బిగ్‌బాస్‌: మోనాల్‌.. అఖిల్‌కి ముద్దులే ముద్దులు

18 Dec, 2020 18:37 IST|Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు నాల్గో సీజన్‌ మరో రెండు మూడు రోజుల్లో ముగియనుంది. దీంతో ఉన్న రెండు రోజుల్ని మరింత ఎంటర్‌టైన్‌గా మార్చేందుకు సిద్దమయ్యారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇందులో భాగంగా ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా హౌస్‌లోకి ఎలిమినేట్‌ అయిన సభ్యులను తీసుకువచ్చారు. అయితే కరోనా నేపథ్యంలో నిబంధనల్ని పాటిస్తూ.. ఎంట్రీ ఇచ్చిన వారు కంటెస్టెంట్స్‌ని డైరెక్ట్‌గా కలవనీయకుండా వారిని ఒక అద్దాల గదిలో ఉంచారు. అద్దాల గదికి ఒక్క పక్క టాప్‌ 5 కంటెస్టెంట్స్‌.. మరో పక్క ఎలిమినేట్‌ అయిన సభ్యులు ఉన్నారు.  ఈ సందర్భంగా మ్యూజిక్ వినిపించగానే అఖిల్, సోహెల్ పరుగులు పెట్టి వచ్చారు. వారికి మోనాల్ కనిపించడంతో ఆనందంతో చిందులేశారు. అఖిల్‌ అయితే అడ్డుగా అద్దాలు ఉన్న సంగతి మర్చిపోయి మోనాల్‌కి హగ్‌లు, కిస్‌లు ఇచ్చాడు.

ఇక మోనాల్‌ అయితే అఖిల్‌ని డైరెక్ట్‌గా కలవలేకపోవడంతో కాస్త బాధపడింది. కలవాలని ఉన్నా..అద్దం ఓన్లీ ప్రాబ్లెంగా ఉంది అంటూ తెగ ఫీలలైపోయింది. చైర్‌ వేసుకొని అద్దాల గోడ దూకి రా అని సోహైల్‌ సలహా ఇవ్వగా.. నో..నో అంటూ మోనాల్‌ అక్కడే నిలబడింది. అయితే ఈ సారి ఈ నర్మద కంటతడి పెట్టకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని పసిగట్టిన సోహైల్‌..బిగ్‌బాస్ ఇంటిలో 9వ వండర్ ఏమిటో తెలుసా? నువ్వు ఏడవకపోవడమే అంటూ పంచ్‌ వేశాడు. ఆతర్వాత కరాటే కల్యాణి ఇంటిలోకి హుషారుగా ప్రవేశించింది. అనంతరం లాస్య ఇంట్లోకి మళ్లీ అడుగుపెట్టింది. దాంతో వంటలక్కలిద్దరూ వచ్చారు అంటూ సోహెల్ గట్టిగా అరిచాడు. జనాలు నీ కోసం బయటకు ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తున్నారు అంటూ సోహైల్‌కు మోనాల్ చెప్పడంతో ఆనందంతో గంతులు వేశాడు.

ఇక లాస్య ఇంటి సభ్యులతో ఫన్నీ గేమ్ ఆడించింది. అఖిల్‌కు ఎక్కువ హగ్స్  లభించాయని భావిస్తున్నారా అని ఇంటి సభ్యులను అడగ్గా..ఎక్కువ మంది అవును అంటూ చెప్పడంతో అఖిల్ నో నో అంటూ ఎగిరి గంతులు వేశాడు. అరియానా గొంతు జలజ(దెయ్యం) కంటే భయంకరంగా ఉందా అంటే అందరు అవునని సమాధానమిచ్చారు. అలాగే అభిజిత్‌ ఇంటిలోనే డ్యాన్స్ నేర్చుకొన్నాడని భావిస్తున్నారా అని అడగ్గా.. అవును అందరూ అన్నారు. దాంతో అభిజిత్‌కు అంతకు ముందు డ్యాన్స్ రాదని మీ ఉద్దేశమా అని లాస్య ప్రశ్నించగా.. అందులో డౌటా? బాండ్ పేపర్ మీద రాసిస్తా అంటూ అఖిల్ అన్నాడు. గంగవ్వ, కుమార్ సాయి, నోయల్, జోర్దార్ సుజాత, దివి, మెహబూబ్, అవినాష్‌లు ఈ ప్రోమోలో కనిపించారు. 

మరిన్ని వార్తలు