Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌-6 కెప్టెన్సీ పోటీదారుల కోసం సిసింద్రీ టాస్క్‌

13 Sep, 2022 16:10 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం నామినేషన్స్‌ ప్రక్రియ ముగిసింది. దీంతో కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్‌ సిసింద్రీ టాస్క్‌ నిర్వహించింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటిసభ్యులకు కంటెండర్‌షిప్‌ ఒక బేబీ రూపంలో లభిస్తుంది. బేబీ బాగోగులు చూసుకుంటూనే సమయానుసారం బిగ్‌బాస్‌ కొన్ని ఛాలెంజెస్‌ ఇవ్వడం జరుగుతుంది. అసలే ఓసీడీ ఉన్న గీతూకి బేబీ డైపర్‌ మార్చమని ఆదేశం రావడంతో ఇంటిసభ్యులంతా ఆమెకు మరిన్ని డైరెక్షన్స్‌ ఇస్తూ జోకులేస్తుంటారు.

ఇక గేమ్‌ విషయానికి వస్తే.. ఈ టాస్కులో గోనెసంచులతో నడుస్తూ బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆదేశం మేరకు టాస్క్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా టాస్కులో విజేతగా గెలిచిన వారు ఇంటి కెప్టెన్‌గా నియమించబడతారు. ఈ గేమ్‌లో చలాకీ చంటీ, ఫైమాలతో రేవంత్‌కి గొడవ జరిగినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది. 'గేమ్‌ పోతేపోనీ కానీ, ఒకల్ని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం కంగ్రాట్స్‌ చంటి అన్నా' అంటూ రేవంత్‌ తన ఆవేదనని ప్రదర్శిస్తాడు.

ఆ తర్వాత ఫైమాతోనూ వాదనకు దిగగా.. 'నువ్వు గెలవడానికి నేను ఆడటం ఎందుకు అన్నా' అంటూ రేవంత్‌కి అదిరిపోయే కౌంటర్‌ ఇస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ టాస్కులో విజేతగా గెలిచి రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారన్నది చూడాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు