బిగ్‌బాస్‌ : అఖిల్‌పై రాహుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌

26 Nov, 2020 20:16 IST|Sakshi

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ బిగ్‌ రియాల్టీ షోకు శుభం కార్డు పడటానికి మరో నాలుగు వారాలే మిగిలి ఉన్నాయి. ఇలాంటి తరుణంలో టాప్‌ 5 లో ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. హౌస్‌లో ప్రస్తుతం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఇద్దరు రానున్న రెండు వారాల్లో ఎలిమినేట్‌ అయి ఐదుగురు మాత్రమే ఫైనల్‌కి వెళ్తారు. ఇక ఫైనల్‌కు వెళ్లే టాప్‌ 5లో అభిజిత్‌, సోహైల్‌, మోనాల్‌, అవినాష్‌, అఖిల్‌ ఉంటారని కొంతమంది అంచనా వేయగా.. మరికొంత మంది హారిక, అరియానా కూడా టాప్‌ 5లో ఉంటారని చెబుతున్నారు.
(చదవండి : బిగ్‌బాస్‌ : ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్‌!)

ఇలాంటి తరుణంలో అఖిల్‌పై బిగ్‌బాస్‌ మూడో సీజన్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ఇటీవల ఆయన ఓ న్యూస్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. బిగ్ బాస్ నాల్గో సీజన్‌ విజేత ఎవరు? అఖిల్ ఎందుకు టాప్‌ 5 లో ఉండడు అనే దానిపై క్లారిటీ ఇచ్చాడు.

‘ఈ సీజన్‌లో అభిజిత్, సొహైల్‌లలో ఎవరో ఒకరు బిగ్ బాస్ విజేత కావొచ్చు. అరియానాకి కూడా ఛాన్స్ ఉంది. అఖిల్ సీక్రెట్ రూంకి వెళ్లిన తరువాత ఒక డైలాగ్ (స్ట్రాంగ్‌ కంటెస్టెంట్స్‌ని ఇక్కడ పెట్టుకొని వీక్‌ కంటెస్టెంట్స్‌తో ఏం చేస్తారు)అన్నాడు. ఆ డైలాగ్‌ బిగ్‌బాస్‌కే కాదు నాగ్‌ సర్‌కి కూడా కోపం వచ్చింది.  అందుకే బయటకు పొమ్మని.. ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని అన్నారు. అలాగే అభిజిత్‌తో కూడా మేక ప్రోటీన్స్ తిని పులిలా బయటకి వచ్చింది.. బిగ్ బాస్ హౌస్‌కి కెప్టెన్ అయ్యింది అని చెప్పడం కూడా కొంచెం మైనస్‌ అయింది’ అని చెప్పుకొచ్చారు. అయితే అఖిల్‌ కూడా నీలాగే చివరి వారాల్లో పుంజుకొని టైటిల్‌ విన్నర్‌ అయ్యే చాన్స్‌ ఉంది కదా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకి... ఆ సమయం దాటిపోయింది అంటూ తన మన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే రాహుల్‌ వ్యాఖ్యలపై అఖిల్‌ ఫ్యాన్స్‌ తీవ్రంగా మండిపడుతున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు