Bigg Boss 5 Sreeram: 'హమీదాతో నా రిలేషన్‌ అదే; ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ కాలేదు'

20 Dec, 2021 12:22 IST|Sakshi

Bigg Boss 5 Sreeram About Relationship With Hamida And His Journey: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో సింగర్‌ శ్రీరామచంద్ర టాప్‌-3 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇండియన్‌ ఐడెల్‌తో బాలీవుడ్‌లోనూ క్రేజ్‌ దక్కించుకున్న శ్రీరామ్‌కు సోనూసూద్‌, శంకర్‌ మహదేవన్‌ సహా పలువురు హిందీ సెలబ్రిటీలు సైతం మద్దతుగా నిలిచారు. అయితే ఓటింగ్‌లో మాత్రం శ్రీరామ్‌ మూడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన బిగ్‌బాస్‌ జర్నీ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ఓటమికి కారణాలు ఇంకా తెలియదు.. కానీ ప్రేక్షకుల నిర్ణయాన్ని తను అంగీకరిస్తాను. సన్నీ, షణ్నూ ఇద్దరూ తనకు మంచి ఫ్రెండ్స్‌ కానీ  టైటిల్‌ విన్నర్‌ ఒకరే కాబట్టి సన్నీ గెలవడం సంతోషంగా ఉంది. ఇండియన్‌ ఐడెల్‌ సీజన్‌-5లో తాను గెలిచాను, దీంతో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-5లో కూడా గెలుస్తానని అనుకున్నాను. కానీ ఆ సెంటిమెంట్‌​ వర్కవుట్‌ కాలేదు. ప్రేక్షకులు నేను మూడో స్థానంలో ఉండాలనుకున్నారు. వాళ్ల నిర్ణయానికి గౌరవిస్తా' అని పేర్కొన్నాడు. 

ఇక హమీదాతో తన రిలేషన్‌ గురించి మాట్లాడుతూ.. 'తను నాకు చాలా మంచి ఫ్రెండ్‌. క్లోజ్‌ అవుతున్న టైంలోనే బయటకు వెళ్లిపోయింది. ఒకరి గురించి ఒకరికి ఇంకా తెలీదు. బిగ్‌బాస్‌లో కొంచెం ఉన్నా దాన్ని పెద్దగా చేసి చూపిస్తారుగా'.. అంటూ ఫన్నీగా బదులిచ్చాడు. 

 :
 

మరిన్ని వార్తలు