Bigg Boss 5 Prize Money: ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా? ఈసారి విజేతకు డబుల్‌ బొనాంజ

28 Nov, 2021 15:09 IST|Sakshi

Bigg Boss 5 Telugu: BB5 Title Winner Prize Money Details: బిగ్‌బాస్‌ సీజన్‌-5 మరో మూడు వారాల్లో ముగియనుంది. ప్రస్తుతం టైటిల్‌ పోరులో మిగతా కంటెస్టెంట్లతో పోలిస్తే సన్నీ-షణ్నూకే అవకాశాలు ఎక్కువ. టైటిల్‌ రేస్‌ కూడా వీరిద్దరి మధ్యే జరుగుతుందన్నది పలువురి అభిప్రాయం​. ఇక ట్రోఫీని ముద్దాడే విజేత ఎవరనే దాన్ని పక్కన పెడితే, బిగ్‌బాస్‌ విన్నర్‌కి ఇచ్చే ప్రైజ్‌మనీకి సంబంధించి ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది.

గత సీజన్లతో పోలిస్తే బిగ్‌బాస్‌ సీజన్‌-5 విజేతకు డబుల్‌ బొనాంజ దక్కుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. బిగ్‌బాస్‌ విన్నర్‌కి గాను ఈసారి 50లక్షల రూపాయల ప్రైజ్‌మనీతో పాటు 25 లక్షల విలువైన ఫ్లాట్‌ కూడా దక్కుతుందని సమాచారం. ఇప్పటివరకు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్లలో 50 లక్షల ప్రైజ్‌మనీ అన్నది అత్యధికం. 

కానీ ఈసారి తొలిసారిగా ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ 50 లక్షల ప్రైజ్‌మనీకి అదనంగా పాతిక లక్షల విలువైన ఫ్లాట్‌ కూడా అందించనున్నట్లు సమాచారం. మరికొందరేమో ప్రైజ్‌మనీలో సగాన్ని తగ్గించి ఫ్లాట్‌ ఇస్తారని ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్‌బాస్‌ సీజన్‌-5 విన్నర్‌గా ఎవరు నిలవనున్నారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

మరిన్ని వార్తలు