Shanmukh Jaswanth And Siri Hanmanth: షణ్ముఖ్‌కు ముద్దు పెట్టిన సిరి

28 Oct, 2021 19:32 IST|Sakshi

Bigg Boss 5 Telugu 5 Latest Promo: Siri Kiss To Shanmukh Jaswanth: తెలుగు బిగ్‌బాస్‌ 5 సీజన్‌ ప్రారంభమై 50 రోజులు గడిచిపోయింది. ఇప్పటికే 7 మంది ఎలిమినేట్‌ అయ్యారు. ఇంతకాలం గొడవలు, వివాదాలు, అలకలతో సాగిన బిగ్‌బాస్‌ హౌజ్‌లో నేడు ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో సిరి, షణ్ముఖ్‌కు ముద్దు పెట్టడం చర్చనీయాంశమైంది. ఈ ప్రోమో షణ్ను మాట్లాడుతూ.. ‘మానసికంగా డిస్ట్రబ్‌ అయినప్పుడు ఎమోషనల్‌గా అటాచ్‌ అయిపోతాం’ అని అనగానే సిరి ‘నేను బాగానే ఉన్నా రా.. నీ వల్లే మెంటల్‌గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా’ అని అంటుంది. వెంటనే ‘అయితే దూరం పెట్టుకో..’ అని షణ్ను అంటాడు.

అలా వారి మధ్య సంభాషణ జరిగిన కాసేపటికి షణ్ముఖ్‌ ‘అరె.. ఇక నేను మాట్లాడను రా అదే బెస్ట్‌’ అనడంతో సిరి వచ్చి షణ్ముఖ్‌కు ముద్దుపెట్టి వెళుతుంది. ఆ తర్వాత షణ్ను ఆశ్చర్యంగా కెమెరా వైపు చూస్తూ ‘అరె ఎంట్రా ఇది’ అంటూ ఎప్పటిలాగే తన డైలాగ్‌ను వాడతాడు. అలాగే ‘అంతా రికార్డు చేశారా? ఇక నాకు ఉంటుంది’ అంటూ ఫన్నీగా అంటాడు. దీంతో సిరి-షణ్ముఖ్‌ల స్నేహం కాస్తా కొత్త బంధానికి తెరలెపనుందా? అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే  ఈ వారం కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపికైన షణ్ముఖ్‌, సిరి, శ్రీరామ్‌, అనీ, సన్నీ, మానస్‌లు పోటీలో విజయం సాధించడానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. ఇందులో భాగంగా పోటీదారులకు బిగ్‌బాస్‌ ‘వెంటాడు వేటాడు’ అనే టాస్క్‌ ఇచ్చాడు.

థర్మాకోల్‌తో నిండిన గోనె సంచులను కెప్టెన్సీ పోటీదారులకు ఇచ్చిన బిగ్‌బాస్‌.. బజర్‌ మోగేలోపు ఎవరి సంచిలో ఎక్కువ బాల్స్‌ ఉంటాయో వారే ఈ వారం కెప్టెన్‌ అవుతారని సూచించాడు. టాస్క్‌లో భాగంగా పోటీదారులు తమ ప్రత్యర్థుల సంచులను ఖాళీ చేయడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించవచ్చని బిగ్‌బాస్‌ తెలిపాడు. దీంతో పోటీదారుల మధ్య హోరాహోరీ పోరు కొనసాగింది. ఒకరినొకరు నెట్టేసుకుంటూ, తోసుకుంటూ, కింద పడేస్తున్నారు. దీంతో కంటెస్టెంట్ల మధ్య కొట్లాటతో పాటు మాటల యుద్ధం జరుగుతోంది. ఇక యానీ మాస్టర్‌.. సిరి-షణ్ముఖ్‌లపై రగిలి పోవడంతో ఈ టాస్క్‌లో కాస్తా ఉద్రిక్తత చోటుచేసుకున్నట్లు కనిపిస్తోంది. 

మరిన్ని వార్తలు