Bigg Boss 6 Telugu Promo: 'బిగ్‌బాస్‌కు వచ్చేముందే పాప చనిపోయింది..కళ్లముందే అమ్మ కాలిపోయింది'

15 Sep, 2022 13:53 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6 రెండోవారం ఇంటి సభ్యులకు ఇచ్చిన సిసింద్రీ టాస్క్‌ పూర్తైంది. బేబీ బాగోగులు చూస్తూ సమయానుసారం బిగ్‌బాస్‌ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇంటిసభ్యులు చేసిన యాక్టివిటీ వినోదాన్ని పంచిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు(గురువారం)టెలికాస్ట్‌ అయ్యే ఎపిసోడ్‌ మాత్రం చాలా ఎమోషనల్‌గా ఉండబోతుందని ప్రోమోను బట్టి అర్థమవుతుంది.

ఇందులో బేబీస్‌తో రెండు రోజుల పాటు గడిపిన సమయం కారణంగా వాటితో ఏర్పరుచుకున్న బంధాన్ని బిగ్‌బాస్‌ గమినించాడని తెలుపుతూ ఇంటి సభ్యులు తమ జీవితంలో ఒక బేబీని ఉండటం, అది వారి జీవితాన్ని ఎలా మార్చింది అన్నది ఈ ప్రక్రియ ద్వారా పంచుకోవాలని ఆదేశించాడు. ఇందులో భాగంగా ఒక్కో ఇంటిసభ్యుడు తమ సాడ్‌ స్టోరీని వివరించి కంటతడి పెట్టించారు. 2015లో ప్రెగ్నెంట్‌ అని తెలిసిందనీ, కానీ థైరాయిడ్‌ ఎక్కువగా ఉండటంతో బేబీని కోల్పోయానంటూ సుదీప(పింకీ)ఎమోషనల్‌ అయ్యింది. తన చెల్లి కూతురిలో తన బిడ్డను చూసుకున్నానని, కానీ తనను తిరిగి ఇచ్చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిపోయిందని చెప్పింది.

ఇక రేవంత్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం తన భార్య 7వ నెల ప్రెగ్నెంట్‌ అని చెప్పాడు. చిన్నప్పటి నుంచి నాన్న అనే పిలుపుకు నోచుకోలేదు దీంతో ఎప్పుడెప్పుడు నాన్న అని పిలిపించుకోవాలా అని ఆత్రంగా ఉందని తెలిపాడు. ఇక బిగ్‌బాస్‌ ఇంటికి వచ్చేముందే తన కూతుర్ని పోగోట్టుకున్నానని చెబుతూ కీర్తి భట్‌ ఎమోషనల్‌ అయ్యింది. చివరి నిమిషంలో కూడా తన కూతురితో ఉండలేకపోయినందుకు బాధగా ఉందని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్‌బాస్‌ క్యూట్‌ కపుల్‌ మెరీనా అండ్‌ రోహిత్‌లు తమ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్‌ని వివరిస్తూ.. మూడోనెల దాటాక బేబీ హార్ట్‌బీట్‌ లేదని చెప్పారు. వేరే ఆప్షన్‌ లేదు..బేబీని తీసేయాల్సి వచ్చింది అని చెబుతూ ఏడ్చేశారు. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే చలాకీ చంటీ లైఫ్‌లో కూడా ఎవరకి తెలియని విషాదం ఉంది. తనకళ్ల ముందే ఫైర్‌ యాక్సిడెంట్‌ అయిందని,  తాను చూస్తుండగానే అమ్మ కాలిపోయిందని చెప్పడం అందరినీ కంటతడి పెట్టించింది. మొత్తంగా ఈవాల్టి ఎపిసోడ్‌ చాలా ఎమోషనల్‌గా ఉండనుంది.

మరిన్ని వార్తలు