Bigg Boss 6 : ఇంత త్వరగా బయటకు పంపిస్తారని అనుకోలేదు: అభినయశ్రీ ఎమోషనల్‌

18 Sep, 2022 23:35 IST|Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్‌కి శనివారం అంతా గట్టిగా క్లాస్‌ పీకిన నాగార్జున..ఆదివారం మాత్రం వారితో చాలా సరదాగా గడిపాడు. సండే అంటే బిగ్‌బాస్‌ ఇంట్లో ఫండే. అందుకు తగ్గట్టే సరదాగేమ్స్‌తో పాటు తమన్నా సందడితో ఆదివారం ఎపిసోడ్‌ ఫుల్‌ ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. చివరల్లో ఒకరిని ఎలిమినేట్‌ చేసి అందరిని ఏడిపించాడు బిగ్‌బాస్‌. మరి ఆ ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరు? తమన్నా తీసుకొచ్చిన కానుక ఎవరికి దక్కింది? తదితర విషయాలు నేటి ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.

తమన్నా లెటెస్ట్‌ మూవీ బబ్లీ బౌన్సర్‌ ప్రమోషన్స్‌లో భాగంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లింది. ఆమె చేతికి ఒక కానుక ఇచ్చి ఇంట్లోకి పంపాడు నాగార్జున. ఆ కానుక కేవలం ఇంట్లో ఉన్న మగవాళ్లకు మాత్రమే అని చెప్పడంతో లేడి కంటెస్టెంట్స్‌ అంతా ‘అన్యాయం సర్‌.. మీరే అలా చెప్తే ఎలా? లాస్ట్‌ వీక్‌ కూడా మగవాళ్లే గెలిచారు’ అని అన్నారు. అది న్యాయమో అన్యాయమో కాసేపయ్యాక మీకే చెప్తానంటూ.. మగవాళ్లను, ఆడవాళ్లను వేరు వేరు టీమ్‌గా కూర్చోబెట్టాడు నాగ్‌. తర్వాత తమన్నాని పరిచయం చేశాడు. బాయ్స్‌ అంతా లేడి కంటెస్టెంట్స్‌లో ఎవరు బౌన్సర్‌ కావాలనుకుంటున్నారో చెప్పి వారి చేతికి బ్యాండ్‌ కట్టాలని చెప్పాడు.

దీంతో ఒక్కక్కరు తమకు నచ్చిన కంటెస్టెంట్స్‌కి బ్యాండ్‌ కట్టారు. ఆదిరెడ్డి వెళ్లి గీతుకు బ్యాండ్‌ కట్టాడు. ‘గీతు దగ్గర బాడీ లేదు కానీ ఆమె మాటలు నాకు బౌన్సర్‌లా పని చెస్తాయి’అని ఆదిరెడ్డి చెప్పాడు. తర్వాత బాలాదిత్య వెళ్లి గీతూకే బ్యాండ్‌ కట్టాడు. బిగ్‌బాస్‌ నుంచి తనను కాపాడానికే గీతూని బౌన్సర్‌లా ఎంచుకున్నానని చెప్పాడు. ఇక అర్జున్‌ కల్యాణ్‌ తన చాయిస్‌గా శ్రీసత్యను ఎంచుకున్నట్లు చెప్పగానే.. ఆడియన్స్‌ అంతా గట్టిగా ఈళలు వేశారు. వారిని చూసి ఏంటి ఇంత స్పందన అని నాగ్‌ అడగ్గా..‘వారి మధ్య ఏడో ఉంది అని ఓ యువతి చెప్పడంతో అందరూ గట్టిగా నవ్వారు.‘అదేం లేదు సర్‌.. మేం జస్ట్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే’అని అర్జున్‌ అన్నాడు. ఇక శ్రీహాన్‌ తన బౌన్సర్‌గా ఆరోహిని ఎంచుకున్నాడు. ఇలా హౌస్‌లోని 10 మంది మగవాళ్లు.. తమకు నచ్చిన వాళ్లకి బ్యాండ్‌ కట్టారు.

అత్యధికంగా బ్యాండ్స్‌ దక్కించుకున్న గీతూని లేడి బౌన్సర్‌గా ప్రకటించాడు నాగార్జున. ఇక తమన్నా దగ్గర ఉన్న కానుకను ఎవరి ఇవ్వాలో అనేది ఆమెనే డిసైడ్‌​  చేసుకోమన్నాడు. ఆమె మాత్రం రోహిత్‌, రేవంత్‌, అర్జున్‌, సూర్యలను ఎంచుకుంది. ఆ నలుగురు తమన్నాను ఇప్రెస్‌ చేయాలని నాగ్‌ సూచించగా..రేవంత్‌ పాటతో, సూర్య మిమిక్రీతో ఇంప్రెస్‌ చేస్తే.. రోహిత్‌, అర్జున్‌ తమ మాటలను తమన్నాను పొగిడేశారు. వీరిలో నుంచి రోహిత్‌, అర్జున్‌లను నాగ్‌ పక్కకి పెట్టాడు. తర్వాత రేవంత్‌, సూర్యలో సూర్యకి తన కానుక అందించింది తమన్నా. తర్వాత గీతూ సేవ్‌ అయినట్లు ప్రకటించాడు నాగార్జున.

తర్వాత ఇంటి సభ్యులకు రెండు టీమ్‌లుగా విభజించాడు. వారితో పాటను గుర్తించే గేమ్‌ ఆడించాడు. ఆ తర్వాత ఫైమా, రేవంత్, రాజశేఖర్‌, మెరీనా అండ్‌ మెరీనాలను సేవ్‌ చేశాడు. ఇక చివరగా ఆదిరెడ్డి, అభినయ శ్రీ మిగలగా..వారిలో అభినయశ్రీ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించాడు. 

స్టేజ్ మీదకు వచ్చిన అభినయ.. ఇంత త్వరగా నా ఆడియెన్స్ నన్ను బయటకు పంపిస్తారు అని అనుకోలేదని ఎమోషనల్‌ అయింది. అనంతరం ఆమెకు నాగ్ ఓ టాస్క్ ఇస్తాడు. ఇంట్లో హానెస్ట్‌గా ఉన్న ఐదుగురు, హానెస్ట్‌గా లేని ఐదుగురి పేర్లు చెప్పమని అడిగాడు.హానెస్ట్.. కేటగిరీలో ఫైమా, చంటి, శ్రీ సత్య, బాలాదిత్య, సూర్యల పేర్లను చెప్పి, డిస్ హానెస్ట్ కేటగిరీలో అయితే ఒక్క రేవంత్ పేరు మాత్రమే చెప్పింది. ఆట మధ్యలో పర్సనల్ విషయాలు చెబుతాడు.. అది నాకు నచ్చలేదు.. నువ్ కన్నింగ్‌లా అనిపిస్తున్నావ్ అని ఆయన మొహం మీదే చెప్పాను.. అంటూ అభినయ అంటుంది. 

మరిన్ని వార్తలు