బిగ్‌బాస్‌ : అఖిల్‌కి అంత పొగరా?

19 Oct, 2020 20:32 IST|Sakshi

అఖిల్‌పై ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇన్నాళ్లు అఖిల్‌కి అంతో ఇంతో మంచి పేరు ఉండేది. ఒక్క మోనాల్‌ విషయం తప్ప హౌజ్‌మేట్స్‌ అందరికి అఖిల్‌పై మంచి ఒపినియన్‌ ఉంది. ఇక ప్రేక్షకులు కూడా మోనాల్‌ వల్లే అఖిల్‌ టాస్క్‌లు సరిగా ఆడటం లేదనే సానుభూతి ఉండేది. అయితే ఆదివారం ఎపిసోడ్‌లో జరిగిన ఒక్క సీన్‌తో అఖిల్‌పై ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. సోషల్‌ మీడియాలో నెటిజన్లు అఖిల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు.
(చదవండి : బిగ్‌బాస్‌: టూ మచ్‌ బిగ్‌బాస్‌.. ఓట్లు ఎందుకు మరి?)

అసలు ఏం జరిగిందంటే..ఆరోవారం బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి కుమార్‌సాయి ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను కూరగాయలతో పోల్చమని హోస్ట్‌ నాగార్జున చెపాపడు. దీంతో కుమార్‌ సాయి ఒక్కో ఒక్క కూరగాయను ఒక్కో వ్యక్తితో పోలుస్తూ చాలా పాజిటివ్‌గా చెప్పుకొచ్చాడు. అలా అఖిల్‌ని కరివేపాకుతో కంపేర్ చేశాడు. అయితే వాడుకుని తీసిపారేసే కరివేపాకులా కాకుండా పాజిటివ్‌ వివరణ ఇచ్చాడు కుమార్‌. ‘అఖిల్ నువ్ ఆడుతున్నావ్ కానీ, రిజల్ట్ రావడం లేదు, నువ్ కష్టపడుతున్నావ్.. బట్ ఫోకస్ ఉండటం లేదు.ఎనర్జీతో ఆడుతున్నావ్ గ్రేట్.. అయినా ఫెయిల్ అవుతున్నావ్.. కరివేపాకు వేస్తున్నావ్ కానీ ఆ ఫ్లేవర్ రావడం లేదు’ అని చాలా పాజిటివ్‌ వేవ్‌తో కుమార్‌ సాయి చెప్పాడు.

అయితే దీన్ని నెగిటివ్‌గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు.  బిగ్‌బాస్‌ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌పై అఖిల్‌ సీరియస్‌ కావడం ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు. ఇక నెటిజన్లు అయితే అఖిల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అవుతున్నారు. ‘మరీ ఇంత పొగరా?, పాపం కుమార్‌ సాయి.. పాజిటివ్‌గా చేస్తే అఖిల్‌ అలా అంటాడా?, అఖిల్ ఓవరాక్టింగ్ పీక్స్‌కి వెళ్లిపోయింది. మోనాల్‌ మాయలో పడి ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు, ‘అఖిల్‌కి సరైన మెగుడు అభి, ఆ యాటిట్యూట్, బలుపు సంగతి త్వరలోనే తీర్చేస్తాం.. నామినేషన్స్‌లోకి రా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఎలిమినేట్‌ అయిన కుమార్‌ సాయికి మాత్రం నెటిజన్లు మద్దతుగా నిలిచారు. ఓడినా.. అందరి మనసును గెలిచావ్‌ అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు