బిగ్‌బాస్‌: తెలివైన నిర్ణ‌యం తీసుకున్న అవినాష్‌

28 Nov, 2020 20:58 IST|Sakshi

బిగ్‌బాస్ క‌థ కంచికి చేరుతోంది. ఇప్పుడున్న ఏడుగురిలో ఐదుగురికే టాప్ 5లో చోటు దొరుకుతుంది. ఫైన‌ల్‌లో చోటు ద‌క్కించుకునేందుకు కంటెస్టెంట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్పటి నుంచి జ‌రిగే ప్ర‌తి ఎలిమినేష‌న్ వారి రాత‌ను మార్చ‌నుంది. వారి నోటి నుంచి వ‌చ్చే ప్ర‌తి మాట‌, న‌డ‌త.. ప్ర‌తీది కూడా వారి గెలుపోట‌ముల‌ను నిర్ణ‌యించ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌న్నెండో వారం ఎలిమినేష‌న్ స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌గా మారింది. ఎలిమినేష‌న్ ఉంటుందా? ఉండ‌దా? ఉంటే ఎవ‌రు ఎలిమినేట్ అవుతారు? అవినాష్ ఎవిక్ష‌న్ ఫ్రీ పాస్ వాడుకుంటాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

నామినేష‌న్ అంటేనే గ‌జ‌గ‌జ‌..‌
అయితే తాజాగా అందిన స‌మాచారం ప్ర‌కారం త‌క్కువ ఓట్ల‌తో చివ‌రి స్థానంలో ఉన్న అవినాష్ త‌న పాస్‌ను ఉప‌యోగించాడ‌ట‌. దీంతో అత‌డు ఎలిమినేష‌న్ నుంచి త‌ప్పించుకున్నాడు. అదే స‌మ‌యంలో అవినాష్‌ను కాద‌ని వేరే వాళ్ల‌ని ఇంటి నుంచి పంపించేయ‌డం అన్యాయం కాబ‌ట్టి ఈసారి ఎలిమినేష‌న్ ఎత్తేశార‌ట‌. ఏదేమైనా అవినాష్ తెలివైన నిర్ణ‌య‌మే తీసుకున్నాడు. రెండు వారాల గ‌డువు ఉంది క‌దా అని పాస్‌ను దాచుకోకుండా వాడుకున్నాడు. ఇక మొద‌టి నుంచి కూడా అవినాష్‌ నామినేష‌న్ అంటేనే గ‌జ‌గ‌జలాడిపోతాడు. ఎవ‌రు త‌న‌ను నామినేట్ చేసినా శివాలెత్తుతాడు. త‌న‌కు తాను స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటూనే ఎక్క‌డ ఎలిమినేట్ అయిపోతానో అని భ‌య‌ప‌డుతుంటాడు.

సింప‌థీ గేమ్‌.. రివ‌ర్స్ అయిన గ్రాఫ్‌
కానీ అవినాష్ ఎంట్రీ ఇచ్చిన మొద‌ట్లో బిగ్‌బాస్ హౌస్ స్వ‌రూప‌మే మారిపోయింది. ఇంట్లో న‌వ్వుల న‌దిని పారిస్తూ కొత్త జోష్ నింపాడు. కానీ ఎప్పుడైతే నోయ‌ల్ ఎలిమినేట్ అవుతూ చిల్ల‌ర కామెడీ అని అవినాష్‌ను అన్నాడో అప్ప‌టి నుంచి అత‌డు కాస్త డ‌ల్ అయ్యాడు. త‌ర్వాత కామెడీ చేయ‌డానికి కూడా త‌ట‌ప‌టాయించాడు. త‌ర్వాత త‌నను జ‌బ‌ర్ద‌స్త్‌లో తిరిగి రానివ్వ‌రు, అన్నీ కోల్పోయాను, ప్రేక్ష‌కులు చూస్తున్నారు.. అని ప‌దే ప‌దే చెప్పడాన్ని కూడా  సింప‌థీ కోసం వెంప‌ర్లాడుతున్నాడ‌న్న అప‌నింద‌ను మూట‌గ‌ట్టుకున్నాడు. దీంతో అవినాష్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. ఫ‌లితంగా ఈ వారం అరియానా, అఖిల్‌, మోనాల్ క‌న్నా త‌క్కువ ఓట్లు ప‌డ్డ‌ట్టు తెలుస్తోంది. కానీ బిగ్‌బాస్ ఇచ్చిన పాస్‌తో ఈ వారం ఎలిమినేష‌న్ ఈదేశాడ‌ని సోష‌ల్ మీడియా కూడా కోడై కూస్తోంది. అలాగే రేప‌టి ఎపిసోడ్‌లో క‌న్న‌డ హీరో కిచ్చా సుదీప్ ప్ర‌త్యేక అతిథిగా రానున్నార‌ట‌. అది ఎంత‌వ‌ర‌కు నిజ‌మనేది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు