అవినాష్ రొమాన్స్‌; చ‌చ్చిపోండ‌న్న అరియానా

21 Oct, 2020 16:20 IST|Sakshi

బిగ్‌బాస్ ఇచ్చిన 'కొంటె రాక్ష‌సులు- మంచి మ‌నుషులు' టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి మ‌రీ ఆడేస్తున్నారు. హారిక‌, అరియానా, అవినాష్ అయితే గ‌త జ‌న్మ‌లో నిజంగానే రాక్ష‌సులుగా పుట్టారేమో అనిపించేలా జీవించేశారు. అంద‌రికీ విసుగు తెప్పించే ఈ అవ‌కాశం చేజారితే మ‌ళ్లీ దొరక‌ద‌ని అరియానా అంద‌రిక‌న్నా ఓ అడుగు ముందుకేసి మ‌రీ భీభ‌త్సం సృష్టించింది. బెడ్ల‌ను చింద‌ర‌వంద‌ర చేస్తూ హౌస్‌ను అల్ల‌క‌ల్లోలం చేసింది. మెహ‌బూబ్ టాస్కు ముందుకు సాగ‌కుండా మంచి మ‌నుషుల‌పై ఓ క‌న్నేశాడు. అఖిల్‌కు రాక్ష‌సుడిగా ఉండేందుకు ప్ర‌య‌త్నించ‌డానికే స‌రిపోయాడు. (సోహైల్‌కు హారిక పంటిగాట్లు, ఎవ్వ‌రినీ వ‌ద‌ల్లేదు)

త‌ర్వాత మనుషులు అఖిల్ వారిలో ఒక‌డిగా క‌లిపేసుకున్నారు. ఇక హారిక అన్నిర‌కాలుగా మ‌నుషుల ప‌నుల‌కు ఆటంకం క‌లిగించింది. కానీ అభిజిత్ ఇక చాలు అని వారించిన‌ప్పుడు మాత్రం ఆమె శిలావిగ్ర‌హంలా ఉండిపోయింది. అయితే టాస్కుల్లో అభిని, త‌న‌ను విడ‌దీయ‌డం హారిక‌కు న‌చ్చ‌ద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో త‌న‌కు కూడా మ‌నుషుల టీమ్‌లో క‌లిసిపోవాల‌ని లోలోప‌లే ఉవ్విళ్లూరింది. చివ‌రి నిమిషంలో ఇదే విష‌యాన్ని కెమెరా ముందు చెప్పింది. కానీ తీరా మ‌నిషిగా మారాలంటే మాత్రం క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇక ఈ టాస్క్ నేడు కూడా కొన‌సాగ‌నుంది. అయితే మంచి మ‌నుషుల్లో నోయ‌ల్ నీతి సూక్తులు వ‌ల్లిస్తుంటే, మాస్ట‌ర్ శాంతి జ‌పం చేస్తున్నాడు. (బిగ్‌బాస్‌లో ఆ ఒక్క‌టి చాలా కష్టం: కుమార్ సాయి)

మోనాల్ మాత్రం ఆలింగనం చేసుకుంటూ రాక్ష‌సుల‌ను మంచిగా మార్చే ప్ర‌య‌త్నం చేస్తోంది. ముఖ్యంగా ఫోక‌స్ అంతా అవినాష్ మీదే ఉంది. అత‌డేమో నువ్వే రాక్ష‌సిగా మారిపోవ‌చ్చు క‌దా అని మోనాల్‌ను ప్రేమ‌గా అభ్య‌ర్థించాడు. నువ్వే మ‌నిషిగా మారిపోవ‌చ్చు క‌దా అని ఆమె గారాలు పోయింది. దీంతో విసుగెత్తిన‌ అరియానా 'చ‌చ్చిపోండి మీరిద్ద‌రూ' అంటూ అక్క‌డి నుంచి లేచి వెళ్లిపోతుంటే 'నువ్వూ ఇక్క‌డే ఉన్నావు రా' అని పిలిచాడు. ఇదేంటి, అవినాష్ మారిపోయేలా ఉన్నాడంటూ మెహ‌బూబ్ అనుమానం వ్య‌క్తం చేయ‌గా మార‌ను కాక మార‌ను అని క‌రాఖండిగా చెప్తూనే మ‌ళ్లీ మోనాల్ మాయ‌లో ప‌డిపోయాడు. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు ఎప్పుడూ వీళ్ల సోదేనా అని అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రికొంద‌రేమో 'మా ఖ‌ర్మ కాక‌పోతే ఇది కూడా ఒక‌ ప్రోమోనా?' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక ఈ టాస్క్ త‌మిళ బిగ్‌బాస్ నుంచి కాపీ కొట్టార‌ని కొంద‌రు నెటిజ‌న్లు చెప్తున్నారు.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు