‌రెచ్చిపోయిన నోయ‌ల్‌; ఆ ఇద్ద‌రికీ వాచిపోయిందంతే!

31 Oct, 2020 19:30 IST|Sakshi

నేటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌లో పెద్ద ట్విస్టులే చోటు చేసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందిప‌డుతున్న నోయ‌ల్ స్టేజీ మీద‌కు వ‌చ్చాడు. నాగార్జున ప‌క్క‌నే ఉండి కంటెస్టెంట్ల‌తో మాట్లాడుతున్నాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే నోయ‌ల్‌స్టేజీ మీద ఉండ‌టంతో అత‌డు శాశ్వ‌తంగా హౌస్ నుంచి వెళ్లిపోతున్నాడా? అన్న అనుమానాలు మొద‌ల‌య్యాయి. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే ఇంట్లో కొంత కాలంగా నోయ‌ల్ కాలి నొప్పితో తీవ్రంగా ఇబ్బంది ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా ప్రోమోలో నోయ‌ల్ మాట్లాడుతున్న‌దాన్ని బ‌ట్టి చూస్తే అత‌డు మాన‌సికంగానూ న‌ర‌కం అనుభ‌వించిన‌ట్లు తెలుస్తోంది. అత‌డి దీనావ‌స్థ‌ను చూసి తోటి కంటెస్టెంట్లు జాలి ప‌డాల్సింది పోయి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లుగా వెట‌కారాలు చేశార‌ట‌. నోయ‌ల్ కుంటిగా ఎలా న‌డుస్తాడో చూపిస్తూ అవినాష్, నోయ‌ల్ ప‌రిస్థితి మీద జోకులు చేస్తూ మాస్ట‌ర్ అత‌డిని హేళ‌న చేస్తూ మాన‌సికంగా వేధించార‌ట‌. వారి వైఖ‌రిని నోయ‌ల్ ఆ స‌మ‌యంలోనే ఖండించాడో తెలీదు కానీ నేడు మాత్రం ఆ ఇద్ద‌రినీ దుమ్ము దులిపాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: స‌గం కాలం గ‌డిచిపోయాక మంగ్లీ‌ ఎంట్రీ?)

ఈ మేర‌కు నోయ‌ల్‌.. అమ్మ రాజ‌శేఖ‌ర్‌, అవినాష్‌ల‌ను కాసేపు ఒంటికాలిపై నిల‌బ‌డ‌మ‌న్నాడు. కానీ కాసేప‌టికే వాళ్లు నొప్పి తాళలేక‌పోయారు. మీరు ప‌డ్డ‌ కంటే వెయ్యి రెట్లు ఎక్కువ నొప్పి త‌న‌కు రోజూ ఉంటుంద‌ని, దాన్ని మీరు జోక్ చేస్తారేంటని నిల‌దీశాడు. అస‌లు మీ ప్ర‌వ‌ర్త‌న‌తో ఏం చెప్పాల‌నుకుంటార‌ని ప్ర‌శ్నించాడు. త‌ర్వాత‌ అవినాష్ అస‌లు రంగును కూడా బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. నేనెలా న‌డుస్తానో అవినాష్ న‌డిచి చూపిస్తున్నాడు, మీరు రెండు నిమిషాలు నిల‌బ‌డ‌లేక‌పోయారు. మ‌రి నాకు ఎంత పెయిన్ ఉంటుందో తెలుసా? అంటూనే ఈ చిల్ల‌ర కామెడీలు ఏంట‌ని విమ‌ర్శించాడు. దీంతో ఆగ్ర‌హించిన అవినాష్.. మీరు వెళ్తూ వెళ్తూ ఇద్ద‌రిని బ్యాడ్ చేయాల‌ని ఫిక్స‌య్యారు అని నోయ‌ల్‌పై మండిప‌డ‌గా అత‌డు మాత్రం పిచ్చ లైట్ అంటూ ఎందుకు న‌టిస్తున్నావ్ అవినాష్‌? అని కౌంట‌రిచ్చాడు. దీంతో అవినాష్ ఆవేశం మీద నీళ్లు గుమ్మ‌రించిన‌ట్లైంది. ఈ ప్రోమోపై నెటిజ‌న్లు స్పందిస్తూ నోయ‌ల్ బాధ‌లో అర్థం ఉందంటూ అత‌డికి మ‌ద్ద‌తిస్తున్నారు. అయితే అవినాష్.. వెళ్లిపోయే ముందు బ్యాడ్ చేస్తున్నావ్ అనడాన్ని బ‌ట్టి చూస్తే నోయ‌ల్ ఎలిమినేట్ అవుతున్నాడేమో అని ఆయ‌న అభిమానులు ఆందోళ‌‌న‌ వ్య‌క్తం చేస్తున్నారు. (చ‌ద‌వండి: నీకోసం ఎదురు చూస్తూ ఉంటా: హారిక‌)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు