Bigg Boss Telugu 5: సిరి, సన్నీ మధ్య లవ్‌ ట్రాక్‌ క్రియేట్‌ చేస్తున్నారు.. షణ్ను అసహనం

7 Dec, 2021 00:36 IST|Sakshi

Bigg Boss 5 Telugu 14th Week Nominations, Episode 93: కాజల్‌కు మరీ ఎక్కువ అటాచ్‌ అవద్దని సిరికి సూచించాడు షణ్ను. ఆ వెంటనే ఫ్రెండ్‌షిప్‌ హగ్‌ అంటూ ఒకరికొకరు హగ్గిచ్చుకున్నారు. రాత్రవగానే కాజల్‌ సన్నీకి, సిరి షణ్నుకు దిష్టి తీశారు. మరోవైపు ప్రియాంక వెళ్లిపోయిన బాధతో మానస్‌ ఒంటరిగా కూర్చుంటే కాజల్‌, సన్నీ వెళ్లి అతడిని ఏడిపించారు. ప్రియాంక కోసం పాడిన లవ్‌ సాంగ్‌ను పాడుతూ మానస్‌ను టీజ్‌ చేశారు. మాది ఫ్రెండ్‌షిప్‌రా, లవ్‌ కాదురా అని మానస్‌ మొత్తుకున్నప్పటికీ వాళ్లు వినిపించుకోలేదు.

ఆ తర్వాత మానస్‌, కాజల్‌... సన్నీ, సిరి ఇద్దరికీ లింకు పెడుతూ జోక్‌ చేశారు. సిరి కనబడగానే నీ ఆలియాభట్‌ వస్తుందంటూ కామెంట్లు చేశారు. కానీ దీన్ని సరదాగా తీసుకోలేకపోయిన షణ్ను సిరిపై అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. మీ ఇద్దరి మధ్య ట్రాక్‌ క్రియేట్‌ చేయాలని చూస్తున్నారని, నువ్వు జాగ్రత్తపడకపోతే నీ క్యారెక్టర్‌ బ్యాడ్‌ అవుతుందని హెచ్చరించాడు. వాళ్లు సరదాగా అన్నార్లే అని సిరి లైట్‌ తీసుకోవడంతో మరింత ఉడికెత్తిపోయిన షణ్ను ఇది చెప్పడం వల్ల నాకు ఒరిగేదేమీ లేదంటూ విసురుగా వెళ్లిపోయాడు. దీంతో  సిరి ఏడ్చేసింది.

తర్వాతి రోజు ఉదయం సన్నీ నటించిన సకలగుణాభిరామ సినిమాలోని సైకో సైకో పిల్లా సాంగ్‌ ప్లే చేయడంతో అతడు ఆనందంతో ఎగిరి గంతేశాడు. అటు షణ్ను మాత్రం మళ్లీ.. ఈ హౌస్‌లో ఎందుకున్నాను అంటూ తనలో తానే సణుక్కున్నాడు. 'నేను మోస్ట్‌ బోరింగ్‌ పర్సన్‌ను. ఇన్నివారాలు ఎలా ఉన్నానా? అనిపిస్తుంది. ప్రతిసారి నేను ఓడిపోతూనే ఉన్నాను. కానీ నేను ఒంటరిగా పోరాడుతున్నాను, నా క్యారెక్టర్‌ ఇంతే.. మొదటి రోజు నుంచి ఇప్పటివరకు నువ్వెక్కడా నాకు సాయం చేసినట్లు అనిపించలేదు బిగ్‌బాస్‌' అని కెమెరాలతో తన గోడు చెప్పుకున్నాడు.

ఆ తర్వాత సిరి దగ్గరకెళ్లి మనిద్దరం దూరం కావాలని వాళ్లు ప్లాన్లు చేస్తున్నారని షణ్ను అభిప్రాయపడ్డాడు. సన్నీతో గొడవ పెట్టుకున్న ప్రియ, రవి అందరూ వెళ్లిపోయారని కాజల్‌ ఆలోచిస్తుంది. ఆమె నెక్స్ట్‌ నీ దగ్గరకే వస్తుందంటూ సిరిని హెచ్చరించాడు. నిన్ను నా నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు అని అభిప్రాయపడ్డాడు. అనంతరం బిగ్‌బాస్‌ 1 నుంచి 6 ర్యాంకుల వరకు మీ స్థానాలకు నిర్ణయించుకోవాలని ఇంటిసభ్యులను ఆదేశించాడు. దీంతో అందరూ ఏయే స్థానాల్లో నిలబడాలో ఒక్కొక్కరిగా వారి అభిప్రాయాలను చెప్పుకొచ్చారు.

ముందుగా షణ్ను మాట్లాడుతూ.. ఫస్ట్‌ ప్లేస్‌లో నేను, సెకండ్‌ ప్లేస్‌లో శ్రీరామ్‌, మూడో స్థానంలో సన్నీ, నాల్గో స్థానంలో సిరి, ఐదారు స్థానాల్లో మానస్‌, కాజల్‌ ఉంటారన్నాడు. కాజల్‌ మాట్లాడుతూ.. నేను 1, సన్నీ 2, మానస్‌ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5, షణ్ముఖ్‌ 6 స్థానాల్లో ఉండాలని అభిప్రాయపడింది. మానస్‌ మాట్లాడుతూ.. సన్నీ 1, కాజల్‌ 2, షణ్ముఖ్‌ 3, శ్రీరామచంద్ర 4, సిరి 5 స్థానాల్లో ఉండాలన్నాడు. శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. షణ్ముఖ్‌, సిరి 2, సన్నీ 3, కాజల్‌ 4, మానస్‌ 5వ ర్యాంకులో ఉండాలన్నాడు. ఫస్ట్‌ స్థానం ఆ దేవుడే నిర్ణయిస్తాడన్నాడు.

తర్వాత సన్నీ వంతు రాగా.. కాజల్‌ 1, మానస్‌ 2, సిరి 3, శ్రీరామచంద్ర, షణ్ముఖ్‌ 4, నేను 5వ స్థానంలో ఉంటానన్నాడు. అనంతరం సిరి మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ హౌస్‌కు అన్‌ఫిట్‌ అనుకున్నాను, కానీ ఆ అభిప్రాయాన్ని షణ్ను మార్చాడు కాబట్టి అతడిని ఫస్ట్‌ ర్యాంక్‌లో చూడాలనుంది. వాడి పక్కనే రెండో ర్యాంక్‌లో నేను ఉండాలనుకుంటున్నాను. సన్నీ 3, శ్రీరామ్‌ 4, మానస్‌, కాజల్‌ 5 ర్యాంకుల్లో ఉంటారు అని చెప్పుకొచ్చింది.

అందరూ అభిప్రాయాలు చెప్పడం పూర్తయ్యాక.. సన్నీ 1, షణ్ను 2, కాజల్‌ 3, శ్రీరామ్‌ 4, మానస్‌ 5, సిరి 6 స్థానాల్లో నిలబడ్డారు. అనంతరం బిగ్‌బాస్‌ శ్రీరామ్‌ మినహా మిగతా ఇంటిసభ్యులందరూ 14వ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్‌ అయ్యారని ప్రకటించాడు. ర్యాంకుల టాస్కులో తన అభిప్రాయాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుని షణ్ను ఆరవ స్థానంలో నిలబడటాన్ని సహించలేకపోయింది కాజల్‌. ఇదంతా కావాలనే చేశాడని ఫీలైంది. అలా షణ్ను-కాజల్‌ మధ్య మరోసారి ఫైట్‌ నడిచింది. దీంతో కాజల్‌ చాలా యాటిట్యూడ్‌ చూపిస్తుందన్నాడు షణ్ను. అది ఓవర్‌ కాన్ఫిడెన్స్‌ అంది సెటైర్‌ వేసిం సిరి. ఏదేమైనా ఈ వారం ఎలిమినేషన్‌తో టాప్‌ 5లో ఎవరుంటారనేది తేలిపోనుంది!

మరిన్ని వార్తలు