నాగ్‌కు స్క్రిప్ట్ చెప్తా: కుమార్ సాయి

17 Sep, 2020 16:11 IST|Sakshi

పేరు: కుమార్ సాయి పంప‌న‌
వృత్తి: న‌టుడు, క‌మెడియ‌న్‌, ద‌ర్శ‌కుడు
స్వ‌స్థ‌లం: కొట్టార‌క్క‌ర‌, కేర‌ళ‌
విద్య‌: గ‌్రాడ్యుయేష‌న్‌
పుట్టిన తేదీ: 18 ఫిబ్ర‌వ‌రి 1990

మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబంలో పుట్టిన సాయికుమార్ పంప‌న‌కు న‌టుడు అవ్వాల‌నేది చిన్న‌నాటి కోరిక‌. పెద్ద‌య్యాక ఆ క‌ల నెర‌వేరింది. ల‌క్కీ(2012) సినిమాతో వెండితెర‌పై ప్ర‌వేశించిన‌ప్ప‌టికీ, "ఈ రోజుల్లో" చిత్రంతో గుర్తింపు సాధించుకున్నాడు. బస్టాప్‌, ల‌వ్ ట‌చ్‌, నా సామిరంగ‌, ఆడు మ‌గాడ్రా బుజ్జి, ప్రెజెంట్ ల‌వ్ వంటి ప‌లు ‌చిత్రాల్లో న‌టించాడు. కానీ, కెరీర్‌లో పెద్ద బ్రేక్ అయితే రాలేదు.

దీంతో ఈ మ‌ధ్య సినిమాల్లో క‌నిపించ‌కుండా పోయిన అత‌డు బిగ్‌బాస్ రియాలిటీ షోతో మ‌ళ్లీ ఫామ్‌లోకి రావాల‌నుకుంటున్నాడు. కానీ ఈ సారి న‌టుడిగా కాకుండా ద‌ర్శ‌కుడిగా త‌న ప్ర‌తిభ‌ను నిరూపించుకోవాల‌నుకుంటున్నాడు. అది కూడా త‌న అభిమాన హీరో నాగార్జున‌కు క‌థ చెప్పి ఒప్పించాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. కాగా బిగ్‌బాస్ తొలి వారం ఎలిమినేష‌న్ పూర్తైన రోజే మొద‌టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. అంద‌ర్ని న‌వ్విస్తూ ఎంట‌ర్‌టైన్‌ చేస్తాన‌ని ధీమాగా చెప్పుకొస్తున్నాడు. మ‌రి బిగ్‌బాస్ అత‌ని కెరీర్‌కు ప్ల‌స్ అవుతుందా? లేదా? అనేది చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు