Monal Gajjr: బైబై యానీ మాస్ట‌ర్ అంటున్నారు, ప్లీజ్‌..

16 Nov, 2021 21:37 IST|Sakshi

Bigg Boss Telugu 5, Monal Gajjar Supports Anee Master: యానీ మాస్ట‌ర్‌.. కొంత‌కాలంగా ఈ పేరు మార్మోగిపోతోంది. ఆమె నామినేష‌న్స్‌లోకి రావాల‌ని ఎప్ప‌టినుంచో ఎదురు చూస్తుందో వ‌ర్గం. ఎట్ట‌కేల‌కు ఈ వారం యానీ నామినేషన్‌లోకి రావ‌డంతో ఆమె ఎలిమినేట్ అవ‌డం ఖాయ‌మంటూ సోష‌ల్ మీడియాలో ఇప్ప‌టి నుంచే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి. కొంద‌రైతే అడ్వాన్స్‌గా గుడ్‌బై కూడా చెప్పేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారం బిగ్‌బాస్ బ్యూటీ మోనాల్ గ‌జ్జ‌ర్‌కు బొత్తిగా న‌చ్చిన‌ట్లు లేదు. ఏంటీ, అప్పుడే యానీకి గుడ్‌బై చెప్తున్నార‌ని అయోమ‌యానికి లోనైంది. యానీకి ఓటేసి ఆమెను సేవ్ చేయండంటూ అభిమానుల‌ను వేడుకుంది. ఈమేర‌కు ఆమెకు స‌పోర్ట్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో వీడియోలు పోస్ట్ చేసింది.

'కొన్ని అన‌ధికారిక పోల్స్ అప్పుడే యానీ మాస్ట‌ర్‌కు బైబై చెప్పేస్తున్నాయి. ఆమెకు ఓటేయమ‌ని మోనాలియ‌న్స్‌ను వేడుకుంటున్నా.. యానీ నాకు వ్య‌క్తిగ‌తంగా తెలుసు. ఆమె ఎంతో స్ట్రాంగ్‌, జీవితంలో ఎవ‌రి స‌పోర్ట్ లేకుండా ఒంట‌రిగా పైకి వ‌చ్చింది. సొంతిల్లు కొనుగోలు చేయాల‌న్న ఆశ‌తో ఆమె బిగ్‌బాస్ హౌస్‌కు వెళ్లింది. ఆమె క‌ల‌ నెర‌వాల‌ని కోరుకుందాం. ద‌య‌చేసి ఆమెకు ఓటేయండి' అని అభిమానుల‌ను అభ్య‌ర్థించింది మోనాల్‌.

మరిన్ని వార్తలు