Bigg Boss Telugu 5 Grand Finale: గ్రాండ్‌ ఫినాలేలో 'శ్యామ్‌ సింగరాయ్‌' టీమ్‌

18 Dec, 2021 21:06 IST|Sakshi

Bigg Boss 5 Telugu Grand Finale Guests: నెవర్‌ బిఫోర్‌ అన్న రీతిలో గ్రాండ్‌ ఫినాలేను ప్లాన్‌ చేస్తున్నారు బిగ్‌బాస్‌ నిర్వాహకులు. ఇప్పటివరకు టాలీవుడ్‌ హీరోహీరోయిన్లను ముఖ్య అతిథులుగా తీసుకువచ్చిన బిగ్‌బాస్‌ టీం ఈసారి మాత్రం బాలీవుడ్‌ స్టార్ల మీద ఫోకస్‌ పెట్టింది. ఇప్పటికే బాలీవుడ్‌ జంట రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే స్పెషల్‌ గెస్టులుగా రానున్నారని ప్రచారం జరిగింది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ నుంచి రాజమౌళి, రామ్‌చరణ్‌, అలియా భట్‌ కూడా వస్తున్నారట! వీళ్లతో పాటు టాలీవుడ్‌ నుంచి మరో స్టార్‌ కూడా వస్తున్నట్లు తెలుస్తోంది.

బిగ్‌బాస్‌ తెలుగు రెండో సీజన్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన నేచురల్‌ స్టార్‌ నాని మరోసారి బిగ్‌బాస్‌ స్టేజీపై సందడి చేయనున్నాడట! ఆయనతో పాటు హీరోయిన్‌ సాయిపల్లవి, రాక్‌ స్టార్‌ దేవిశ్రీప్రసాద్‌ శ్యామ్‌ సింగ రాయ్‌ ప్రమోషన్స్‌ కోసం గ్రాండ్‌ ఫినాలేకు విచ్చేయనున్నట్లు సమాచారం. వీళ్లతోపాటు డైరెక్టర్‌ సుకుమార్‌, నటుడు జగపతిబాబు, రష్మిక మందన్నా ఇలా ఇంకెందరో షోలో హాజరు కానున్నట్లు తెలుస్తోంది.. ఏదేమైనా రెండు సీజన్ల తర్వాత నాని మరోసారి బిగ్‌బాస్‌ స్టేజీపైకి రానుండటంతో అతడి ఫ్యాన్స్‌ తెగ సంబరపడుతున్నారు. మరి ఈ స్టార్ల సందడి చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే!

మరిన్ని వార్తలు