అత‌డు నాకు అస్స‌లు న‌చ్చ‌డు: స‌్వాతి దీక్షిత్‌

6 Oct, 2020 20:17 IST|Sakshi

వ‌చ్చిన వారానికే వెళ్లిపోతాడేమో అనుకున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంటు కుమార్ సాయి ఇంట్లోనే సెటిల్ అయిపోయాడు. కొన్నాళ్లు ఉండి గేమ్ ఛేంజ‌ర్ అవుతుందేమో అనుకున్న మూడో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ స్వాతి దీక్షిత్ వారానికే బిగ్‌బాస్‌ను వీడి వ‌చ్చేసింది. ఆమె వెళ్లిపోతుంటే నోయ‌ల్ చిన్న పిల్లాడిలా మారిపోయి విల‌విలా ఏడ్చేశాడు. ఆమె రాగానే హారిక‌ను ప‌క్క‌న‌పెట్టిన అభిజిత్ త‌ను వెళ్లిపోతుంటే మాత్రం పెద్ద‌గా ఫీలైన‌ట్లు క‌నిపించ‌లేదు. ఆమె గురించి పూర్తిగా తెలుసుకునేలోపే బ్యాగు స‌ర్దుకుని బ‌య‌ట కాలు మోపింది. అయితే తాను ఎలిమినేట్ అవుతాన‌ని ఊహించ‌లేద‌ని స్వాతి దీక్షిత్ చెప్పుకొచ్చింది. (మాస్ట‌ర్‌పై ప్ర‌తీకారం తీర్చుకున్న స్వాతి దీక్షిత్‌)

అఖిల్ పాపం, మోనాల్ ఆడుకుంటోంది
రాహుల్ సిప్లిగంజ్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ బిగ్‌బాస్ బ‌జ్‌లో పాల్గొన్న ఆమె హౌస్‌లో ఎవ‌రెలాంటి వార‌నేది కుండ బ‌ద్ధ‌లు కొట్టి చెప్పింది. ఎలాంటి త‌త్త‌ర‌పాటు లేకుండా ఉన్న‌దున్న‌ట్లుగా త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించింది. ఆమె చెప్పిన పాయింట్లు వింటే త‌క్కువ కాలంలోనే ఇంటి స‌భ్యుల‌ను ఎక్కువగా అర్థం చేసుకుందని అనిపించ‌క మాన‌దు. "అఖిల్ ఫోక‌స్ అంతా ఒక్క‌రి పైనే ఉంది.  అత‌న్ని చూస్తే పాపం అనిపిస్తుంది. మోనాల్‌ను గుడ్డిగా న‌మ్మేస్తున్నాడు. మోనాల్ గేమ్ ఆడితే ప‌ర్లేదు కానీ మ‌నుషుల ఫీలింగ్స్‌తో ఆడుకుంటుంది. ఈమెనే అఖిల్‌, అభి మ‌ధ్య చిచ్చు పెట్టింది. సోహైల్ నాకు న‌చ్చ‌డు. అత‌ని యాటిట్యూడ్‌, అమ్మాయిల‌తో మాట్లాడే విధానం అస్స‌లు న‌చ్చ‌దు. అత‌నికి మాట నియంత్ర‌ణ‌లో ఉండ‌దు. హారిక ఫోక‌స్ అంతా అభిజిత్‌పైనే ఉంది. ఎందుకో కానీ ఆమె అభి విష‌యంలో చాలా పొసెసివ్‌గా ఉంది" (బిగ్‌ బాస్‌: సెల‌బ్రెటీల‌కు ఒరిగిందేంటి?)

అరియానా చిరాకు పుట్టిస్తుంది
"అభిజిత్ నాకు తొంద‌ర‌గా ఫ్రెండ్ అయ్యాడు, స్మార్ట్ అండ్ ఇంటిలిజెంట్‌. అమ్మ రాజ‌శేఖ‌ర్ మామూలు వ్య‌క్తి కాదు, చాలా కంత్రీ. అస్స‌లు న‌మ్మ‌కూడ‌దు. లాస్య.. ఎప్పుడూ గంద‌ర‌గోళంలో ఉంటుంది. ప‌క్క‌న వాళ్లేం చేస్తున్నారు? ఏం జ‌రుగుతుంది? అనేదానిపై ఎక్కువ ఆతృత క‌నబ‌రుస్తుంది. క‌న్నింగ్‌. సుజాత న‌వ్వు ఫేక్ అనిపిస్తుంది. ఎప్పుడూ గాసిప్స్ మాట్లాడుతూ ఉంటుంది. అరియానా ఏం మాట్లాడుతుందో అర్థం కాదు, చిన్న పిల్ల‌లా వాగుతూ చిరాకు పుట్టిస్తుంది. దేవి క్ర‌మ‌శిక్ష‌ణ‌గా ఉండేది. దివి అన‌వ‌స‌ర విష‌యాల్లో దూర‌దు, వెన‌కాల మాట్లాడ‌దు. గంగ‌వ్వ సూప‌ర్‌గా, తెలివిగా ఆడుతోంది. మెహ‌బూబ్‌.. సొంత నిర్ణ‌యం తీసుకోలేడు. నోయ‌ల్‌.. చాలా మంచోడు. అంద‌రినీ న‌మ్మేస్తాడు. టాప్ 5లో ఉంటాడు. కుమార్ సాయి గంద‌ర‌గోళంలో ఉన్నాడు. అవినాష్‌.. చాలా ఫ‌న్నీ" అని అంద‌రి గురించి చెప్పుకొచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు