స‌మంత హోస్టింగ్‌పై నెటిజ‌న్ల రియాక్ష‌న్!

26 Oct, 2020 17:43 IST|Sakshi

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున అక్కినేని బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆయ‌న న‌టిస్తున్న‌ వైల్డ్‌డాగ్ షెడ్యూల్‌లో బిజీగా ఉండ‌టంతో 21 రోజుల త‌ర్వాతే మ‌ళ్లీ బిగ్‌బాస్ షోలో క‌నిపించనున్నారు. అప్ప‌టివ‌ర‌కు ఇత‌రులే హోస్ట్‌గా అల‌రించ‌నున్నారు. ఈ క్ర‌మంలో నాగ్ బాధ్య‌త‌ను ఆయ‌న‌ కోడ‌లు స‌మంత త‌న భుజాల మీద వేసుకుని ద‌స‌రా స్పెష‌ల్ బిగ్‌బాస్ మెగా ఎపిసోడ్‌ను మూడు గంట‌ల పాటు న‌డిపించ‌డం విశేషం. (చ‌ద‌వండి: ఎలిమినేష‌న్‌: మోనాల్‌పై తీవ్ర వ్య‌తిరేక‌త‌)

సోష‌ల్ మీడియాలో స‌మంత హోస్టింగ్ మీద ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఆమె హోస్టింగ్ అద్భుతంగా ఉందంటున్నారు. కాగా గ‌త సీజ‌న్‌లోనూ నాగ్ విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఆయ‌న స్థానంలో శివగామి రమ్యకృష్ణ హోస్ట్‌గా ర‌ఫ్ఫాడించారు. అయితే ఆమె కంటే కూడా తాజాగా బిగ్‌బాస్ మెగా ఎపిసోడ్‌ను ఒంటిచేత్తో న‌డిపించిన స‌మంత చాలా బాగా చేసింద‌ని నెటిజ‌న్లు చ‌ప్ప‌ట్లు చ‌రుస్తున్నారు. ఇదే విష‌యంపై సోష‌ల్ మీడియాలో పోల్ నిర్వ‌హించ‌గా 74 శాతం మంది స‌మంత హోస్టింగ్ బాగుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. (చ‌ద‌వండి: మ‌నాలిలో నాగ్‌: బిగ్‌బాస్‌కు స‌మంత‌?)

కాగా నిన్న‌టి స్పెష‌ల్ ఎపిసోడ్‌లో నాగార్జున త‌న కోడ‌లు స‌మంతను వీడియో సందేశం ద్వారా అటు కంటెస్టెంట్ల‌కు, ఇటు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశారు. తెలుగు అంత చ‌క్క‌గా మాట్లాడ‌లేన‌ని, అందుకు క్ష‌మించాల‌ని స‌మంత కోర‌డం అంద‌రి చేత ప్ర‌శంస‌లు ద‌క్కించుకుంటోంది. ఇక వ‌చ్చీరాగానే కంటెస్టెంట్ల‌పై ఫీడ్‌బ్యాక్ ఇస్తూనే కుదిరిన చోట‌ల్లా కౌంట‌ర్లు వేసింది. అలాగే త‌న న‌వ్వుతో అభిమానుల‌కు రెట్టింపు సంతోషాన్ని అందించింది. ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా షోను విజ‌య‌వంతంగా న‌డిపించి మామ‌కు త‌గ్గ కోడ‌లు అనిపించుకుంది. మ‌రి మిగ‌తా మూడు వారాలు కూడా స‌మంతే వ‌స్తుందా? లేదా మిగ‌తా సెల‌బ్రిటీల‌ను రంగంలోకి దింపుతారో చూడాలి. 

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు