Bigg Boss: బిడ్డకు జన్మనిచ్చిన నాగిని సీరియల్ నటి.. పోస్ట్ వైరల్!

28 Oct, 2023 13:39 IST|Sakshi

బాలీవుడ్‌లో కుసుమ్‌ అనే సిరీయల్‌లో కుముద పాత్రకు గుర్తింపు తెచ్చుకున్న భామ ఆష్కా గొరాడియా. ఆ తర్వాత లగీ తుజ్సే లగన్‌లో కళావతి పాత్రకు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. స్మృతి ఇరానీ ప్రధాన పాత్రలో నటించిన క్యుంకీ సాస్ భి.. కభీ బహుతీ సీరియల్‌లో నటించింది. ఆ తర్వాత  బాల్ వీర్, నాగిని, నాగిని-2 సీరియల్స్‌లో కూడా కనిపించింది. అంతే కాకుండా ఖత్రోన్ కే ఖిలాడీ, బిగ్ బాస్, నాచ్ బలియే వంటి రియాలిటీ షోలలో కూడా పాల్గొన్నారు. బిగ్ బాస్ సీజన్- 6లో పాల్గొన్న ఆష్కా గొరాడియా తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

ఆష్కా గోరాడియా డిసెంబర్ 1, 2017న వ్యాపారవేత్త బ్రెంట్ గోబుల్‌ని వివాహం చేసుకుంది. తాజాగా బాబు జన్మించినట్లు సోషల్ మీడియా ద్వారా దంపతులు ప్రకటించారు. దీనికి సంబంధించి గోరాడియా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. తమ ముద్దుల బిడ్డకు విలియం అలెగ్జాండర్ అని పేరు కూడా పెట్టినట్లు వెల్లడించారు. కాగా.. ఆష్కా ఈ ఏడాది మే నెలలో గర్భం ధరించినట‍్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

A post shared by Brent Goble (@ibrentgoble)

A post shared by Aashka Goradia Goble (@aashkagoradia)

మరిన్ని వార్తలు