Bigg Boss 5 Telugu: నామినేషన్స్‌ రచ్చ.. యానీ వెకిలి నవ్వులు.. కాజల్‌ ఫైర్‌

15 Nov, 2021 17:43 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ పదివారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకొని 11వ వారంలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది ఉన్నారు. ఇక నుంచి గేమ్‌ మరింత రసవత్తరంగా మారనుంది. ప్రతి చిన్న అంశం.. ఎలిమినేషన్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇంటి సభ్యులు ఆచి, తూచి ఆటను ఆడుతున్నారు. ఇంట్లో ఉన్న తొమ్మిది మందికి 11వ వారం నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ‘అందరికీ మనసులో ఉన్న నిజాలు బయటపెట్టే ధైర్యం ఉండదు. నిజాలను నిర్భయంగా నిలదీసే అవకాశమే ఈరోజు జరిగే నామినేషన్‌’అంటూ ఇంటి సభ్యులను రెచ్చగొట్టాడు బిగ్‌బాస్‌. ఏ వ్యక్తినైనా నామినేట్‌ చేస్తే.. అందుకు గల కారణాలను ధైర్యంగా చెప్పాలని బిగ్‌బాస్‌ ఆదేశించడంతో.. ఇంటి సభ్యులు తమలో దాగిఉన్న కోపాన్ని బయటపెట్టారు.

ముఖ్యంగా సన్నీని టార్గెట్‌ చేసినట్లు తాజాగా విడుదలైన ప్రోమోలు చూస్తే అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్‌లో తనకు ఫేక్‌ ట్యాగ్‌ ఇచ్చిన సన్నీని నామినేట్‌ చేశాడు రవి. ‘నీ తప్పు నీకు చెబితే.. నేను ఎలా ఫేక్‌ అనిపించానో నాకు అర్థం కాలేదు’అని రవి అడగ్గా.. ‘అందరి ముందు నాది బ్యాడ్‌ బిహేవియర్‌ అని చెప్పడాన్ని తీసుకోలేకపోయాను.     
నా గురించి నువ్వు మాట్లాడటం నాకు నచ్చలేదు. అందుకే ఫేక్‌ అన్నాను. అయినా అది నా అభిప్రాయం. దాన్ని ఎవ్వరూ మార్చలేరు’అని సన్నీ బదులు ఇచ్చాడు.  షణ్ముఖ్‌.. కాజల్‌ని నామినేట్‌ చేస్తూ... తన వల్లే ఇంటి సభ్యుల మధ్య గొడవలు అవుతున్నాయని, ఆమె బయటకు వెళ్లే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. దీన్ని కాజల్‌ తిప్పికొట్టింది.తన వల్ల ఇంట్లో ఒక్క గొడవ కూడా కాలేదని బదులు ఇస్తుండగా , యానీ మాస్టర్‌ వెకిలి నవ్వులు నవ్వింది. మరి ఈ వారం నామినేషన్‌లో ఎవరు ఉన్నారు? ఎవరు ఎవరిని నామినేట్‌ చేశారు? నామినేషన్‌ రచ్చ ఎలా ఉందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే.

మరిన్ని వార్తలు