షాకింగ్‌: ‌హౌస్‌ నుంచి వెళ్లిపోయిన నోయ‌ల్‌!

29 Oct, 2020 20:22 IST|Sakshi

బిగ్‌బాస్ ప్రేమికుల‌కు, నోయ‌ల్ అభిమానుల‌కు చేదువార్త‌. మిస్ట‌ర్ కూల్ నోయ‌ల్ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇంటి నుంచి బ‌య‌ట‌కు వచ్చేశాడు. ఈ మేర‌కు స్టార్ మా తాజాగా ప్రోమో వ‌దిలింది. గ‌త కొంత‌కాలంగా త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను పంటి కింద భ‌రిస్తూ న‌వ్వుతూ వ‌చ్చిన నోయ‌ల్‌కు ఆరోగ్యం మ‌రింత క్షీణించింది. అడుగు వేసి అడుగు వేయ‌డ‌మే క‌ష్టంగా మారింది. సరిగా విశ్రాంతి లేక మెడ న‌రాలు, భుజాలు నొప్పి పెడుతూ అత‌డిని మ‌రింత బాధించాయి. ఈ క్ర‌మంలో నిన్న‌టి బీబీ డే కేర్ టాస్క్‌లో బిగ్‌బాస్‌ నోయ‌ల్‌కు మిన‌హాయింపు క‌ల్పించాడు. నేడు అత‌డిని వైద్యులు ప‌రీక్షించ‌నున్నట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం అత‌డికి ఉన్న అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో హౌస్‌లో నెట్టుకురావ‌డం క‌ష్ట‌మ‌ని వైద్యులు తేల్చి చెప్పారు. అత‌డిని మెరుగైన చికిత్స కోసం హౌస్ నుంచి వీడ్కోలు తీసుకోమ‌ని బిగ్‌బాస్ సూచించాడు. దీంతో షాక్ తిన్న కంటెస్టెంట్లు నోయ‌ల్‌కు భారంగా వీడ్కోలు ప‌లికారు. అయితే చికిత్స పూర్త‌యిన త‌ర్వాత మ‌ళ్లీ లోనికి వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అస్వ‌స్థ‌త‌కు గురైన నోయ‌ల్)

కాగా గ‌తంలోనూ ఆరోగ్యం బాగాలేక‌పోవ‌డంతో గంగ‌వ్వ ఇంటిని వీడిన విష‌యం తెలిసిందే. ఆ స‌మ‌యంలో నోయ‌ల్ కూడా త‌న‌కు ఆరోగ్య స‌మ‌స్య‌లున్నాయ‌ని, గంగ‌వ్వ లాగే వెళ్లిపోతాన‌ని చెప్పుకొచ్చాడు. అయినా స‌రే ఇన్నివారాలు త‌న బాధ‌ను భ‌రిస్తూ హౌస్‌లో నెట్టుకురావ‌డం నిజంగా ప్ర‌శంస‌నీయం. ఇక గ‌త‌ నామినేష‌న్‌లో కాలునొప్పి అంటూ టాస్కుల‌కు దూరంగా ఉంటున్నాడ‌ని దివి అత‌డిని నామినేట్ చేసింది. ప్ర‌స్తుత ప్రోమోతో అత‌డికి చాలారోజుల నుంచే ఆరోగ్యం బాగోలేద‌ని నిరూపిత‌మైంది, అయితే ఓ మంచి కంటెస్టెంటు హౌస్‌లో నుంచి హ‌ఠాత్తుగా వెళ్లిపోవ‌డాన్ని అందరూ జీర్ణించుకోలేక‌పోతున్నారు. నోయ‌ల్‌ను మిస్ అవుతామంటూ కామెంట్లు చేస్తున్నారు. త్వ‌ర‌గా కోలుకొని, హౌస్‌లోకి రీఎంట్రీ ఇవ్వాల‌ని అభిమానులు ప్రార్థిస్తున్నారు. (చ‌ద‌వండి: బాయ్‌ఫ్రెండ్ సినిమాలు వ‌దులుకోమ‌న్నాడు: దివి)

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు