సైడ్ అయిన స‌మంత‌‌, హోస్ట్‌గా నాగ్‌?

30 Oct, 2020 19:45 IST|Sakshi

తెలుగు ప్రేక్ష‌కులంద‌రినీ చూపు తిప్పుకోకుండా టీవీల‌కే అతుక్కుపోయేలా చేసే షో బిగ్‌బాస్ రియాలిటీ షో. మొద‌ట్లో కాస్త వెన‌క‌బ‌డిన నాల్గో సీజ‌న్‌ రానురానూ ఊపందుకుంటోంది. గత సీజ‌న్‌కు వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన నాగార్జున ఈసారి కూడా హోస్ట్ చేస్తున్నారు. కంటెస్టెంట్ల‌తో క‌లిసిపోతూ, అవ‌స‌ర‌మైన‌ప్పుడు వారికి అక్షింత‌లు వేస్తూ త‌న‌దైన స్టైల్‌లో హోస్టింగ్‌తో మెప్పిస్తున్నారు. కానీ ఎపిసోడ్‌లో మ‌జాను పోగొడుతూ లీకులు మాత్రం ఆగ‌డం లేదు. ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌నేది ఒక‌రోజు ముందే తేలిపోవ‌డంతో ఉత్కంఠ‌భ‌రితంగా ఉండే వీకెండ్ ఎపిసోడ్‌లో కూడా థ్రిల్ మిస్ అవుతోంది. అలా హౌస్ గురించి వ‌చ్చే లీకుల‌న్నీ చాలావ‌ర‌కు నిజ‌మ‌య్యాయి కూడా! (రేష‌న్ మేనేజ‌ర్ అయితే ఎలిమినేష‌న్ నుంచి సేఫా?!)

అయితే నాగ్ "వైల్డ్ డాగ్" షూటింగ్ కోసం గ‌త‌వారం కులుమ‌నాలీకి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో ఎవ‌రు హోస్ట్ అన్న‌ప్పుడు చాలామంది పేర్లు తెర‌మీద‌కు వ‌చ్చాయి. అందులో ఒక‌రైన స‌మంత నిజంగానే షోలో మెరిసి అంద‌రినీ మాయ చేసింది. ఆమెకు స‌పోర్ట్‌గా మ‌రిది అఖిల్ కూడా స్టేజీ మీద‌కు వ‌చ్చి కాసేపు సంద‌డి చేశాడు. ఈ ద‌స‌రా మెగా ఎపిసోడ్ బంప‌ర్ హిట్ట‌య్యింది. కానీ విమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొంది. "ఇది బిగ్‌బాస్ షో కాదు, నాగార్జున ఫ్యామిలీ షో" అని కొంద‌రు కొంద‌రు తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. మ‌రోవైపు సామ్ కూడా ఒక్క ఎపిసోడ్‌కే చేతులెత్తేసిన‌ట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. దీంతో ఈ వారం నాగార్జునే య‌థాత‌థంగా హోస్ట్ చేయ‌నున్నార‌ని టాక్ వినిపిస్తోంది. ఇందుకోసం నేడు(శుక్ర‌వారం) ఆయ‌న హైద‌రాబాద్‌కు వి‌చ్చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. కొద్ది మంది మాత్రం స‌మంతే మ‌రోసారి హోస్టింగ్ చేస్తుంద‌ని జోస్యం చెబుతున్నారు. మ‌రి రేపు స్టేజీపై క‌నిపించేది మామనా? కోడ‌లా? అనేది తెలియాలంటే రేపు ప్రోమో రిలీజ్ అయ్యేంత‌వ‌ర‌కు వేచి చూడాల్సిందే. (షాకింగ్‌: ‌హౌస్‌ నుంచి వెళ్లిపోయిన నోయ‌ల్‌!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు