బిగ్‌బాస్‌-4: భారీ ఆఫర్‌.. నో చెప్పిన హీరోయిన్‌?

2 Aug, 2020 16:48 IST|Sakshi

బుల్లితెర సెన్సేషనల్‌ రియాల్టీ షో‘బిగ్‌బాస్‌’మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మూడు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బిగ్‌ షో.. నాలుగో సీజన్‌ కోసం ముస్తాబవుతోంది. బిగ్‌బాస్‌-4 ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుని షోను ప్రారంభించ‌నున్నారు నిర్వాహ‌కులు. ఇప్ప‌టికే హోస్ట్ నాగార్జున ప్రోమో షూటింగులో పాల్గొన్నారు. ‌ఈ మేరకు అన్నపూర్ణ స్లూడియోలో చిత్రీక‌ర‌ణ జ‌రిపారు. శుక్ర, శనివారాల్లో ఈ యాడ్‌ను చిత్రీకరించారు. ఈ నేప‌థ్యంలో, షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరనే విష‌యంపై ఆస‌క్తి నెల‌కుంది. బిగ్ బాస్ 4 లో పాల్గొనేది వీరే అంటూ సోషల్ మీడియాలో రోజుకో పుకారు వస్తుంది. (చదవండి : బిగ్‌బాస్‌ ఈజ్‌ బ్యాక్‌)

హీరో‌ తరుణ్‌, హీరోయిన్లు శ్రద్ధాదాస్‌, హంసానందిని, యూట్యూబ‌ర్ సున‌య‌న, యాంక‌ర్ విష్టు ప్రియ పేర్లు వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఇప్ప‌టికే తరుణ్‌, శ్రద్ధాదాస్‌ తాము షోలో పాల్గొన‌డం లేద‌ని క్లారిటీ ఇచ్చారు. తాజాగా  ఈ షో నిర్వాహకులు టాలీవుడ్‌ హీరోయిన్‌ పూనమ్‌ కౌర్‌ను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. పూనమ్ అయితే.. ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుందని ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు భారీ పారితోషకం ఆఫర్ కూడా చేశారట. కానీ పూనమ్ ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్టు సమాచారం. మొత్తంగా ఇపుడు బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లడానికి చాలా మంది సెలబ్రిటీలు వెనకంజ వేస్తున్నారు.కాగా, బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ జూన్‌ నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా, కరోనా కారణంగా వాయిదా పడింది.

మరిన్ని వార్తలు