ఇక‌పై మ‌రింత లేటుగా బిగ్‌బాస్‌

1 Dec, 2020 16:21 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌కు శుభం కార్డు వేసేందుకు ముచ్చ‌ట‌గా మూడు వారాలు మాత్ర‌మే మిగిలి ఉంది. ఈ స‌మ‌యంలో బిగ్‌బాస్ షో ప్ర‌సార స‌మ‌యాల్లో మార్పులు చేశారు. దీని ప్ర‌కారం సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు 9.30 గంట‌ల‌కు ప్ర‌సారం అవుతున్న బిగ్‌బాస్ డిసెంబ‌ర్ 7 నుంచి రాత్రి ప‌ది గంట‌ల‌కు టెలికాస్ట్ కానుంది. శ‌ని, ఆదివారాల్లో మాత్రం ఎప్ప‌టిలాగే రాత్రి తొమ్మిన్న‌ర‌కు బిగ్‌బాస్ అల‌రించ‌నుంది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్: గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం ఖ‌రారు!)

డిసెంబ‌ర్ 7 నుంచి స్టార్ మా ఛాన‌ల్‌లో 'గుప్పెడంత మ‌న‌సు' అనే కొత్త సీరియ‌ల్ ప్రారంభం అవుతోంది. ఇది రాత్రి ఏడు గంట‌ల‌కు ప్ర‌సారం కాబోతోంది. దీంతో ఆ స‌మ‌యంలో ప్ర‌సార‌మ‌య్యే వ‌దిన‌మ్మ సీరియ‌ల్‌ను రాత్రి తొమ్మిది గంట‌ల ముప్పై నిమిషాల‌కు మార్చారు. ఈ మేర‌కు ప్రోమోలు కూడా వేస్తున్నారు. అంటే బిగ్‌బాస్ టైమింగ్స్‌ను వ‌దిన‌మ్మ సీరియ‌ల్ ఆక్ర‌మించుకుంద‌న్న‌మాట‌. దీని కార‌ణంగా బిగ్‌బాస్ షో మ‌రింత లేటుగా.. ప‌ది గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. అయితే షో ముగింపుకు వ‌చ్చేసింది కాబ‌ట్టి ఇప్పుడు ప్ర‌సార వేళ‌ల్లో మార్పుచేర్పులు చేసినా షోకు పెద్ద ఇబ్బందేమీ ఉండ‌దు. ఇన్నివారాలుగా ఆద‌రిస్తున్న ప్రేక్ష‌కులు స‌మ‌యాన్ని ప‌ట్టించుకోకుండా మరికొద్ది రోజులు కూడా బిగ్‌బాస్‌ను వీక్షిస్తార‌ని స్టార్ మా నిర్వాహ‌కులు భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. (చ‌ద‌వండి: అఖిల్‌కు ఇచ్చిన‌ మాట త‌ప్పిన మోనాల్‌)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు