Bigg Boss 5 Telugu: మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ మానస్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

20 Dec, 2021 11:36 IST|Sakshi

Bigg Boss 5 Telugu Third Runner up Maanas Remuneration: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లో మోస్ట్‌ అండర్‌రేటెడ్‌ కంటెస్టెంట్‌ ఎవరైనా ఉన్నారా? అంటే అది మానస్‌ మాత్రమే! మాటలు తక్కువ చేతలు ఎక్కువగా ఉండే మానస్‌ ఎమోషన్స్‌, గేమ్‌ను బ్యాలెన్స్‌ చేస్తూ టాప్‌ 5లో స్థానం సంపాదించుకున్నాడు. ఫిజికల్‌ టాస్క్‌ అయినా, మైండ్‌ గేమ్‌ అయినా రెండింటినీ ఓ పట్టు పట్టేవాడు. బుల్లితెర నటుడిగా కెరీర్‌ మొదలు పెట్టిన మానస్‌ బిగ్‌బాస్‌ హౌస్‌లో గొడవల్లో దూరకుండా తన పనేంటో తను చేసుకునేవాడు. సహనానికి మారుపేరుగా నిలిచిన మానస్‌ స్నేహం కోసం ఏదైనా చేసేవాడు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ సరైన గుర్తింపు రాకపోవడంతో బిగ్‌బాస్‌ ద్వారా అందరికీ చేరువ కావాలనుకున్నాడు. అనుకోవడమే కాదు తన ప్రవర్తనతో, ఆటతీరుతో ఎంతోమంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. 

ఈ సీజన్‌లో థర్డ్‌ రన్నరప్‌గా నిలిచిన మానస్‌ బిగ్‌బాస్‌ షో ద్వారా ఎంత లాభపడ్డాడన్న విషయం ఇంట్రస్టింగ్‌గా మారింది. సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం వారానికి అతడికి లక్షనుంచి లక్షన్నర రూపాయల రెమ్యునరేషన్‌ ఇస్తున్నారట. ఈ లెక్కన పదిహేనువారాలకుగానూ అతడు సుమారు 20 లక్షల వరకు వెనకేసినట్లు తెలుస్తోంది. నిర్మాణ సంస్థను నెలకొల్పాలనుకున్న మానస్‌ ఈ డబ్బుతో తన కలను సాకారం చేసుకుంటాడేమో చూడాలి!

చదవండి: Bigg Boss 5 Telugu Winner Sunny: విన్నర్‌ సన్నీతో పాటు రన్నరప్‌ షణ్ముఖ్‌కు కూడా ప్లాట్‌

మరిన్ని వార్తలు