Bigg Boss Elimination: యానీ, లోబో సేఫ్‌, నటరాజ్‌ మాస్టర్‌ అవుట్‌!

2 Oct, 2021 20:45 IST|Sakshi

చూస్తుండగానే బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ నాలుగో వారం ముగింపుకు వచ్చింది. ఈ సీజన్‌లో తొలిసారిగా ఎనిమిది మంది నామినేషన్‌లో ఉండటంతో ఎవరు ఎలిమినేట్‌ అవుతారా? అని ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అనధికారిక పోల్స్‌లో యానీ మాస్టర్‌, లోబో, నటరాజ్‌ మాస్టర్‌ చివరి మూడు స్థానాల్లో తచ్చాడుతుండటంతో వీరిలో ఒకరు ఎలిమినేట్‌ అవడం గ్యారెంటీ అనుకుంటున్నారంతా!

ముఖ్యంగా నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నామినేషన్‌ జరిగిననాటి నుంచే పలువురు జోస్యం చెప్తున్నారు. తాజాగా అదే నిజమైందంటున్నారు లీకువీరులు. నటరాజ్‌ మాస్టర్‌ ఎలిమినేట్‌ అయ్యాడని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నాలుగోవారం నటరాజ్‌ మాస్టర్‌కు గుడ్‌బై చెప్పారని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎలిమినేషన్స్‌ కూడా లీకువీరులు చెప్పినవే నిజమయ్యాయి. మరి నటరాజ్‌ వెళ్లిపోవడం కూడా నిజమేనా? కాదా? అన్నది తెలియాలంటే రేపటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

మరిన్ని వార్తలు