Bigg Boss Telugu 5: ఇంకో భుజం మీద కూడా కిస్‌ చేయమన్నా: సిగ్గుపడిన హమీదా

25 Sep, 2021 18:59 IST|Sakshi

Sreerama Chandra- Hamida: బిగ్‌బాస్‌ హౌస్‌లో అమ్మాయి, అబ్బాయి కలిసి మాట్లాడుకునే సాధారణ ముచ్చట్లను కూడా లవ్‌ యాంగిల్‌లో చూపించడం బిగ్‌బాస్‌కే చెల్లుతుంది. అయితే బిగ్‌బాస్‌ అలా చూపించాడంటే దానికో అర్థం, పరమార్థం ఉంటుంది. త్వరలోనే ఆ ఇద్దరి మధ్య లవ్‌ యాంగిల్‌ స్టార్ట్‌ కాబోతుందని ముందుగానే జనాలకు హింట్‌ ఇస్తాడన్నమాట! తాజా సీజన్‌లో సింగర్‌ శ్రీరామచంద్ర, నటి హమీదా లవ్‌ బర్డ్స్‌గా మారనున్నట్లు కనిపిస్తోంది. శ్రీరామ్‌ ఎక్కువగా హమీదాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. ఆమెకు స్పెషల్‌గా మసాజ్‌లు కూడా చేశాడు. ఈ మధ్యే రొమాంటిక్‌ డ్యాన్స్‌తో అందరినీ అలరించిందీ జంట.

లేటెస్ట్‌ ఎపిసోడ్‌లో శ్రీరామ్‌ గురించి హమీదా.. కాజల్‌తో చెప్పుకుంటూ సిగ్గుపడిపోయింది. 'శ్రీరామ్‌ రాత్రి కప్‌ కడుగుతున్నాడు. ఆ సమయంలో నేను నా కప్‌ అక్కడ పెట్టి వెళ్లాను. వచ్చేసరికి నా కప్‌ కూడా కడుగుతున్నాడు. ఎందుకిలా చేశావంటే పర్లేదన్నాడు. తర్వాత నన్ను హగ్‌ చేసుకుని భుజంపై ముద్దు పెట్టాడు. వెంటనే మరో భుజం చూపించి అక్కడ కూడా కిస్‌ చేయమన్నాడు' అని నవ్వేసింది.

రాత్రిపూట శ్రీరామ్‌, హమీదా మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా హమీదా మాట్లాడుతూ.. నేను సన్నీతో, మానస్‌తో, నీతో మాట్లాడే తీరులో తేడా కనిపించడం లేదా? అంతా ఒకేలాగా అనిపిస్తుందా? అని మనసులోని మాటను బయటపెట్టే ప్రయత్నం చేసింది. దానికి శ్రీరామ్‌.. నాకు తెలియదు, అంతలా గమనించను అని ఆన్సరివ్వడంతో హర్ట్‌ అయిన హమీదా కొన్నిసార్లు అర్థం అవుతావు, కొన్నిసార్లు కావు అని బుంగమూతి పెట్టుకుంది. దీంతో శ్రీరామ్‌.. నీకు మానస్‌కు మధ్య ఫ్రెండ్‌షిప్‌ ఉంది. కానీ మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్‌ ఉందో తెలియట్లేదు. మనం బ్రదర్‌ అండ్‌ సిస్టరా? ఫ్రెండ్సా? అంతకు మించా? అనేది అర్థం కావట్లేదు. మనిద్దరి రిలేషన్‌ క్వశ్చన్‌మార్క్‌లో ఉందన్నాడు. కానీ వీళ్లిద్దరి వ్యవహారం చూసిన నెటిజన్లు వీళ్ల మధ్య సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌ స్టార్ట్‌ అయిందంటున్నారు.

మరిన్ని వార్తలు