Bigg Boss 5 Telugu:మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూ..  అడ్డంగా బుక్కైన రవి, వీడియో వైరల్‌

21 Sep, 2021 19:07 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రియ వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. లహరిని నామినేట్‌ చేసిన ప్రియ.. రవి, లహరి అర్థరాత్రి సమయంలో రెస్ట్‌ రూమ్‌లో హగ్‌ చేసుకున్నారని, ఆమె ఎక్కువగా మగాళ్లతోనే తిరుగుతుందంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది. అయితే అది నార్మల్‌ హగ్గేనని, రవిని నేను బ్రో అని పిలుస్తానని , మా మధ్య వేరే ఉద్దేశం లేదని కుండబద్దలు కొట్టింది లహరి. రవి కూడా అలాంటి రాంగ్‌ స్టెట్‌మెంట్స్‌ ఎలా ఇస్తావంటూ ప్రియపై ఫైర్‌ అయ్యాడు.
(చదవండి: రవి, లహరి మిడ్‌నైట్‌ హగ్‌ ఇష్యూ.. యాంకర్‌ భార్య షాకింగ్‌ కామెంట్‌)

తన కూతురికి ఈ విషయం అర్థమయితే ఎలా ఉంటుందంటూ ఎమోషనల్‌ అయ్యాడు కూడా. ఇక లహరి కూడా ఒక నేషనల్‌ మీడియాలో ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతారంటూ భావోద్వేగానికి లోనైంది. ప్రియ మాత్రం తాను చూసిందే చెప్పానంటూనే రవి, లహరిలకు సారీ చెప్పింది. అయితే ఈ ఇష్యూ ఇంతటితో ఆగలేదని తాజా ప్రోమో చూస్తే అర్థమవుతుంది. అందులో ప్రియ ఎందుకు ఆ కామెంట్‌ చెప్పిందో వివరించింది.

గొడవ జరగడానికి ముందు రవి తనకు ఎం చెప్పాడో ఆ విషయాన్ని లహరితో షేర్‌ చేసుకుంది ప్రియ. లహరి బిగ్ బాస్ తరువాత యాంకర్‌గా నిలదొక్కుకోవడానికి ట్రై చేస్తుందని.. అందుకే నా వెంట పడుతుందనే అనుమానం ఉందని ప్రియతో అన్నాడు రవి. అంతేకాదు హౌస్‌లో అంతమంది పెళ్లి కాని వాళ్లు ఉన్నప్పటికీ ఆమె తన వెంటే పడుతుందని.. ఎక్కడికి వెళ్లినా తనతో వస్తుందని.. ఆమెకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ రవి తనతో చెప్పిన మాటలను ఉన్నది ఉన్నట్లుగా లహరికి వివరించింది ప్రియ. 

దీంతో లహరి డైరెక్ట్‌గా వచ్చి రవిని నిలదీసింది. దీంతో షాకైన రవి.. ‘అక్కా నేను అసలు సింగిల్ మెన్ అనే పదాన్ని ఉపయోగించలేదు.. నేను నీతో అలా చెప్పలేదు’ అని ప్రియతో వాదనకు దిగాడు. అయితే ప్రియ మాత్రం నువ్ అన్నావ్ బ్రో అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పింది. ఆ తరువాత తనని బ్యాడ్ చేయడానికే ప్రియ ఇలా అంటుందంటూ లహరికి చెప్పాడు రవి. 

అయితే లహరి గురించి ప్రియతో రవి చెప్పిన మాటలు నిజమేనని నిన్నటి బిగ్‌బాస్‌ ఎపిసోడ్‌ చూసిన ప్రతి ఒక్కరి అర్థమవుతంది. తాజాగా లహరి గురించి రవి మాట్లాడిని మాటలకు తాలుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అందో రవి నిజంగా లహరిపై బ్యాడ్‌ కామెంట్స్‌ చేశాడు. అయితే అతని ఉద్దేశం ఎలా ఉన్నప్పటికీ ప్రియతో అలా చెప్పడం, ప్రియ అదే విషయానికి కొంచెం మసాలా దట్టించి నామినేషన్‌ ప్రక్రియలో అందరి ముందు నోరు విప్పడం.. వివాదానికి దారి తీసింది. అయితే నిన్నటి వరకు ప్రియని తిట్టుకున్న వాళ్లంతా తాజా వీడియో చూసి రవిని కూడా ట్రోల్‌ చేస్తున్నారు. మరి ఈ మిడ్‌నైట్‌ హగ్‌ గొడవ ఎక్కడి దారి తీసిందో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ చూడాల్సిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు