బిగ్‌బాస్‌: త్వ‌ర‌లో హీరోయిన్ ఎంట్రీ!

22 Sep, 2020 16:32 IST|Sakshi

రోజులు గ‌డిచే కొద్దీ బిగ్‌బాస్ షో కూడా ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. అయితే బిగ్‌బాస్ ఆద‌ర‌ణ‌కు ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ గండి కొడుతోంది. ఎప్ప‌టినుంచో ఊరిస్తూ వ‌స్తోన్న ఐపీఎల్ రంగంలోకి దిగేస‌రికి ప్రేక్ష‌కులు మూడు భాగాలుగా విడిపోయారు. ఇందులో ఐపీఎల్ మాత్ర‌మే చూసేవారు కొంద‌రైతే, బిగ్‌బాస్ మాత్ర‌మే చూసేవారు మ‌రికొంద‌రు, రెండింటిని క‌వ‌ర్ చేసేవారు మూడో ర‌కం. అయితే మొన్న‌టివ‌ర‌కు బిగ్‌బాస్‌ను వీక్షించిన‌ వారిలో చాలామంది ఐపీఎల్ రాగానే షోను ప‌క్క‌న‌పెట్టారు. అస‌లే మొద‌టి ఎపిసోడ్‌తో టీఆర్పీ రికార్డులు బ‌ద్ధ‌లు కొట్టిన బిగ్‌బాస్ దాన్ని కాపాడుకునేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది. (బిగ్‌బాస్ మాయ గురించి చెప్పిన వితికా)

అందులో భాగంగా గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా తొలి రెండు వారాల్లోనే రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఇప్పుడు ఐపీఎల్‌ను ఢీ కొట్టేందుకు ముచ్చ‌ట‌గా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోనికి పంపించాల‌ని ఆలోచిస్తోంది. ముందు నుంచీ చ‌క్క‌ర్లు కొడుతున్న ఊహాగానాల ప్ర‌కారం జంప్ జిలానీ సినిమా హీరోయిన్‌ స్వాతి దీక్షితే అని స‌మాచారం. నిజానికి ఆమెను ఓ ఆప్ష‌న్‌గా ప‌క్క‌న‌పెట్టారు. కానీ హౌస్ వేడెక్కించేందుకు వీలైనంత‌ త్వ‌ర‌గా ఆమెను కూడా షోలోకి పంపించేందుకు రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. కాగా ఇప్ప‌టికే కుమార్ సాయి, అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ ఇద్ద‌రిలో అవినాష్ అంద‌రితో కలిసిపోయిన‌ప్ప‌టికీ కుమార్ మాత్రం ఇంకా పొరుగింటి అబ్బాయిగానే ఉంటున్నాడు. (బిగ్‌బాస్‌: గెలవడం‌ కోసం ఆమె ఏమైనా చేస్తుంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు