ఆ ఇద్ద‌రే టాప్ 2లో ఉండాలి: రాహుల్‌

2 Dec, 2020 20:51 IST|Sakshi

ఎక్క‌డ చూసినా బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్ విజేత ఎవ‌ర‌నేదానిపైనే చ‌ర్చ న‌డుస్తోంది. టాప్ 5లో ఉండేదెవ‌రు? టాప్ 2లో నిలిచేదెవ‌రు? చివ‌ర‌గా ట్రోఫీని ముద్దాడేది ఎవ‌రన్న విష‌యం జ‌నాల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప‌ద‌హారు మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైన ఈ సీజ‌న్‌లో కొత్త‌గా మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వ‌చ్చి చేర‌డంతో మొత్తం కంటెస్టెంట్ల సంఖ్య 19కి చేరింది. ప‌న్నెండు వారాలుముగిసేస‌రికి హౌస్‌లో ఏడుగురు మాత్ర‌మే మిగిలారు. అఖిల్‌, అభిజిత్‌, అరియానా, అవినాష్‌, హారిక‌, సోహైల్‌, మోనాల్ టైటిల్ రేసులో ఉన్నారు.  ఇప్ప‌టికే నేరుగా టాప్ 5లో చోటు ద‌క్కించుకునేందుకు టికెట్ టు ఫినాలే రేసు కూడా మొద‌లైంది. ఈ విష‌యాన్ని కాస్త ప‌క్క‌న పెడితే మూడు వారాల్లో ఈ సీజ‌న్‌కు మంగ‌ళం పాడ‌నున్నారు. ఈ త‌రుణంలో కంటెస్టెంట్ల గెలుపు కోసం అటు అభిమానుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా రంగంలోకి దిగారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: అవినాష్ కొంప ముంచిన అతి తెలివి)

కొంద‌రు సీరియ‌ల్స్ న‌టీన‌టులు అఖిల్‌కు మ‌ద్ద‌తిస్తుండ‌గా, విల‌క్ష‌ణ న‌టుడు సాయి కుమార్ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ముక్కు అవినాష్‌కు ఓటేయ‌మ‌ని పిలుపునిచ్చారు. యూట్యూబ్ స్టార్లు అంతా ఏక‌మై హారిక‌నే గెలిపించ‌మ‌ని కోరుతున్నారు. నాగ‌బాబుతో స‌హా మ‌రికొంద‌రు సెల‌బ్రిటీలు అభిజిత్ గెలుస్తాడ‌ని ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. ఇక‌ బిగ్‌బాస్ మూడో సీజ‌న్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త‌న స్నేహితుడు నోయ‌ల్ ఎలిమినేట్ అయ్యాక‌ అభిజిత్‌కు స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాడు. ఓ ఇంట‌ర్వ్యూలో సైతం అభిజితే విన్న‌ర్ అవుతాడ‌ని చెప్పుకొచ్చాడు. కానీ ఇంత‌లోనే ప్లేటు ఫిరాయించాడు. సోహైల్‌, అరియానా టాప్ 2లో ఉంటే చూడాల‌నుంద‌ని తెలిపాడు. ద‌మ్ముంటే జెన్యూన్‌గా ఆడేవాళ్ల‌కు స‌పోర్ట్ చేయండ‌ని, ప‌నికి రానోళ్ల‌ను బ‌య‌ట‌కు తోయండంటూ అభిమానుల‌కు పిలుపునిచ్చాడు. మొన్న‌టివ‌ర‌కు అభిజిత్ ఫేవ‌రెట్ అంటూ అత‌డే గెలుస్తాడ‌ని చెప్పాడు క‌దా అని కొంద‌రు నెటిజ‌న్లు అనుమానం వ్య‌క్తం చేస్తుండ‌టంతో.. ఫె‌ర్ఫామెన్స్‌ను బ‌ట్టి త‌న స‌పోర్ట్‌ ఉంటుంద‌ని రాహుల్‌ క్లారిటీ ఇచ్చాడు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌ : అఖిల్‌పై రాహుల్‌ షాకింగ్‌ కామెంట్స్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు