Shanmukh Home Tour: షణ్ముక్‌ ఇల్లు ఎంత విలాసవంతంగా ఉందో చూడండి..

23 Dec, 2021 12:20 IST|Sakshi

Bigg Boss 5 Telugu Runner up Shanmukh Jaswanth Vizag Home Tour: యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముక్‌ జస్వంత్‌ బిగ్‌బాస్‌ షోతో మరింత పాపులర్‌ అయ్యాడు. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షణ్నూ.. సిరితో మితిమీరిన రిలేషన్‌తో కప్పు చేజార్చుకున్నాడు. దీంతో రన్నరప్‌గా సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అప్పటివరకు వెబ్‌సిరీస్‌లతో సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ పెంచుకున్న షణ్నూ..అదే రీతిలో నెగిటివిటీని సైతం మూటగట్టుకున్నాడు.

అయితే ఇటీవలె విడుదలైన బిగ్‌బాస్‌ బజ్‌ ఇంటర్వ్యూతో అసలు షణ్నూ ఏంటో అర్థమయ్యిందని, అతని నిజాయితీ చేస్తుంటే ముచ్చటేస్తుందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇక షణ్ముక్‌ స్వస్థలం వైజాగ్‌ కాగా, కెరీర్‌ నిమిత్తం అతడు హైదరాబాద్‌లో ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా వైజాగ్‌లోని షణ్నూ ఇంటికి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్‌ విశేషాలను షణ్న తల్లి షేర్‌ చేసుకున్నారు. ఓ యూట్యూబ్‌లో చానల్‌లో షణ్నూ 'హోం టూర్‌'ను రిలీజ్‌ చేశారు. మరి ఆ ఇల్లు ఎంత లగ్జరీగా ఉందన్నది మీరే చూసేయండి..

మరిన్ని వార్తలు