Noel Sean: ఆ కంటెస్టెంట్‌కే సపోర్ట్‌ చేస్తున్న నోయల్‌

24 Sep, 2021 20:23 IST|Sakshi

సింగర్‌, యాక్టర్‌ నోయల్‌ సేన్‌.. గత బిగ్‌బాస్‌ సీజన్‌లో పాల్గొని హల్‌చల్‌ చేశాడు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు చాలా కూల్‌గా ఉంటూ అందరికీ హితబోధ చేస్తూ బాబాలా మారిపోయాడు. కానీ తనకు ఆరోగ్యం సహకరించలేక కుంటుకుంటూ నడిచి, చివరకు షోలో కొనసాగలేని పరిస్థితి ఏర్పడంతో అర్ధాంతరంగా షో నుంచి తప్పుకున్నాడు. అయితే వెళ్లిపోయేటప్పుడు మాత్రం తన మీద, తన హెల్త్‌ మీద కుళ్లు జోకులేసిన ఒక్కొక్కరికీ వాయించేసి వీడ్కోలు తీసుకున్నాడు. ఇప్పటికీ నోయల్‌ అనగానే బిగ్‌బాస్‌ వీక్షకులకు ఇదే సీన్‌ గుర్తొస్తుంది. షో నుంచి నిష్క్రమించాక అతడు దేత్తడి హారిక, లాస్యకు సపోర్ట్‌ చేసి వారికి అండగా నిలబడ్డాడు.

ఇదిలా వుంటే ఈ మధ్యే ప్రారంభమైన బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌లోనూ అతడు ఓ కంటెస్టెంట్‌కు సపోర్ట్‌ చేస్తున్నాడు. సింగర్‌ శ్రీరామచంద్రకు ఓటేయమని అభిమానులను కోరుతున్నాడు. ఈవారం అతడు నామినేషన్స్‌లో ఉండటంతో శ్రీరామ్‌ను ఎలాగైనా గట్టెక్కించాలని ప్రయత్నిస్తున్నాడు. అనధికారిక పోల్స్‌లో అయితే శ్రీరామ్‌కు ఈవారం ఈజీగా సేఫ్‌ అవుతాడని తెలుస్తోంది. ఎవరో ఒక లేడీ కంటెస్టెంట్‌ ఎలిమినేట్‌ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మరి అఫీషియల్‌ ఓటింగ్‌లోనూ శ్రీరామ్‌ టాప్‌ 3లో ఉన్నాడా? అన్నది తెలియరాలేదు. ఏదేమైనా శ్రీరామ్‌ హౌస్‌లో ఉన్నన్ని రోజులు అతడికి నోయల్‌ అండదండలు గట్టిగానే ఉండేటట్లు కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు