బిగ్‌బాస్‌: ఇద్ద‌రి మ‌ధ్య న‌లుగుతున్న మోనాల్‌

16 Sep, 2020 15:56 IST|Sakshi

బిగ్‌బాస్ అంటేనే కోపాలు, క‌లిసిపోవ‌డాలు, చిరాకులు, చిలిపి చేష్ట‌లు, ప్రేమ‌లు, ప‌ట్టింపులు, టాస్కులు, ట‌ఫ్ ఫైట్లు అన్నీ ఉంటాయి. కానీ మొద‌టి వారంలో అన‌వ‌స‌ర‌మైన వాటికే అతిగా ఆవేశ‌ప‌డ‌టం క‌నిపించింది. అయితే ఇప్పుడిప్పుడే మిగిలిన ఎమోష‌న్స్ కూడా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. నిన్న‌టి ఎపిసోడ్‌లో హారిక‌కు అభిజిత్  అంటే ఇష్ట‌మ‌ని తేలిపోయింది. ఎంత ఇష్టం లేక‌పోతే హారిక‌ అత‌డి ద‌గ్గ‌ర‌కు వెళ్లి మ‌రీ గోరు ముద్ద‌లు తినిపిస్తుంది. కానీ వీరిది స్నేహమేన‌ని భావిస్తున్నారు. ఎందుకంటే అభిజిత్‌కు మోనాల్ అంటే మ‌రీ మ‌రీ ఇష్టం.

అప్పుడు లైట్‌.. ఇప్పుడు క్లోజ్‌
మొద‌ట్లో ఆమెను ప‌ట్టించుకోన‌ట్లు క‌‌నిపించినా ఇప్పుడు ఆమెను వ‌దిలి ఉండ‌లేక‌పోతున్నాడు. త‌న‌తో మాట్లాడంటూ ఒట్టేయ‌మ‌ని మోనాల్‌ను అభ్య‌ర్థించాడు. ఎవ‌ర్నీ ప్రేమించ‌ట్లేదు క‌దా అని మ‌న‌సులోని భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టేశాడు. అందుకు ఆమె అలాంటిదేం లేద‌ని చెప్ప‌డంతో అత‌ని మ‌న‌సు తేలిక‌ప‌డింది. ఇప్పుడు ఆమెతో ఇంకా క్లోజ్‌గా మూవ్ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాడు. అయితే స్టైలింగ్ ఐకాన్ అఖిల్ కూడా మోనాల్‌తో ముచ్చ‌టించేందుకు స‌మ‌యం కేటాయిస్తున్నాడు. ఆమెకు గోరుముద్ద‌లు తినిపిస్తూ క్లోజ్‌గా ఉంటున్నాడు. కానీ ఇది అభిజిత్‌కు ఏమాత్రం న‌చ్చ‌ట్లేద‌ని అత‌డి ముఖం చూస్తేనే అర్థ‌మ‌వుతుంది. దీంతో ఈ ఇద్ద‌రి మ‌ధ్య మోనాల్ న‌లిగిపోతోంది. (చ‌ద‌వండి: ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీళ్లే)

అభి ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్ప‌ని అఖిల్‌
తాజాగా స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమోలో.. "సాధార‌ణంగా స్నేహితుల‌ను, పార్ట్‌న‌ర్స్‌ను మ‌న‌మే ఎంపిక చేసుకుంటాం, కానీ ఇక్క‌డ అలా జ‌ర‌గ‌దు" అంటూ మోనాల్ తినుకుంటూ ముచ్చ‌ట్లు చెప్తుంది. అందుకు అభి బ‌దులిస్తూ నువ్వేమైనా స్కూల్‌కు వెళ్లిన‌ప్పుడు నీ క్లాస్‌మేట్‌ను నువ్వే సెల‌క్ట్ చేసుకున్నావా? అని కౌంట‌ర్ వేస్తాడు. అప్పుడే మోనాల్‌కు ద‌గ్గు రావ‌డంతో అభి వెంట‌నే నీళ్లు తీసుకు రావ‌డానికి వెళ్తాడు. కానీ వీరికి‌ దూరంలో ఉన్న అఖిల్ మాత్రం బాటిల్ నింపుకుని ఆమెకు ఇచ్చేస్తాడు. 'నీళ్లు ఇస్తున్నావా?' అని అభి అడిగినా స‌మాధానం చెప్ప‌కుండా వెళ్లిపోతాడు. (చ‌ద‌వండి: రొమాంటిక్ డ్యాన్స్‌; క‌ళ్లు మూసుకున్న అరియానా)

ఇదంతా బిగ్‌బాస్ డ్రామానే
ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు నానా ర‌కాలుగా మాట్లాడుకుంటున్నారు. మోనాల్ అంత చిన్న‌గా ద‌గ్గినా కూడా అఖిల్‌కు వినిపించిందా? అంటే వీళ్లేం మాట్లాడుకుంటున్నారనేది అత‌డు వింటున్నాడ‌ని అంటున్నారు. క‌నీసం అభి అడిగిన‌ప్పుడు స‌మాధానం చెప్పొచ్చు క‌దా అని విమ‌ర్శిస్తున్నారు. అస‌లు అభిజిత్‌-మోనాల్‌-అఖిల్ మ‌ధ్య న‌డుస్తున్న‌ ఈ ట్ర‌యాంగిల్ ల‌వ్ స్టోరీ నిజ‌మా లేక బిగ్‌బాస్ క్రియేట్ చేశాడా? అని చాలామంది సందేహం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప్రేమ క‌థ ఇంకా ఎంత‌దూరం వెళుతుందో చూద్దామ‌ని కామెంట్లు చేస్తున్నారు. ఇది అచ్చంగా ఆర్య సినిమాను గుర్తు చేస్తోందంటున్నారు. మ‌రికొంద‌రు మాత్రం ఎప్పుడూ వీళ్ల ప్రేమ‌ గొడ‌వేనా, కాస్త‌ మంచి టాస్కులు ఆడించ‌డంపై ఫోక‌స్ చేయండ‌ని బిగ్‌బాస్‌కు మొట్టికాయ‌లు వేస్తున్నారు. (చ‌ద‌వండి: నిన్ను చూస్తే పులిహోర క‌ల‌ప‌డం వ‌చ్చిన‌ట్లుందే: దివి)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు