అభికి జీరో టాలెంట్‌, అఖిల్‌కు అహంకారం

30 Oct, 2020 15:47 IST|Sakshi

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న నోయ‌ల్ చికిత్స నిమిత్తం షో నుంచి స్వ‌ల్ప విరామం తీసుకుంటున్నాడు. మ‌ళ్లీ వ‌స్తాడ‌ని తెలుసు కాబ‌ట్టి ఎవ‌రూ పెద్ద‌గా ఎమోష‌న‌ల్ అవ‌లేదు. కానీ అత‌డిని తండ్రిగా ఫీలైన‌ హారిక మాత్రం క‌న్నీరుమున్నీరుగా విల‌పించింది. ఇక‌ ఈ ఘ‌ట‌న‌తో హౌస్‌లో నెల‌కొన్న‌ స్త‌బ్ద వాతావ‌ర‌ణాన్ని చెల్లాచెదురు చేసేందుకు బిగ్‌బాస్ కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లు తెలుస్తోంది. ఇంటిస‌భ్యుల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు మ‌రో కొత్త టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ప్ర‌స్తుతం ఇంట్లో ఉన్న 10 మందిని ఐదు జోడీలుగా విడ‌గొట్టాడు. అభిజిత్-హారిక‌, అఖిల్‌-మోనాల్‌, మెహ‌బూబ్‌-సోహైల్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్‌-లాస్య‌, అరియానా- అవినాష్‌ జంట‌లుగా విడిపోయారు. (చ‌ద‌వండి: విశ్వాసం లేదు, చెప్పుతో కొట్టిన‌ట్లు ఉంది: మాస్ట‌ర్‌)

అబ‌ద్ధాలు ఆడుతున్నారు: అఖిల్‌
వారి కోసం అబ‌ద్ధాల కోరు, బ‌ద్ద‌క‌స్తులు, జీరో టాలెంట్‌, గ‌జిబిజి, అహంకారుల జంట అనే బోర్డులు సిద్ధం చేసి ఉన్నాయి. ఇక ఒక్కో జంట‌ను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ మిగ‌తా జంట‌ల గురించి ఏమ‌నుకుంటున్నారో చెప్పడంతోపాటు, వారికి ఏ బోర్డు స‌రిగ్గా సూట‌వుతుందో పేర్కొనాల‌ని ఆదేశించాడు. మొద‌ట క‌న్ఫెష‌న్ రూమ్‌లో అడుగు పెట్టిన‌ అభిక‌(అభి-హారిక జంట‌) మాస్ట‌ర్-లాస్య‌ జోడీని గ‌జిబిజి జంట‌గా పేర్కొంది. ఎక్కువ ప‌ని చేయ‌దు అంటూ సోహైల్.. అరియానా-అవినాష్‌ జంట‌ను బ‌ద్ధ‌క‌స్తులుగా అభివ‌ర్ణించాడు. మోనాల్ ఎఫెక్టో, ఏమో కానీ.. చిన్న చిన్న అబద్ధాలు ఆడుతున్నారిన‌పిస్తోంద‌ని అఖిల్ "అబ‌ద్ధాల కోరులు"గా సోహైల్ జోడీని చెప్పుకొచ్చాడు. (చ‌ద‌వండి: మోనాల్‌కు మంచి చెప్పినా చెడే చేసింది)

అహంకారుల జంట‌గా అఖిల్‌- మోనాల్‌
అరియానా జోడీ "అహంకారుల జంట‌"గా అఖిల్‌-మోనాల్‌ను, అమ్మ రాజ‌శేఖ‌‌ర్ "జోడీ జీరో టాలెంట్ జంట"‌గా అభిజిత్‌-హారిక‌ల‌ను ఎంపిక చేశారు. త‌మ‌కు వ‌చ్చిన బోర్డులు చూసి ఆయా జంట‌లు ఎలా స్పందిస్తాయి? మ‌ళ్లీ ఎలాంటి గొడ‌వ‌లు మొద‌ల‌వుతాయనేది నేటి ఎపిసోడ్‌లో చూడాలి. ఇక ఈ ప్రోమో చూసిన నెటిజ‌న్లు అభి, హారిక‌లకు జీరో టాలెంట్ అన‌డాన్ని పూర్తిగా ఖండిస్తున్నారు. అలాగే సోహైల్‌-మెహ‌బూబ్ జోడీ అబ‌ద్ధాలు ఆడార‌ని అఖిల్ చెప్ప‌డం అస్స‌లు బాగోలేదంటున్నారు. అఖిల్ ఇలా అన్నాడ‌ని తెలిస్తే సోహైల్ ఫీల‌వుతాడ‌ని, వారి ఫ్రెండ్‌షిప్‌ దెబ్బ‌తింటుంద‌ని కామెంట్లు చేస్తున్నారు.

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు