బిగ్‌బాస్ రూల్స్ బ్రేక్ చేయండి: శ్రీముఖి స‌ల‌హా

15 Dec, 2020 23:55 IST|Sakshi

పాట పాడిన అభిజిత్‌

అఖిల్ పులిహోర‌పై సెటైర్లు

ఫైన‌లిస్టుల‌కు మాజీల సూచ‌న‌లు

తెలుగు బిగ్‌బాస్ హిందీ బిగ్‌బాస్‌ను ఫాలో అయినట్లు క‌నిపించింది. మాజీ కంటెస్టెంట్ల‌ను తీసుకువ‌చ్చి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశారు. మొద‌టి ‌సీజన్ ఫైనలిస్ట్ హరితేజ, రెండో సీజన్ రన్నరప్ గీతా మాధురి, మూడో సీజన్ రన్నరప్ శ్రీముఖితో పాటు సీజన్ 3 కంటెస్టెంట్ అలీ రెజాలకు రెట్టించిన ఉత్సాహంతో షోను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను అప్పగించారు. కానీ కోవిడ్ వ‌ల్ల నేరుగా హౌస్‌లోకి వెళ్ల‌కుండా ప్ర‌త్యేక గ‌దిలో నుంచే ఫైన‌లిస్టుల‌తో సంభాషించారు. మ‌రి 101వ ఎపిసోడ్‌లో ఈ మాజీ ఫైన‌లిస్టులు ఇప్పుడున్న కంటెస్టెంట్ల‌ను ఏమేం ప్ర‌శ్న‌లడిగారు? వారిని ఎలా ఆడుకున్నార‌నేది తెలియాలంటే ఈ స్టోరీని చ‌దివేయండి..

టాటూలు నిజ‌మైన‌వా? గ‌్రాఫిక్సా?
గ‌త సీజ‌న్ల ఫైన‌లిస్టులు హ‌రితేజ‌, గీతా మాధురి, శ్రీముఖి, అలీ రెజా ఇంటిస‌భ్యుల‌ను స‌ర్‌ప్రైజ్ చేశారు. అప్ప‌ట్లో తాము దంచుతూ క‌ష్టాలు ప‌డుతుంటే మీరేమో మిక్సీలు వాడుతున్నారా? అని ఈ సీజ‌న్ కంటెస్టెంట్ల మీద అక్క‌సు వెళ్ల‌గ‌క్కారు. త‌మ‌ టాటూలు నిజ‌మైన‌వా? గ‌్రాఫిక్సా? అని అడుగుతున్నార‌ని, బ‌య‌ట ఇలాంటి టాస్కులు ఉంటాయ‌నుకోలేద‌ని శ్రీముఖి వాపోయింది. త‌ర్వాత ప్రేక్ష‌కుల త‌ర‌పున ప్ర‌శ్న‌లు అడుగుతూ వారికి స‌ర‌దాను పంచేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇంకొన్ని రోజులైతే ఆరిపోయేట్టు ఉన్నావు, కాస్త తిన‌మ‌ని శ్రీముఖి అరియానాకు స‌ల‌హా ఇచ్చింది. (చ‌ద‌వండి: ఏడ‌వ‌కుండా న‌వ్వుతూ  మోనాల్ వీడ్కోలు)

మోనాల్ లేక‌పోవ‌డంతో ఊపిరాడ‌లేదు
నీకు ఎలాంటి అమ్మాయి కావాలన్న ప్ర‌శ్న‌కు సోహైల్‌ త‌న కోపాన్ని కూల్ చేయ‌గ‌లగాలి అని చెప్పాడు. ఇది జ‌ర‌గ‌ని ప‌ని అని హ‌రితేజ కుండ బ‌ద్ధలు కొట్టింది. మోనాల్ వెళ్లాక సైలెంట్ అయ్యావేంట‌ని అఖిల్‌ను కూపీ లాగేందుకు ప్ర‌య‌త్నించ‌గా సోహైల్ మ‌ధ్య‌లో లేచి అంత లేదంటూ, ఇక్క‌డ ఇద్ద‌రికి సోపులేస్తున్నాడ‌ని పంచ్ వేశాడు. అయితే మోనాల్ వెళ్లిపోయాక కాసేప‌టివ‌ర‌కు ఊపిరి ఆడ‌లేద‌ని అఖిల్ చెప్పుకొచ్చాడు. త‌ర్వాత సీనియ‌ర్లు అరియానాను లౌడ్ స్పీక‌ర్‌గా అభివ‌ర్ణిస్తూ ఇమిటేట్ చేయ‌డంతో ఇంటి స‌భ్యులు ప‌డీప‌డీ న‌వ్వారు. అయితే కొన్నిసార్లు ఆమె లీడ్ తీసుకుని మాట్లాడ‌టాన్ని శ్రీముఖి మెచ్చుకుంది. దీనిపై అరియానా స్పందిస్తూ.. గత సీజ‌న్‌లో శ్రీముఖికే స‌పోర్ట్ చేశాను, ఆమె ఆడిన విధానం న‌చ్చిందంటూ చెప్పుకొచ్చింది. హౌస్ అంతా రివ‌ర్స్ అయిన‌ప్పుడు కూడా పాజిటివ్‌గా మాట్లాడ‌టం గ్రేట్ అని హ‌రితేజ సైతం మెచ్చుకుంది. (చ‌ద‌వండి: హౌస్‌లో శివ‌గామి ఎవ‌రో చెప్పిన అభిజిత్‌)

అమ్మాయిల కోసం పాట పాడిన అభి
కావాల‌ని త‌ప్పులు చేయండి, ఎందుకంటే వారంలో బిగ్‌బాస్ గొంతు మిస్స‌వుతారు అని సీనియ‌ర్లు ఉచిత‌ స‌ల‌హా ఇచ్చారు. త‌ర్వాత అంద‌రితో డ్యాన్స్ చేయించారు. గ‌ర్ల్ ఫ్యాన్స్ కోసం అభిజిత్‌తో పాట పాడించారు. అయితే లిరిక్స్ రాక‌పోయినా 'నీ ఎద‌లో నాకు చోటే వ‌ద్దు.. అంటూ బాగానే పాడాడు. త‌ర్వాత అలీ రెజా మాట్లాడుతూ..న‌న్ను అర్జున్‌రెడ్డి అనేవారు, కానీ నువ్వు న‌న్ను మించిపోయావ‌ని, గొడ‌వ‌య్యాక నువ్వే వెళ్లి క‌లిసిపోవ‌డం బాగుంద‌ని సోహైల్‌ను మెచ్చుకున్నాడు. 

ఇలా కోప్ప‌డే ఒక‌రు ట్రోఫీ తీసుకెళ్లారు
త‌న కోపం కార‌ణం లేకుండా రాద‌ని, ఎంత కోప్ప‌డినా మ‌ళ్లీ మ‌న‌వాళ్లే అని ద‌గ్గ‌ర‌కు తీసుకుంటా అని సోహైల్ చెప్ప‌గా ఇలా కోప్ప‌డే ఒక‌రు బిగ్‌బాస్ 1 ట్రోఫీని ప‌ట్టుకెళ్లార‌ని హ‌రితేజ శివ‌బాలాజీని గుర్తు చేసింది. త‌ర్వాత మోస్ట్ డిజైర‌బుల్ మ్యాన్ అఖిల్ మీద ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. టాస్కుల్లో మామూలు స్పీడు లేద‌ని గీతా మాధురి మెచ్చుకుంది. న‌వ్వితే బాగుంటావు, కానీ ఎప్పుడూ సీరియ‌స్‌గా ముఖం పెడ‌తావేంట‌ని శ్రీముఖి నిల‌దీయడంతో అలాంటిదేమీ లేద‌ని అఖిల్ తెలిపాడు. పులిహోర మాత్రం మామూలుగా క‌ల‌ప‌డం లేద‌ని గీతా, హ‌రితేజ సెటైర్లు వేశారు. (చ‌ద‌వండి: ఆ సెంటిమెంట్ క‌లిసొస్తే అభిజితే విన్న‌ర్‌?)

ఉన్న టైమ్‌ను ఎంజాయ్ చేయండి
చివ‌ర్లో మాకు స‌ల‌హాలు ఇవ్వండ‌ని జూనియ‌ర్లు సీనియ‌ర్ల‌ను కోరారు. మొదట హ‌రితేజ మాట్లాడుతూ... ఇక్క‌డిదాకా వ‌చ్చాక మార్చుకోవాల్సిన‌వేమీ ఉండ‌వ‌ని చెప్పింది. ఉన్న స‌మ‌యాన్ని ఎంజాయ్ చేయ‌మ‌ని సూచించింది. గీతా మాధురి కూడా ఎంజాయ్ చేయ‌మ‌ని చెప్తూనే చివ‌ర్లో ఎవరినీ బాధ‌పెట్టే డైలాగులు మాట్లాడ‌కండ‌ని స‌ల‌హా ఇచ్చింది. శ్రీముఖి మాట్లాడుతూ.. 'గ‌త సీజ‌న్‌లో నేను సెట్‌లో ప్ర‌తి మూల‌మూల‌కు వెళ్లాను. ఎందుకంటే త‌ర్వాత‌ ఆ సెట్ తీసేస్తారు. కాబ‌ట్టి మీరు కూడా హౌస్‌లో చిల్ అవ్వండి. రూల్స్ బ్రేక్ చేసి బిగ్‌బాస్‌తో తిట్టించుకోండి. ఎందుకంటే మ‌ళ్లీ ఆ వాయిస్ విన‌లేరు' అని చెప్పింది. హౌస్‌లో ఎంత నెగెటివిటీ వ‌స్తుందో అంత పాజిటివిటీ వ‌స్తుంద‌ని అలీ ధైర్యం చెప్పాడు. మా అమ్మాయి బిగ్‌బాస్ చూస్తూనే అన్నం తింటుది, వారం త‌ర్వాత ప‌రిస్థితి ఏంటో అని గీతామాధురి త‌ల ప‌ట్టుకోగా తాము ఇంటికొచ్చి తినిపిస్తాం అని ఫైన‌లిస్టులు ముందుకొచ్చారు. అనంత‌రం మాజీలు టాప్ 5 కంటెస్టెంట్ల‌కు ఆల్ ద బెస్ట్ చెప్తూ వీడ్కోలు ప‌లికారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: టైటిల్ గెలిచే అర్హ‌త హారిక‌, అరియానాకు లేదు!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు