Bigg Boss 5 Telugu Grand Finale Live Updates: రాజమౌళి మెచ్చిన మానస్‌, గోల్డెన్‌ సూట్‌కేస్‌ నో యూజ్‌

19 Dec, 2021 17:42 IST|Sakshi

Bigg Boss 5 Telugu Grand Finale Highlights: తెలుగు నాట అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే ఆదివారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. సెప్టెంబర్‌ 5న ప్రారంభమైన ఈ బిగ్‌ రియాల్టీ షోకు నేడు శుభం కార్డు పలికారు. మొత్తం 19 మంది టైటిల్‌ కోసం పోటీ పడగా.. ఒక్కోవారం ఒక్కక్కరు ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. 15 వారాలపాటు ఒకే ఇంట్లో ఉంటూ ఎన్నో ఎమోషన్స్‌ను తట్టుకుంటూ ఐదుగురు ఇంటి సభ్యులు సన్నీ, మానస్‌, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, సిరి హన్మంత్‌ ఫైనల్‌కు చేరుకున్నారు. వీరిలో విన్నర్‌ను ప్రకటించేందుకు గ్రాండ్‌ఫినాలేను అట్టహాసంగా నిర్వహించారు.  

బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రణ్‌బీర్- అలియా హాజరయ్యారు. అలాగే శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేచురల్ స్టార్ నాని, కృతి శెట్టి, సాయి పల్లవి వచ్చారు. పుష్ప సినిమా ప్రమోషన్స్ నేపథ్యంలో సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్, రష్మిక మందన్న బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. శ్రియ, డింపుల్ హయతి తమ డ్యాన్స్‌లతో అదరగొట్టారు. మరి వీళ్లు చేసిన హంగామా ఏంటో? ఫైనలిస్టులు ఏయే స్థానాలతో సరిపెట్టుకున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చదివేయండి..

కింగ్‌ నాగార్జున గ్రాండ్‌ ఎంట్రీ
బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ గ్రాండ్‌ ఫినాలేలో టాలీవుడ్‌ మన్మథుడు నాగార్జున బ్లాక్‌ డ్రెస్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. మిర్చీ మూవీలోని బార్బీ గాల్‌, అఖిల్‌ చిత్రంలోని అక్కినేని, బంగర్రాజు పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తూ అలరించాడు నాగార్జున. తర్వాత ఐదో సీజన్‌ 14 మంది ఎక్స్‌ కంటెస్ట్‌లను ఆహ్వానించారు. వారు తమదైన స్టైల్‌తో డ్యాన్స్‌ చేసి అలరిస్తారని చెప్పాడు.

అలరించిన జెస్సీ.. ఆకట్టుకున్న కాజల్‌
నాగార్జున చెప్పిచెప్పడంతోనే సీరియల్‌ నటి ఉమాదేవి.. దిగు దిగు నాగ అనే పాటకు నాట్యం చేసి ఆకట్టుకుంది. ఆ వెంటనే బృందావనం సినిమాలోని చిన్నదో వైపు పెద్దదోవైపు పాటకు జెస్సీ, ప్రియాంక, లహరి మాస్‌ స్టెప్పులేసి ఆడియెన్స్‌ను అలరించారు. అనంతరం ఆర్జే కాజల్‌ బాలకృష్ణ అఖండ చిత్రంలోని 'బాలయ్య' పాటతో ఎంట్రీ ఇచ్చింది. 

'నాటు నాటు' అంటూ నటరాజ్‌, యానీ మాస్టర్స్‌ అదరగొట్టారుగా..
ఏ బిడ్డా ఇది నా అడ్డా అంటూ విశ‍్వ వచ్చి తనదైన డ్యాన్స్‌తో అదరగొట్టాడు. అదే పాటకు కంటున్యూగా 'పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా ఫైరు' అంటూ హమిదా హాట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో డ్యాన్స్‌ చేసింది. వీరి తర్వాత కొరియోగ్రాఫర్స్‌ నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు కలిసి స్టెప్పులేసి అబ్బురపరిచారు. ఈ ఇద్దరి పర్ఫామెన్స్‌ విజిల్స్‌ కొట్టకుండా ఉండలేమన్నట్లుగా ఉంది. 

నటరాజ్‌ మాస్టర్‌కు సినిమా హీరోగా అవకాశం..
రవి, సరయు, విశ్వ, యానీ, ప్రియ, హమీదా.. శ్రీరామచంద్ర గెలుస్తాడని, అతడే గెలవాలని ఆశాభావం వ్యక్తం చేశారు. లహరి.. శ్రీరామ్‌, సన్నీ ఇద్దరూ గెలవాలని ఉందని చెప్పింది. లోబో, జెస్సీ షణ్నుకు సపోర్ట్‌ ఇవ్వగా శ్వేత, నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌, ఉమాదేవి సన్నీ గెలుస్తాడని పేర్కొన్నారు. ప్రియాంక సింగ్‌ మాత్రం ఏకంగా 'సన్నీ, మానస్‌, శ్రీరామ్‌ ముగ్గురూ గెలవాలనుందని చెప్పుకొచ్చింది. జెస్సీ, నటరాజ్‌ మాస్టర్‌ తమకు హీరోగా సినిమా అవకాశాలు వస్తున్నాయని చెప్పగా ప్రియాంక సింగ్‌ సైతం తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయంది. 

నాగార్జున కన్నా పెద్ద కింగ్‌ ఎవరూ లేరు: రణ్‌బీర్‌
ఇక టాప్‌ 5 కంటెస్టెంట్లు సైతం డ్యాన్సులతో అదరగొట్టారు. అనంతరం రాజమౌళితో పాటు బ్రహ్మాస్త్రం డైరెక్టర్‌ అయాన్‌, హీరోహీరోయిన్లు రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియా భట్‌ స్టేజీపై సందడి చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాస్త్రం మోషన్‌ పోస్టర్‌ ప్లే చేశారు. నీ కన్నా పెద్ద కింగ్‌ ఎవరూ లేరంటూ నాగార్జునపై పొగడ్తల వర్షం కురిపించాడు రణ్‌బీర్‌.

మానస్‌కు బ్రహ్మాస్త్రం ఇచ్చిన రాజమౌళి
బిగ్‌బాస్‌ హౌజ్‌లో టాప్ 5 కంటెస్టెంట్స్‌తో బ్రహ్మాస్త్రం గేమ్‌ ఆడించాడు నాగార్జున. ఈ గేమ్‌ను సన్నీతో మొదలు పెట్టారు. తనలో ఉన్న పవర్‌ ఏంటో తమకు చెప్పాలని రాజమౌళి సన్నీకి చెప్తాడు. తాను పడ్డ కష్టాలనుంచి ఇ‍ప్పుడున్న పొజిషన్‌ తనకున్న అతి పెద్ది పవర్‌ అని చెప్పుకొచ్చాడు సన్నీ. తర్వాత గేమ్‌ మానస్‌ వైపుకు  వెళ్లింది. తనలోని పవర్‌ ఏంటో చెప్పమని నాగార్జున అడగ్గా.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా కామ్‌గా ఉండి, విశ్లేషించి సరైనా నిర్ణయం తీసుకోవడమే తన అల్టిమేట్‌ పవర్ అని మానస్‌ సమాధానమిచ్చాడు. ఇండిపెండెంట్‌, సెల్ఫ్‌లెస్‌గా ఉండటం తన పవర్ అన్న శ్రీరామ్‌ పాట పాడి అందరినీ అలరించాడు. టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ తమ పవర్స్‌ చెప్పిన తర్వాత వారందరిలో తనకు నచ్చిన సమాధానం సాయి మానస్‌ది అని దర్శక ధీరుడు రాజమౌళి తెలిపాడు. తర్వాత బ్రహ‍్మాస్త్రంను మానస్‌కు ఇచ్చాడు రాజమౌళి. తర్వాత పరంపర టీమ్‌ సైతం స్టేజీపైకి వచ్చి సందడి చేసింది.

బిగ్‌బాస్‌ నుంచి సిరి ఎలిమినేట్‌..
బిగ్‌బాస్ స్టేజిపై పుష‍్ప టీం వచ్చి సందడి చేసింది. టాప్‌ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిని ఎలిమినేట్‌ చేయడానికి హీరోయిన్ రష్మిక మందన్నా, మ్యూజిక్ డైరెక్టర్‌ దేవి శ్రీ ప్రసాద్‌ను బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి పంపాడు నాగార్జున. రష్మిక మందన్నా, దేవి శ్రీప్రసాద్‌ హౌస్‌లోకి వెళ్లి హౌస్‌మేట్స్‌తో స్టెప్పులేశారు. తర్వాత ఫైనలిస్టుల ఫొటోలున్న డ్రోన్లను గాల్లోకి వదిలారు. ఇందులో సిరి ఫొటో ఉన్న డ్రోన్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో ఆమె ఎలిమినేట్‌ అయినట్లు ప్రకటించారు. దీంతో సిరిని తీసుకుని హౌస్‌ నుంచి బయటకు వచ్చేశారు రష్మిక, దేవి శ్రీ ప్రసాద్‌. సిరి ఎలిమినేషన్‌ తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌తోపాటు ప్రముఖ సింగర్స్‌ వచ్చి పాటలు పాడి అలరించారు. అలాగే పలువురి డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. 

బిగ్‌బాస్‌ నుంచి సాయి మానస్ ఔట్‌.. మిగిలింది ముగ్గురే
సిరి ఎలిమినేషన్‌ తర్వాత రాహుల్‌ సిప్లిగంజ్‌తోపాటు ప్రముఖ సింగర్స్‌ వచ్చి పాటలు పాడి అలరించారు. అలాగే పలువురి డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. అనంతరం శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాలోని నటీనటులు వచ్చి బిగ్‌బాస్ స్టేజిపై తమ చిత్ర విశేషాలు పంచుకున్నారు. అనంతరం సాయి పల్లవి, కృతిశెట్టి బిగ్‌బాస్‌ హౌజ్‌లోనిక వెళ్లి హౌజ్‌మేట్స్‌తో ముచ్చిటించారు. తర్వాత నాని ఒక పెట్టే తీసుకుని బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతాడు. నాని హౌజ్‌మేట్స్‌కు క్యాష్ ఆఫర్ చేసిన ఎవరూ తీసుకోరు. తర్వాత మేనిక‍్విన్ (బొమ్మల) గేమ్‌తో మానస్‌ ఎలిమినేట్‌ అయ్యాడని ప్రకటిస్తాడు నాగార్జున. శ్యామ్‌ సింగరాయ్‌ టీం మానస్‌తో పాటు హౌజ్‌ నుంచి బయటకు వస్తారు. తర్వాత శ్రియ వచ్చి అలేగ్రా, డ్యాంగ్‌ డ్యాంగ్‌, స్వింగ్‌ జర పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి అదరగొట్టింది. 

అనూహ్యంగా శ్రీరామ్‌ చంద్ర ఎలిమినేట్‌.. మరి విన్నర్‌ ?
శ్రియ బ్యూటిఫుల్‌ పర్ఫామెన్స్‌ తర‍్వాత అక్కినేని నాగ చైతన్య బిగ్‌బాస్‌ స్టేజిపై అడుగు పెడతాడు. అనంతరం నాగార్జునకు సంబంధించిన ఏవీని ప్లే చేస్తారు. దీంతో హౌజ్‌మేట్స్, ఎక్స్‌ కంటెస్టెంట్స్, నాగార్జున్ ఎమోషనల్‌ అవుతారు. దీని తర్వాత మిగిలిన హౌజ్‌మేట్స్‌ను టెంప్ట్‌ చేసేందుకు గోల్డ్‌ బాక్స్‌తో నాగా చైతన్య బిగ్‌బాస్‌ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంతకుముందు నాని తీసుకు వచ‍్చిన సిల్వర్‌ సూట్‌కేసు కన్నా మూడు రెట్లు ఎక‍్కువ డబ్బు ఉంటుందని నాగ చైతన్య హౌజ్‌మేట్స్‌ను ఊరించాడు. అది కూడా ఎవరూ తీసుకోకపోవడంతో చివిరిగా ఎలిమినేషన్ క్యార్యక‍్రమానికి వస్తాడు నాగార్జున్. ఈసారి అనూహ్యంగా సింగర్ శ్రీరామ్‌ చంద్ర ఎలిమినేట్‌ అవుతాడు. శ్రీరామ్‌ చంద్రను నాగ చైతన్య హౌజ్‌ నుంచి బయటకు తీసుకు వస్తాడు. స్టేజ్‌పై ఉన్న అమ్మలందరి కోసం పాట పాడి అలరించాడు శ్రీరామ్‌ చంద్ర.

శ్రీరామ్‌ చంద్ర ఎలిమినేషన్‌ తర్వాత బిగ్‌బాస్‌ స్టేజ్‌ పైకి ఫరియా అబ్దుల్లా వచ్చి సందడి చేసింది. అనంతరం తనను హౌజ్‌లోకి పంపిస్తాడు నాగార్జున. మిగిలిన హౌజ్‌మేట్స్‌ సన్నీ, షణ్ముఖ్‌ను తన మాటలతో రిలాక్స్‌ చేస్తుంది చిట్టి. తర్వాత ముగ్గురు కలిసి బంగార్రాజు పాటకు డ్యాన్స్‌ చేస్తారు. తర‍్వాత ఒక బాక్స్‌లో ఇద్దరిని చేతులు పెట్టమని చెప్తాడు నాగార్జున. అందులో విన్నర్‌కు గ్రీన్‌, రన్నరప్‌కు రెడ్ కలర్‌ వస్తుందని చెప్తాడు. తీరా చూస్తే ఇద్దరికీ బ్లూ కలర్‌ రావడంతో బిగ్‌బాస్‌ ట్విస్ట్‌పెట్టాడని అర్థమవుతుంది. అనంతరం నాగార్జున స్వతాహాగా హౌస్‌లోకి వెళ్లి వాళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకువచ్చాడు. తీవ్ర ఉత్కంఠ మధ్య సన్నీని బిగ్‌బాస్ సీజన్‌ 5 విన్నర్‌గా, షణ్ముఖ్‌ను రన్నరప్‌గా ప్రకటించాడు.


మరిన్ని వార్తలు