Bigg Boss 6: చంటికి షాకిచ్చిన బిగ్‌బాస్‌.. కెప్టెన్సీ రేసు నుంచి ఔట్‌

29 Sep, 2022 10:37 IST|Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో హోటల్‌ టాస్క్‌ నడుస్తోంది. బీబీ హోటల్‌ స్టాఫ్‌గా సుదీప, బాలాదిత్య, మెరీనా, గీతూ, రేవంత్‌, చంటి ఉంటే.. గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ స్టాఫ్‌గా వాసంతి, ఫైమా, కీర్తి, శ్రీసత్య, ఆరోహి ఉన్నారు. ఇక గెస్టులుగా శ్రీహాన్‌, ఇనయా, ఆదిరెడ్డి, రాజ్‌, అర్జున్‌ ఉన్నారు.  బీబీ హోటల్‌ మేనేజర్‌ సుదీప వచ్చి.. గెస్టులు వాష్‌ రూమ్‌కి వెళ్లాలి అనుకుంటే..  ప్రతి ఒక్కరు రూ.500 ఇవ్వాలని కండీషన్‌ పెట్టింది.

అయితే దీనికి ఆదిరెడ్డి ఓకే చెప్పగా.. సూర్య, రాజ్‌ మాత్రం మేం అల్రెడీ డీల్‌ మాట్లాడుకున్నాం. మాకు అవసరం లేదని చెప్పారు. మీకు ఏదైనా ఉంటే.. రెండు హోటళ్ల మేనేజర్లు కలిసి మాట్లాడుకోవాలని సూచించారు. దీంతో సుదీప వెళ్లి గ్లామ్‌ ప్యారడైజ్‌ హోటల్‌ మేనేజర్‌ ఫైమాతో మట్లాడింది. అయితే అక్కడ డీల్‌ పెట్టుకున్న ఫైమానే తొలుత ఎవరు ఎవరితో డీల్‌ పెట్టుకున్నారో తెలియదని దాటవేసే ప్రయత్నం చేసింది. చివరకు వాళ్ల టీమ్‌ వాళ్లతో చర్చించి.. డీల్‌ మాట్లాడుకోవడం తప్పేనని.. ఆ డబ్బులు తిరిగి ఇచ్చేశామని చెప్పారు.

ఇక మతిమరుపు క్యారెక్టర్‌లో ఉన్న సూర్యతో.. ‘నేను నీ ప్రేయసిని.. మర్చిపోయావా’అంటూ ఇనయా తనలో నిద్రపోయిన నటనను లేపింది. ఇక్కడ ఇద్దరూ ఆస్కార్‌ లెవల్‌ ఫెర్ఫామెన్స్‌ ఇచ్చారు.  ‘సూర్యా మనం ఇక్కడే కూర్చున్నాం.. ఇక్కడే పడుకున్నాం.. బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. ఇన్ని రోజులు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయావా? నిజంగానే నాకు నువ్ అంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా.. నువ్ నన్ను మర్చిపోతే నేను ఎలా బతకాలి’ అని ఇనయ అంటే.. ‘నిజంగా మనం ప్రేమించుకున్నామా? మనషులు అర్ధం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలా స్వచ్ఛమైనది అని భారీ డైలాగ్‌తో సూర్య చెలరేగిపోయాడు. 

ఇక వాష్‌ రూం దగ్గర కాపలాగా ఉన్న రేవంత్‌ దగ్గరకు ఆదిరెడ్డి వెళ్లి.. వాష్‌రూం వెళ్తానని అడుగుతాడు. అప్పుడు రేవంత్‌ ‘ లేదు బ్రో మా వాళ్లు మీటింగ్ పెట్టారు.. వాళ్లు చెప్పినట్టు చేయాలి.. ఇక్కడ నాకు వచ్చేది రూపాయి లేదు.. ఎవరికి వాళ్లు వాళ్ల ఫేవరేట్ పీపుల్‌ని కాపాడుకుంటున్నారు కాబట్టి.. ఇది ఎలాగూ తేలదు వాళ్లు చెప్పింది చేస్తే.. కనీసం వందో రెండొందలో వస్తుందని’ అన్నాడు ఇంతలో రోహిత్ వచ్చి.. రేవంత్‌ని చూసి నవ్వుతాడు. ఆది రెడ్డి కూడా గట్టిగా నవ్వడంతో.. ‘నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ని నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తాను’ అని అన్నాడు రేవంత్.

ఇక బిగ్‌బాస్‌ ఇరు హోటళ్ల సభ్యులను పిలిచి..ఎవరి దగ్గరు ఎంత డబ్బు ఉందో చెప్పమని అడిగాడు. దీంతో బీబీ హోటల్‌ దగ్గరు రూ.4600 ఉంటే.. గ్లామ్‌ ప్యారడైజ్‌ దగ్గరు 5300 ఉన్నాయని చెప్పారు. ఎక్కువ డబ్బులు ఉన్న గ్లామ్‌ ప్యారడైజ్‌ సభ్యుల ఆదిపత్యంలోకి బీబీ హోటల్‌ కూడా వస్తుందని బిగ్‌బాస్‌ చెప్పాడు. అంతేకాదు బీబీ స్టాఫ్‌ నుంచి ముగ్గురు సభ్యులను మాత్రమే తమ టీమ్‌లోకి తీసుకోవాలని.. మిగిలిన వారిని ఉద్యోగంలో నుంచి తీసేసి.. పోటీదారుల నుంచి తొలగించొచ్చని చెప్పాడు. దీంతో రేవంత్‌, ఆదిత్యలను తొలగించి.. సుదీప, గీతూ, మెరీనాలను తమ టీమ్‌లోకి తీసుకున్నారు. ఇక సీక్రెట్‌ టాస్క్‌లో విఫలమయ్యాడని చెబతూ.. చంటీని కెప్టెన్సీ పోటీదారుల రేసు నుంచి తొలగించాడు బిగ్‌బాస్‌. దీంతో రేవంత్‌,ఆదిత్యలతో పాటు చంటీ కూడా కెప్టెన్‌ అయ్యే చాన్స్‌ని మిస్‌ అయ్యాడు. 

మరిన్ని వార్తలు