Bigg Boss 5 Telugu Nominations: డేంజర్‌ జోన్‌లో ఆ ముగ్గురు, ఎలిమినేట్‌ అయ్యేది ఎవరంటే..

28 Sep, 2021 18:40 IST|Sakshi

బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ రోజు రోజుకి రసవత్తరంగా మారింది. నామినేషన్‌ ప్రక్రియలో ఇంటి సభ్యుల అసలు రంగు బయటపడుతోంది. నాలుగో వారంలో హౌస్‌మేట్స్‌ ఒక్కొక్కరి బండారాలు బయటపెడుతూ నామినేట్‌ చేసుకున్నారు. ఈ వారం హయ్యెస్ట్‌గా 8 మంది(నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబో, రవి, ప్రియ, కాజల్‌, సిరి హన్మంత్‌, సన్నీ) ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్‌ అవుతారనే విషయంపై సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. 

ఈ వారం నామినేషన్‌ ఉన్న వారిలో రవి. సన్నీ, ప్రియ, సిరి, కాజల్‌లకు ఎలాంటి ఢోకాలేదు. ఎందుకంటే వారికి బయట ఫ్యాన్స్‌ ఎక్కువగా ఉన్నారు. గేమ్‌ పరంగా కూడా బాగానే ఆడుతున్నారు. ఎటోచ్చి ఈ వారం రిస్క్‌లో పడేది ఎవరంటే నటరాజ్‌ మాస్టర్‌, యానీ మాస్టర్‌, లోబోలు మాత్రమే. వీరిలో ఎక్కువగా నటరాజ్‌ మాస్టర్‌కే రిస్కు ఎక్కువ. ఆయన టాస్కుల్లో చక్కగా ఆడుతున్న​ప్పటికీ.. ప్రవర్తన మాత్రం అటు కంటెస్టెంట్స్‌ని, ఇటు ప్రేక్షకులను ఇరిటేట్‌ చేస్తుంది. 
(చదవండి: ఏడేళ్లు సహజీవనం చేశా, నా ఆస్తి అడిగాడు: సరయూ)

ముఖ్యంగా ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో ఆయన దారుణంగా ప్రవర్తించాడు. పులితో వేట.. నాతో ఆట ప్రమాదం అంటూ మీసం తీప్పడం లాంటివి ఓవరాక్షన్‌గా అనిపించాయి. ఎవరైనా తనను నామినేషన్‌ చేస్తే చాలు తన వెనుక ఎవరో ఉన్నారని, అందుకే తనను నామినేట్‌ చేశారని ఆరోపించడం, హౌస్‌లో అంతా నటిస్తున్నారని, తాను మాత్రమే ఓపెన్‌గా ఉంటున్నానని తనకు తాను కితాబిచ్చుకోవడం లాంటివి నటరాజ్‌ మాస్టర్‌పై నెగెటివ్‌ ఇంప్రెస్‌ క్రియేట్‌ చేస్తున్నాయి. ఇంట్లో గుంటనక్క, ఊసరవెళ్లి, గొర్రెలు ఉన్నాయంటాడు.. వారెవరో చెప్పడం. ఇవన్ని  ఇంటి సభ్యులతో పాటు ఆడియెన్స్‌కు కూడా మింగుడుపట్టడం లేదు. ఈ వారం కనుక అతని ప్రవర్తలో మార్పు లేకపోతే ఎలిమినేట్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

ఇక లోబో విషయానికి వస్తే.. ఇంట్లో ఉన్న ఏకైక ఎంటర్‌టైనర్‌ అతనే. టాస్కులు సరిగా ఆడకపోవడం అతని మైనస్‌. అలాగే నిన్నటి నామినేషన్‌  ప్రక్రియలో ప్రియపై గట్టిగా అరవడం, మీదమీదకు వెళ్లడం లోబో చేసిన అతిపెద్ద మిస్టేక్‌. అయితే ఆయన చేసే జోకులే అతన్ని కాపాడే చాన్స్‌ ఉంది. ఒకవేళ ఈ సారి లోబో ఎలిమినేట్‌ అయితే బిగ్‌బాస్‌ షో బోరింగ్‌ ఉంటే అవకాశాలు ఉన్నాయని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన లోబో కాస్త సేఫ్‌ జోన్‌లో ఉన్నట్లే తెలుస్తోంది.

ఇక యానీ మాస్టర్‌ విషయానికొస్తే.. ఆమె అందరితో చక్కగా కనెక్ట్‌ అయినప్పటికీ..నామినేషన్‌కి ఆమె చెప్పే రీజన్‌ కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులకు కూడా నచ్చడం లేదు. ప్రతిసారి నా కంటే స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ కనుక నామినేట్‌ చేస్తున్న అని యానీ చెప్పడం కరెక్ట్‌ కాదని నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు. ఈ లెక్కన ఆమె కూడా డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే బిగ్‌బాస్‌ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఈ వారం ఏదైన అద్భుతాలు జరిగితే తప్ప ఈ ముగ్గురిలో ఒక్కరు ఎలిమినేట్‌ అవ్వడం పక్కా అని నెటిజన్స్‌ చర్చించుకుంటున్నారు. 
 

మరిన్ని వార్తలు