అల్ల‌రి న‌రేష్ హీరోయిన్ స్వాతి దీక్షిత్‌

27 Sep, 2020 18:52 IST|Sakshi

స్వాతి దీక్షిత్ న‌టి మాత్ర‌మే కాదు యోగా ట్రైన‌ర్ కూడా!. ఆమె 2009లో అంద‌మైన భామ‌లు కార్య‌క్ర‌మం విజేత‌గా నిల‌చింది. అప్ప‌టి నుంచి స‌రైన గుర్తింపు కోసం క‌ష్ట‌ప‌డుతూనే ఉంది. ఈ క్ర‌మంలో రాంగోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన హార‌ర్ చిత్రం 'ప‌ట్ట‌ప‌గ‌లు'లో న‌టించింది. కానీ అది పెద్ద‌గా క్లిక్ అవ‌లేదు. అయితే దీని క‌న్నా ముందే 'తోర్ నామ్' అనే బెంగాలీ చిత్రంలో న‌టించింది. తెలుగులో "జంప్ జిలానీ"లో హీరో అల్ల‌రి న‌రేష్‌కు జోడీగా న‌టించింది. చివ‌రిగా సింబా అనే త‌మిళ‌ చిత్రంలో క‌నిపించింది.  బ్రేక‌ప్‌, లేడీస్ అండ్ జెంటిల్మెన్, చిత్రాంగ‌ద వంటి తెలుగు చిత్రాల్లోనూ న‌టించింది.

కాగా 'ఆర్ఎక్స్ 100' సినిమాలో తొలుత స్వాతి హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. కానీ ఆ బోల్డ్ పాత్ర త‌న బాడీ లాంగ్వేజ్‌కు త‌గ‌ద‌ని భావించి స్వాతి చేజేతులా హిట్ సినిమాను చేజార్చుకుంది. ఇక‌ ఈ మ‌ధ్య స్క్రీన్‌పై కూడా స‌రిగా క‌నిపించ‌డం లేదు. అంటే పెద్ద‌గా అవ‌కాశాలు కూడా రావ‌డం లేదు. దీంతో ప్రేక్ష‌కుల్లో త‌న గుర్తింపును నిల‌దొక్కుకునేందుకు ఆమె బిగ్‌బాస్ నాల్గ‌వ సీజ‌న్‌లో అడుగుపెట్టింది. బ‌బ్లీగా క‌నిపించే ఈ ముద్దుగుమ్మ హౌస్‌లో ఎంత‌దూరం వ‌ర‌కు ప్ర‌యాణిస్తుందో చూడాలి..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు