నాగార్జున చెప్పింది న‌చ్చ‌లేదు: స‌్వాతి

11 Oct, 2020 19:51 IST|Sakshi

మాస్ట‌ర్ సేఫ్ గేమ్‌కు స్వాతి బ‌లి

బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ హౌస్‌లో ప‌ట్టుమ‌ని ప‌ది రోజులు కూడా ఉండ‌లేదు. తెలుగ‌మ్మాయిగా తానేంటో నిరూపించుకునే అవ‌కాశాన్ని ఆమెకు ఇవ్వ‌లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి. బ‌య‌ట చ‌లాకీగా ఉండే ఆమె ఇంట్లో చేసిన సంద‌డిని కొంచెం కూడా చూపించ‌కుండా బిగ్‌బాస్ టీమ్ ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించార‌ని విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని స్వాతి దీక్షిత్ సాక్షి టీవీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది. ఈ సంద‌ర్భంగా స్వాతి ఏం మాట్లాడిందో ఆమె మాట‌ల్లోనే...

నేను చేసిన‌దాంట్లో స‌గం కూడా చూపించ‌లేదు
"బిగ్‌బాస్ షో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక నేను హౌస్‌లో ఉన్న‌ప్ప‌టి ఎపిసోడ్‌లు చూసి దిగులు‌ప‌డ్డాను. నేను చేసిన దాంట్లో క‌నీసం 50 శాతం కూడా చూపించ‌లేరు. అలా అని ఈ షో స్క్రిప్టెడ్ మాత్రం కాదు. అక్క‌డ అడుగు పెట్టాక‌ కొంద‌రితో బాండింగ్ ఏర్ప‌డింది. మ‌రికొంద‌రితో గొడ‌వ‌లు కూడా జ‌రిగాయి. అయినా న‌న్ను ఎక్కువ‌గా చూపించ‌నేలేదు. ఎలిమినేష‌న్ రోజు కూడా నాకు గ‌న్ పేలుతుంద‌ని అనుకోలేదు. ధైర్యంగా ఉన్నాను. స‌డ‌న్‌గా ఎలిమినేట్ అనేసరికి షాక‌య్యాను. నిజానికి నేను ప్ర‌స్తుతం వెబ్ సిరీస్ చేస్తున్నాను. దాన్ని మ‌ధ్య‌లో ఆపేసి మ‌రీ ఈ షోకి వెళ్లాను" (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌కు స్వాతి గుడ్‌బై, మోనాల్‌పై అప‌నింద‌)

వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌కు ఆ వారం నామినేష‌న్స్ ఉండ‌వు
"వేరే భాష‌ల్లోని బిగ్‌బాస్ షోల‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌కు ఇమ్యూనిటీ ఉంటుంది. అంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల‌కు హౌస్‌లో అడుగు పెట్టిన మొద‌టి వారం నామినేష‌న్స్ నుంచి మిన‌హాయింపు ఉంటుంది. కానీ ఇక్క‌డ అలాంటిదేమీ లేదు. దానికోసం పోరాడాల్సింది అని ఇప్పుడు అనిపిస్తోంది. నేను తెలుగ‌మ్మాయిని, రీఎంట్రీ అవ‌కాశం వ‌స్తే త‌ప్ప‌కుండా వెళ్తాను, న‌న్ను నేను ప్రూవ్ చేసుకుంటాను.  ఎంట‌ర్‌టైన్ చేయ‌క‌పోతే స్వాతిలా మీరు కూడా వెళ్లిపోతారు అని నాగ్ ఇంటి స‌భ్యుల‌తో అన‌డం నాకు అస్స‌లు న‌చ్చ‌లేదు. అయితే హౌస్‌లో 24 గంట‌లు ఏం జ‌రుగుతుంద‌నేది ఆయ‌న‌కు తెలీదు. టెక్నిక‌ల్ టీమ్ చెప్పిన‌దాన్నే ఆయ‌న చెప్తారు. కానీ ఒక్క‌సారి కూడా నాగ్ న‌న్ను మెచ్చుకోలేదు. అందుకు చాలా ఫీల‌య్యాను. అమ్మ రాజ‌శేఖ‌ర్ సేఫ్ గేమ్ ఆడ‌టానికి న‌న్ను నామినేట్ చేశారు. నేను ఎలిమినేట్ అయిన‌ప్పుడు నోయ‌ల్ చాలా బాధ‌ప‌డ్డాడు. అభిజిత్ షాక‌య్యాడు" అని చెప్పుకొచ్చింది.(చ‌ద‌వండి: మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు