Bigg Boss Telugu 5: అది నిరూపిస్తే నేను కాజ‌ల్ కాళ్లు మొక్కుతాను: యానీ స‌వాల్‌

16 Nov, 2021 00:29 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 72, 11th Week Nominations List: బుల్లితెర ప్రియుల ఫేవ‌రెట్ షో బిగ్‌బాస్ చూస్తుండ‌గానే 11వ వారంలోకి ప్ర‌వేశించింది. 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ప్ర‌స్తుతం 9 మంది మాత్ర‌మే మిగిలారు. మ‌రి వీరిలో ఎవ‌రు ఎవ‌రెవ‌ర్ని నామినేట్ చేశారు? నామినేష‌న్ ప్ర‌క్రియ ఎలా సాగింది అన్న వివరాలు నేటి(న‌వంబ‌ర్ 15) ఎపిసోడ్‌లో చ‌దివేద్దాం..

జెస్సీ వెళ్లిపోయిన‌ప్పుడు నాకే ఏడుపు రాలేదు, వీళ్ల‌కెలా వ‌స్తుంది? ఎందుకు డ్రామాలు ఆడుతున్నారని హౌస్‌మేట్స్‌ను విమ‌ర్శించాడు ష‌ణ్ముఖ్‌. అస‌లు వీళ్లు నిజంగానే ఏడ్చారా? అని అనుమానం వ్య‌క్తం చేశాడు. మ‌రోప‌క్క కాజ‌ల్‌.. జెస్సీ వార్నింగ్‌తో అయోమ‌యంలో ప‌డిపోయింది. నీ ఫ్రెండ్స్ నిన్ను వాడుకుంటున్నార‌ని, వారు నిన్ను న‌మ్మ‌డం లేద‌ని జెస్సీ చేసిన‌ వ్యాఖ్య‌ల్లో ఎంత మేర నిజం ఉందో తెలుసుకోవాల‌నుకుంది. గ‌త‌ వారం నామినేష‌న్స్‌లో మిమ్మ‌ల్ని సేవ్ చేయ‌నందుకు నాపై న‌మ్మ‌కం స‌న్న‌గిల్లిందా? అని స‌న్నీ, మాన‌స్‌ల‌ను నిల‌దీసింది. అందుకు మాన‌స్‌.. గేమ్‌లో నిన్ను న‌మ్మం కానీ ఫ్రెండ్‌షిప్‌లో మాత్రం నిన్ను ఎన్న‌డూ త‌క్కువ చేసి చూడ‌మ‌ని క్లారిటీ ఇచ్చాడు.

ఇక ర‌వి.. స‌న్నీ ఇంత‌వ‌ర‌కు సిరి, ష‌ణ్నుకు సారీ చెప్ప‌లేద‌ని యానీతో గుస‌గుస‌లాడాడు. గిల్టీ బోర్డును మెడ‌లో వేసుకున్న స‌న్నీ హౌస్‌మేట్స్ గురించి మాన‌స్‌, కాజ‌ల్‌తో మాట్లాడాడు. యానీ మాస్ట‌ర్‌ అన‌కొండ, సిరి క‌ట్ల‌పాము, ష‌ణ్ముఖ్ న‌ల్ల‌తాచు అని పేర్లు పెట్టాడు. ర‌వికి మాత్రం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఇచ్చిన గుంట‌న‌క్కే స‌రిగ్గా స‌రిపోతుంద‌న్నాడు. తాను మంకీ లేదా చింపాంజీన‌ని చెప్పుకొచ్చాడు. త‌ర్వాత 11వ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. నామినేట్ చేయాల‌నుకున్న వ్య‌క్తుల త‌ల‌పై బాటిల్‌లోని ద్ర‌వాన్ని పోయాల‌ని ఆదేశించాడు. స‌న్నీ మెడ‌లో గిల్టీ ట్యాగ్‌ను తొల‌గించ‌డంతో ఈ ప్ర‌క్రియ మొద‌లైంది. మొద‌ట‌గా కెప్టెన్ ర‌వి.. త‌న‌ను ఫేక్ అన‌డం న‌చ్చ‌లేదంటూ స‌న్నీని, స‌న్నీని రెచ్చ‌గొట్టిందంటూ కాజ‌ల్‌ను నామినేట్ చేశాడు.

ష‌ణ్ముఖ్‌.. కాజ‌ల్ ఇంటి నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌ని ఆశిస్తున్నానంటూ ఆమెను నామినేట్ చేశాడు. అలాగే ప్రియాంక సింగ్‌పై బాటిల్‌లోని ద్ర‌వాన్ని పోశాడు. మాన‌స్‌.. ష‌ణ్ను, యానీ మాస్ట‌ర్‌ను నామినేట్ చేశాడు. శ్రీరామ్‌.. మాన‌స్‌, స‌న్నీని నామినేట్ చేశాడు. కాజ‌ల్ మాట్లాడుతూ.. నేను ఎంత ట్రై చేసినా క‌నెక్ట్ కావ‌ట్లేదని, పైగా వెక్కిరించ‌డం అస్స‌లు న‌చ్చ‌లేదంటూ యానీని నామినేట్ చేసింది. దీంతో పిచ్చెక్కిపోయిన యానీ కుప్పిగెంతులేసి ఆమె స‌హనాన్ని పరీక్షించింది. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతే గొడ‌వ‌లు త‌గ్గిపోతాయ‌నుకోవ‌డం న‌చ్చ‌లేద‌ని ష‌ణ్నును సైతం నామినేష‌న్‌లోకి పంపించింది. సిరి.. కెప్టెన్సీ కంటెండ‌ర్స్ టాస్క్‌లో ప్రియాంక సింగ్ త‌న‌కు స‌పోర్ట్ చేయ‌లేద‌ని, మాన‌స్ గేమ్ కూడా తానే ఆడుతోందంటూ నామినేట్ చేసింది. సిల్లీ రీజ‌న్స్ ఇవ్వ‌కంటూ కాజ‌ల్ త‌ల‌పై బాటిల్‌లోని ద్ర‌వాన్ని గుమ్మ‌రించింది.

త‌ర్వాత ప్రియాంక సింగ్‌.. సిరి, ష‌ణ్ముఖ్‌ల‌ను నామినేట్ చేసింది. స‌న్నీ.. శ్రీరామ్‌ను నామినేట్ చేసే స‌మ‌యంలో వీళ్లిద్ద‌రూ గొడ‌వ‌ప‌డ్డారు. శ్రీరామ్‌తో పాటు సిరిని నామినేట్ చేశాడు. అనంత‌రం యానీ వంతు రాగా.. నేను మా ఫ్యామిలీని మిస్ అవుతున్నాన‌ని హ‌గ్ చేశాను. కానీ హ‌గ్ పాయింట్‌ను ఇలా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చి నామినేట్ చేయ‌డం న‌చ్చ‌లేదంటూ మాన‌స్ త‌ల‌పై బాటిల్ గుమ్మ‌రించింది. ఆ త‌ర్వాత కాజ‌ల్‌ను నామినేట్ చేస్తూ వెక్కిరించింది. ఇలా వెక్కిరించ‌డాన్నే అగౌర‌వ‌ప‌ర్చ‌డం అంటార‌ని కాజ‌ల్ అంది. దీంతో యానీ..  వెక్కిరించ‌డం అంటే అవ‌మానించ‌డం అని ఏ ఒక్క‌రితో అనిపించినా ఆ రోజు నేను నీ కాళ్లు మొక్కుతాను, అది కూడా సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తాన‌ని శ‌ప‌థం చేసింది. మొత్తంగా 11 వారం కెప్టెన్ ర‌వి మిన‌హా మిగ‌తా 8 మంది నామినేష‌న్‌లో ఉన్నారు.

మరిన్ని వార్తలు