‘బిగ్‌బాస్‌’ఫేమ్‌ మానస్‌కు మంత్రి తలసాని అభినందనలు

4 Jan, 2022 17:06 IST|Sakshi

బుల్లితెర బిగ్‌ రియాల్టీ షో బిగ్‌బాస్‌ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఈ షోకి అభిమానులు ఉన్నారు. తెలుగులో కూడా ‘బిగ్‌బాస్‌’కి మంచి ఆదరణ ఉంది. ఇప్పటికే ఐదు సీజన్స్‌ పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరో సీజన్‌కి రెడీ అవుతోంది.  కాగా ఇటీవల పూర్తయిన ఐదో సీజన్ ప్రేక్షకులను మరింత రంజింప చేసిందని చెప్పాలి. 

మంచి మంచి గేమ్స్ తో షో ఆద్యంతం ప్రేక్షకులను థ్రిల్ కి గురిచేసింది. టాప్‌5లో ఉన్న మానస్ తన ఆటతీరుతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని స్టార్ హోదా లో హౌస్ నుంచి బయటకు వచ్చాడని చెప్పాలి. ఆయన తన ఆటతీరుతో, ప్రవర్తన తో కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు ఈ ఫేమ్ తో మంచి మంచి అవకాశాలను కూడా అందుకున్నాడని చెప్పాలి. తాజాగా బిగ్ బాస్ షో లో ఆయన ప్రదర్శనకు మెచ్చి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. 

ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. బిగ్ బాస్ షో లో మానస్ ఆట తీరు చాలా బాగుంది. ఆయన ప్రవర్తన ఎంతో హుందాగా ఉంది. తప్పకుండా భవిష్యత్తులో మంచి మంచి అవకాశాలు సంపాదించుకుంటాడు. ఆల్ ది బెస్ట్ టు మానస్ అన్నారు.

బిగ్ బాస్ ఫేమ్ మానస్ మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో నా ప్రయాణం ఇంత బాగా జరగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నేను హౌస్ లో ఉన్నప్పుడు నన్ను ఎంతో సహకరించి, ఇప్పుడు నన్ను ఆశీర్వదించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

మరిన్ని వార్తలు