Bigg Boss 6 Telugu: కెప్టెన్‌గా ఆదిరెడ్డి, జైలుకు వెళ్లిన అర్జున్‌.. ఏడ్చేసిన కీర్తి

24 Sep, 2022 10:12 IST|Sakshi

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన​్‌గా ఆదిరెడ్డి విజేతగా నిలుస్తాడు. ఇక అందరికంటే ఎక్కువగా కంటెంట్‌ ఇస్తున్నది తానే అంటూ గీతూ తన అభిప్రాయం చెప్తుంది. దీనికి ఇంటి సభ్యులు కూడా అంగీకరించి ఆమెకు 10నిమిషాల చైన్‌ను కట్టబెడతారు. మరోవైపు అందరికంటే తక్కువగా జీరో మినిట్స్‌ ట్యాగ్‌తో అ‍ర్జుణ్‌ జైలుకు వెళ్తాడు. ఇంకా మరెన్నో విశేషాలను బిగ్‌బాస్‌ సీజన్‌-6 20వ ఎపిసోడ్‌ నాటి హైలైట్స్‌లో చదివేద్దాం. 

బిగ్‌బాస్‌ కొత్త కెప్టెన్సీ ఎంపిక కోసం ఎత్తెర జెండా అనే టాస్క్‌ను నిర్వహించారు. ఇందులో భాగంగా  ఇసుక కుప్పలో నుంచి ఇసుకను ఓ చిన్న బకెట్‌లో తీసుకెళ్లి వాళ్లకు కేటాయించిన డబ్బాలో వేయాల్సి ఉంటుంది. పైమా డిస్‌క్వాలిఫై అయినందున ఆదిరెడ్డి, శ్రీహాన్‌, సత్యలు ఈ టాస్క్‌లో ఆడారు. శ్రీహాన్‌ గెలుపుకు ఒక అడుగు దూరంలో మిగిలిపోతాడు. అందరికంటే ముందుగా ఆదిరెడ్డి టాస్క్‌ను విజయవంతంగా కంప్లీట్‌ చేయడంతో అతనే కెప్టెన్‌గా నిలుస్తాడు.

దీంతో తన భార్య కవితను తలుచుకొని ఉద్వేగానికి లోనవుతాడు. నువ్వు నన్ను ఎప్పుడూ అర్థం చేసుకుంటావ్‌.. లవ్‌ యూ కవిత అంటూ భార్యకు ‍ప్రేమ సందేశాన్ని పంపుతాడు. ఇక డేంజర్‌ జోన్‌లో ఉన్న వసంతికి ఎందుకో గానీ ఎలిమినేట్‌ అవుతాన్న భయం మొదలైనట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఇనయాతోనూ ఇదే విషయాన్ని చర్చించింది. మరోవైపు గీతూ కావాలని కేవలం కంటెంట్‌ కోసమే చేస్తున్నా అందరూ ఆమెకే సపోర్ట్‌ చేస్తున్నారంటూ ఫీల్‌ అవుతుంది.

ఇక ఎపిసోడ్‌లో ఎవరు ఎన్ని నిమిషాలు కనిపిస్తారన్నది ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని దానికి సంబంధించిన చెయిన్స్‌ ధరించాల్సి ఉంటుంది అని టాస్క్‌ నిర్వహించగా, అందరి కంటే ఎక్కువగా గీతూ 10నిమిషాల చైన్‌ను ధరిస్తుంది. రేవంత్‌ 7నిమిషాలు, ఫైమా 6నిమిషాలు, శ్రీహాన్‌, ఇనయాలకు 5నిమిషాల చైన్‌ ధరిస్తారు. ఇక చివరగా అందరికంటే తక్కువగా జీరో నిమిషాలు సంపాదించిన ఆరోహి, ఆర్జున్‌, కీర్తిలలో ఎవరో ఒకరు జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బిగ్‌బాస్‌ ఆదేశిస్తాడు. దీంతో ముగ్గురూ ఏకాభిప్రాయంతో నిర్ణయించుకొని అర్జున్‌ను జైలుకు పంపుతారు. అయితే తనకు జీరో అన్న ట్యాగ్‌ రావడంపై కీర్తి భోరుమని ఏడ్చేస్తుంది. దీంతో శ్రీహాన్‌ ఆమెను ఓదారుస్తాడు. 
 

మరిన్ని వార్తలు