. తాను పప్పు చేయడం వల్లే ఇంట్లో వాళ్లకి మోషన్స్‌, మామ్టింగ్స్‌ అవుతున్నాయంటే తాను ఒప్పకోనని, ఫ్రిజ్‌లోని చల్లటి పప్పును డైరెక్ట్‌గా తీసుకొని తినడం వల్ల అలా అవుతుందని తేల్చి చెప్పింది. ఇక దివి చెప్పిన కారణాన్ని గంగవ్వ సైతం తప్పుపట్టింది. లాస్య చేస్తున్న వంటలు తిని, ఇలా అనడం సరికాదని దివిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
(చదవండి : బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?)

‘బిగ్‌ బాస్‌’ ఫ్యాన్స్‌ సైతం దివి రీజన్‌ను తప్పుబడుతున్నారు. లాస్య విషయంలో దివి చెప్పిన ‘పప్పు’  రీజన్‌ సిల్లీగా ఉందంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇక మరికొంత మంది దివికి సపోర్ట్‌ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. కిచెన్‌ క్లీన్‌ ఉంచడం లేదంటూ,  పాత్రలు కడగమంటే ఆ పని చేయనని చెప్పిదంటూ దివిని లాస్య నామినేట్‌ చేసింది. లాస్య చెప్పిన రీజన్‌ కూడా బలమైంది కాదని, అందుకే దివి అలాంటి రీజన్‌ చెప్పిందని, చెల్లుకు చెల్లు అని మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు. కాగా, ఐదోవారం నామినేషన్స్‌లో అఖిల్, నోయల్, అభిజిత్, సొహైల్, అమ్మ రాజశేఖర్, మోనాల్, లాస్య, సుజాత, అరియానా‌లు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు