Bigg Boss Telugu 5: సిరిది సిగ్గులేని జన్మ, ఆయన కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో

12 Dec, 2021 00:43 IST|Sakshi

Bigg Boss Telugu 5, Madhavi Latha Furious On Siri-Shannu Friendship: బిగ్‌బాస్‌ ఈ మధ్య సిరి- షణ్నుల ఫ్రెండ్‌షిప్‌ను బాగా హైలైట్‌ చేస్తున్నాడు. దానికి కారణం వీళ్ల స్నేహం కొత్తపుంతలు తొక్కుతోంది. ఎప్పుడూ సిరి జపం చేసే షణ్ను ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో నుంచి చూస్తూ ఆమె మీద అజమాయిషీ చేస్తున్నాడన్న వాదన సోషల్‌ మీడియాలో బలంగా వినిపిస్తోంది. సిరి ఎప్పుడేం మాట్లాడాలి? ఏం చేయాలి? అనేది కూడా అతడే డిసైడ్‌ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. అయితే అది కేరింగ్‌ అని కొందరు అంటుంటే కాదు కమాండింగ్‌ అని మరికొందరు వాదిస్తున్నారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై ఫైర్‌ అయిన మాధవీలత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షణ్ముఖ్‌ ప్రవర్తనను తప్పుపడుతూనే సిరిని సైతం ఏకిపారేసింది.

'సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్‌ కోసం దిగజారిన బతుకు.. అంత తిట్టినా వాడితో... అది స్నేహం, అది లవ్‌ అని మెసేజ్‌లు పెడుతున్నారు.. అలా చేస్తే పెళ్లాం కూడా మొగుడి పైత్యం దిగడానికి వాతలు పెడుతుంది. ఓట్ల కోసం, వచ్చే నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారాలా?! ఓపెన్‌గా తల్లిని అవమానించినా అటు తల్లిని, ఇటు పార్ట్‌నర్‌ను లెక్క చేయని పద్ధతి గల మంచి అమ్మాయి సిరి. సరేలే పైసల్‌ కావాలిగా.. షణ్ను ఎక్కడ ముఖం మాడ్చుకుంటాడో అని కన్నా అని ప్రేమగా పిలుస్తావు, కానీ నీ పార్ట్‌నర్‌ (శ్రీహాన్‌)ను కన్నా అని కాకుండా చోటు అని పిలుస్తావ్‌.. మహానటివి. వాడు మీ అమ్మకు గౌరవం ఇవ్వడు. కానీ నువ్వు మాత్రం వాడిలో పార్ట్‌నర్‌ని చూస్కో.. బంధాలు అనుబంధాలకి అర్థాలు మార్చి రాసిన ఘనత మీది.. బిగ్‌బాస్‌ అయ్యాక నిన్ను భరిస్తాడంటే మీ ఆయన దేవుడు. కాళ్లు కడిగి నెత్తిన చల్లుకో వచ్చే జన్మలో అయినా మంచి బుద్ధి ఇస్తాడు.

ఇకపోతే షణ్ముఖ్‌.. ఇమిటేషన్‌ టాస్కులో అతడిని ఇమిటేషన్‌ చేయకూడదట! మాటిమాటికి శ్రీరామ్‌ డ్యాన్స్‌ చేయకపోయినా ఇమిటేషన్‌ టాస్కులో షణ్ను డ్యాన్స్‌ ఎందుకు ఇమిటేట్‌ చేశాడు? శ్రీరామ్‌ ఫీల్‌ అయ్యాడా? స్పోర్టివ్‌ స్పిరిట్‌ ఉండాలి. మనిషి అంటే నీతులు పక్కనోళ్లకు చెప్పడం కాదు.. వీడు సిరిని సెక్యూరిటీ గార్డ్‌లా కాపాడుతున్నాడట.. ఇంట్లో ఉన్న శ్రీరామ్‌, మానస్‌, సన్నీ కామపిశాచులు మరి! వాళ్లు సిరి హగ్‌ కోసం అల్లాడిపోతున్నారు.. అందుకే కదా సిరితో అన్నయ్య అని పిలిపించాడు, ఒక ఫ్రెండ్‌ అనేవాడు ఇంకో ఫ్రెండ్‌ను అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు?' అంటూ ప్రశ్నించింది మాధవి. ఫినాలే దగ్గరపడుతున్న సమయంలో షణ్ను, సిరి ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తూ వాళ్ల పరువు వాళ్లే తీసుకుంటున్నారని అభిమానులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు